.
తెలంగాణ జనం తెల్ల కల్లు, మటన్ పిచ్చోళ్లు అన్నట్టుగా పిచ్చి వ్యాఖ్యలు చేసి, ఆంధ్రావాళ్లతో పోలిస్తే తెలంగాణవాళ్లు వేస్ట్ అన్నట్టు దిల్ రాజు నిజామాబాద్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్ సభలో మాట్లాడి తీవ్ర విమర్శల పాలయ్యాడు…
ఈయననేనా రేవంత్ రెడ్డి ప్రేమించి ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంటూ రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల కూడా విమర్శలొచ్చాయి… ఈమధ్య రిపోర్టర్లను చూసి సినిమావాళ్లు, సినిమావాళ్లను చూస్తూ విలేకరులు తిక్క వ్యాఖ్యలకు దిగుతున్నారా..? అని గత పోస్టులో చెప్పుకున్నాం కదా…
Ads
చివరకు యాంకర్లు, హోస్టులు కూడా అదే బాట… చివరకు ఇండస్ట్రీ కంపు అయిపోతోంది… అదే నిజామాబాద్ సభలో శ్రీముఖి ఏదో సందర్భంలో దిల్ రాజును, శిరీష్‌ను మెచ్చుకోవడానికి పిచ్చి కూతలకు దిగింది… ఆనాడు రామలక్ష్మణులు ఫిక్షనల్ కేరక్టర్టయితే ఈ దిల్ రాజు, శిరీష్‌లు రామలక్ష్మణుల్లా కనిపిస్తున్నారు అంటూ ఏదేదో చెప్పింది…
వాళ్లను ప్లీజ్ చేయడానికి నీ కష్టాలు, నీ వేషాలు నీవి వేసుకో గానీ రామలక్ష్మణులను ఫిక్షనల్ కేరక్టర్లు అంటావా అని హిందూ మతస్తులు ఆమెపై ట్రోలింగు, విమర్శలకు దిగారు… కొందరు మరీ ఘాటుగా… సెగ బాగానే తగిలింది శ్రీముఖికి… చిన్న ఉదాహరణ ఇదిగో…
నిజానికి శ్రీముఖి పిచ్చి కేకలు, అరుపులతో, తన ఓవరాక్షన్‌తో చిరాకెత్తిస్తుంది తప్ప… ఎప్పుడూ బ్యాలెన్స్‌డ్‌గానే ఉంటుంది… ఇన్నేళ్ల ఆమె కెరీర్‌లో ఇలాంటి పొల్లు మాటలు ఎప్పుడూ వినిపించలేదు… కానీ సొంత జిల్లా జనాన్ని చూశాక, దిల్ రాజు ప్రాపకం కోసం ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పినట్టుంది… కానీ ఈ సెగతో తత్వం బోధపడింది…
వెంటనే హిందువులకు క్షమాపణలు అంటూ ఈ వీడియో రిలీజ్ చేసింది… ‘‘నేనూ హిందువునే, నేనూ భక్తరాలినే… పొరపాటు జరిగింది… నన్ను క్షమించండి’’ అని ఆ వీడియో సారాంశం… ఇదీ ఆ వీడియో లింక్…
https://www.facebook.com/reel/628393929692712
అందుకే పెద్దలు చెప్పేది… పెదవి దాటితే పృథ్వి దాటుతుంది అని… ఒకసారి మాట తూలితే, జారితే మళ్లీ వెనక్కి తీసుకోవడం కష్టం అని… ఇప్పుడు క్షమాపణలు చెప్పినా సరే, పిచ్చి కూతలకు, ఇన్నేళ్ల కెరీర్ సీనియారిటీ ఉన్న ఈమె కూడా అతీతం కాదనే ముద్ర పడిపోయింది… (అడుసు తొక్కనేల అనే విమర్శలూ వస్తాయి శ్రీముఖిపై… పైగా వీలైనంతవరకూ పొరపాట్లు జరగకుండా ప్రయత్నిస్తుందట…)
టీవీ ప్రోగ్రాముల్లో ముందుగా రికార్డింగ్, షూటింగ్ జరిపినప్పుడు ఏవైనా తప్పులు దొర్లితే ఎడిటింగులో తీసేయవచ్చు… కానీ ప్రత్యక్ష ప్రసారాల్లో… అదీ వేలాది మంది జనంతో జరిగే బహిరంగ సభల్లో… ప్రత్యేకించి దేవుళ్ల మీద వ్యాఖ్యానాలు చేసేటప్పుడు నాలుక మీద అదుపు ఉండాలి… శ్రీముఖి వ్యాఖ్యలు చెబుతున్న పాఠమిదే..!!
Share this Article