.
“ఓ వసన్దరాజా తేన్ సుమన్ద రోజా…” 1984లో వచ్చిన నీఙ్‌ళ్ కేట్టవై తమిళ్ష్ సినిమాలోని పాట… స్రోతస్విని రాగంలో చేశారు ఈ పాటను ఇళైయరాజా. ఇళైయరాజాకు ముందు సినిమా పాటల్లో అశ్వత్థామ మాత్రమే స్రోతస్విని రాగాన్ని ఉపయోగించారు. కార్తవరాయని కథ (1958) సినిమాలో “మూగే చీకటి ముసుగులో…” పాటను అశ్వత్థామ స్రోతస్విని రాగంలో చేశారు.
(తెలుగు నాసిరకం అభిరుచికి బలైపోయిన గొప్ప సంగీత దర్శకుడు అశ్వత్థామ; ‘ఘంటసాలే పాడాలంటే తనకు సినిమాలు వద్దు’ అన్న స్థాయి ‘సంగీతజ్ఞత’, నాణ్యత, కళాభిజ్ఞత ఉన్న తెలుగు వారు అశ్వత్థామ)
Ads
శుద్ధ ధన్యాసి లేదా ఉదయ రవిచంద్రిక రాగంలోని ని2 కు బదులుగా ని3 ఉంటే స్రోతస్విని రాగం. స్రోతస్విని ఆరోహణ, అవరోహణాల్లో ఐదు స్వరాలుండే రాగం. ఔఢవ రాగం. (pentatonic)
చాల గొప్ప రాగం; మధురమైన రాగం. సోయగం, హాయి కలగలసిన రాగం. మేలైన శ్రవ్య శుభగత్వంతో భవ్యమైన రాగం.
స్రోతస్విని రాగంలోని సోయగాన్ని, హాయిని, శ్రవ్య శుభగత్వాన్ని ఒడిసిపట్టుకున్న తొలి సినిమా సంగీత దర్శకుడు ఇళైయరాజా!
స్రోతస్విని రాగ సౌందర్యానికి, రాగ సారానికి తన మేధను ప్రయుక్తం చేసి ఈ “ఓ వసన్దరాజా తేన్ సుమన్ద రోజా…” పాటను చేశారు.
కడు గొప్ప బాణి. Preludeను వెస్టన్ chordతో మొదలుపెట్టి ఏ మాత్రమూ కుదుపు, అదురు లేకుండా కర్ణాటక సంగీతంలోకి సాగి అటుపై పల్లవిని స్పృశించడం చాల గొప్పగా ఉంటుంది. పాటంతా గొప్ప rhythm arrangement.
పల్లవికి ఒక rhythm arrangement,
మొదటి చరణానికి ఒక rhythm arrangement, రెండో చరణానికి ఒక rhythm arrangementతో తన సృజనాత్మకత వైదుష్యాన్ని ప్రదర్శించారు ఇళైయరాజా. 1st interlude లో కర్ణాటక సంగీతానికి, 2nd interludeకు వెస్టన్ సంగీతానికి ప్రాధాన్యతను ఇచ్చి గొప్ప వాద్య సంగీతాన్ని సమకుర్చారు. పాటంతా కర్ణాటక సంగీతం, వెస్టన్ సంగీతం మేళవింపు ప్రతిభావంతంగా ప్రస్ఫుటమౌతూ ఉంటుంది. ప్రౌఢమైన పాట; ప్రశస్తమైన పాట ఇది.
ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి పాడారు. ముఖ్యంగా బాలు గానం స్వర సమంతో, మాధుర్యంతో, moodతో, verveతో, freely flowing vocal lineతో, animationతో ఎంతో బావుంటుంది.
వినండి:
తెలుగు సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో ఇళైయరాజా “జై చిరంజీవ జగదేక వీర…” పాటను స్రోతస్వినిలోనే చేశారు. ఇళైయరాజా తరువాత సంగీత దర్శకుడు విద్యాసాగర్ మాత్రమే ఈ రాగంలో పాట చేశారు. విద్యాసాగర్ చంద్రముఖి సినిమాలో “రా రా చెంతకు చేరా…” పాటను ఈ రాగంలో చేశారు. (విద్యాసాగర్ తెలుగు స్థాయికి అందని గొప్ప తెలుగు సంగీత దర్శకుడు)
రోచిష్మాన్
9444012279
Share this Article