.
రాజకీయాల్లో సహజమే… కాంగ్రెస్ ఏదో అంటుంది, బీఆర్ఎస్ కౌంటర్ వేస్తుంది… అనేకానేక వక్రబాష్యాలు, అబద్ధాలతో బీఆర్ఎస్ రోజూ దాడి చేస్తూ ఉంటుంది, కాంగ్రెస్ ఉల్టా దాడి అంత తీవ్రంగా ఉండదు… ఐతే రేవంత్ రెడ్డి చేస్తున్న ఓ తాజా విమర్శ, దాడికి గులాబీ క్యాంపు నుంచి, ప్రత్యేకించి కేసీయార్ కుటుంబం నుంచి నో కౌంటర్… సాధ్యం కాదు, సమాధానం లేదు… సైలెన్స్, కిమ్మనరు… తేలు కుట్టిన —
రేవంత్ రెండుమూడుచోట్ల విసిరాడు సూటిగా అస్త్రాలను… అది ఫ్యామిలీ జస్టిస్ వర్సెస్ సోషల్ జస్టిస్… పర్‌ఫెక్ట్ అటాక్… కేసీయార్ పాలనకాలంలో కేవలం తన కుటుంబానికీ, బంధుగణానికీ పెద్దపీటి వేసి, నెత్తిన పెట్టుకుంటే… కాంగ్రెస్ మాత్రం సామాజిక న్యాయాన్ని నమ్ముకుందనేది రేవంత్ రెడ్డి ఉదాహరణలతో ఏకరువుపెడుతున్నాడు… ఐనాదానికీ, కానిదానికీ మీదపడిపోయే హరీష్, కేటీయార్ నుంచి సౌండ్ లేదు…
Ads
నిజానికి రేవంత్ రెడ్డి ఆ లాగూలు, తొండల భాష వదిలేసి… ఇలాంటి అటాక్ కంటిన్యూ చేస్తే బెటరేమో… తనేమంటాడంటే..?
‘‘ఎంతసేపూ గొర్రెలు, బర్రెలు పెంచుకొండి, చెప్పులు కుట్టుకొండి, ఎప్పుడూ మీరలాగే ఉండిపొండి అనేది కేసీయార్ పాలన, కానీ మేం చదివిస్తాం, పదవులిస్తాం, ప్రాధాన్యమిస్తాం, ఇది మా పాలన…
కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన కొడుకు కేటీఆర్‌ను కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేశాడు… కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మహేష్ గౌడ్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేశాం… కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు, కేటీఆర్ కీలక మంత్రులయ్యారు… రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పొన్నం, వాకిటి, సీతక్క, కొండా సురేఖ మంత్రులయ్యారు….
కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే సంతోష్ రావును రాజ్యసభకు పంపారు… నేను ముఖ్యమంత్రి అయితే అనిల్ కుమార్ యాదవ్‌ను రాజ్యసభకు పంపాను. వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపాను. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఓడిపోయిన వినోద్ రావును ప్రణాళికా సంఘం ఛైర్మన్ చేశారు. నేను కోదండరామ్‌ను ఎమ్మెల్సీని చేశాను.
కేసీఆర్ సీఎం అయితే తన బిడ్డను ఎంపీ, ఎమ్మెల్సీ చేశాడు.. నేను వీరనారి చాకలి ఐలమ్మ మనుమరాలిని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాను.
కేసీఆర్‌ది కుటుంబ న్యాయం, నాది సామాజిక న్యాయం. కేసీఆర్‌ది దొరల న్యాయం, మాది సామాజిక న్యాయం. వందల ఎకరాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు. మేం గ్రామ గ్రామాన ఏడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నాం. హాస్పిటల్స్ పూర్తి చేస్తున్నాం…
ప్రగతి భవన్, సచివాలయానికి ఎవరినీ రానివ్వలేదు వాళ్లు. అందెశ్రీ పాటకు విముక్తి కల్పించాం. గద్దర్ పేరును శాశ్వతంగా నిలిపాం. బీసీ కులగణన చేశాం. ఎస్సీ వర్గీకరణ చేశాం. మాది బహుజన రాజ్యం…’’
….. ఇలా పడుతున్నయ్ పంచులు… గుడ్… వీటిలో ఖండించడానికి ఏమీ లేదు, అన్నీ నిజాలే… అవును, జనం కోరేది కూడా అదే, నిజాలతోనే కొట్టండి అని..! చివరగా… సచివాలయం దగ్గర ఒక సర్వాయి పాపన్న విగ్రహం పెట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం… తొమ్మిదిన్నరేళ్లలో ఇలాంటి ఆలోచన ఒక్కటైనా చేశారా కేసీయార్ పాలనలో..?!
Share this Article