.
నిజంగానే టీవీ నటి ప్రేమీ విశ్వనాథ్ అలియాస్ వంటలక్క లక్కీ… ఆమె చేసేదే ఒకటీఅరా సీరియల్స్, అవీ జాగ్రత్తగా ఎంపిక చేసుకుని…
ఆమె మలయాళీ… ఐనా అక్కడ తను చేసినవి కూడా చాలా తక్కువ సీరియల్స్… రెండో మూడో… అందులో బాగా పేరు తెచ్చిపెట్టింది కరుతముత్తు… బ్లాక్ షేడ్స్ ఉన్న అమ్మాయి పాత్ర… బ్రహ్మాండంగా హిట్ ఆ సీరియల్…
Ads
తెలుగులో దాన్నే కార్తీకదీపం సీరియల్‌గా రీమేక్ చేశారు… సూపర్ హిట్… స్టార్ హీరోల సినిమాలు ప్రసారం చేస్తే కూడా రానంతగా రేటింగ్స్ వచ్చేవి ఈ సీరియల్‌కు…. టీవీ ఉన్న ప్రతి ఇంటికీ ఆమె పరిచయం అయ్యింది… ఇంటి మనిషి అయ్యిందంటే ఆశ్చర్యం లేదు…
నిజానికి మలయాళీ సీరియల్ అనువాదమే ఐనా… ఈ రేటింగ్స్ చూసుకుని, ఇష్టారాజ్యంగా సీరియల్‌ను నానా వంకర్లూ తప్పి, పిచ్చి ప్రయోగాలు చేసి చివరకు సీరియల్‌ను భ్రష్టుపట్టించారు… ఆ నిర్మాతలే చెల్లమ్మ అనే మరో మలయాళీ సీరియల్‌ను తీసుకుని కార్తీకదీపం2 పేరిట మరో సీరియల్ స్టార్ట్ చేశారు… కానీ కార్తీకదీపం మొదటి భాగానికీ దీనికీ ఏ లింకూ లేదు…
ఈ సీరియల్‌కు కూడా ఫోటోగ్రాఫర్, మోడల్, లాయర్ కమ్ టీవీ- సినిమా ఆర్టిస్టు ప్రేమి విశ్వనాథే ప్రాణం… కార్తీకదీపం సీరియల్‌ను ఎలా చివరలో భ్రష్టుపట్టించారో ఇప్పుడు కార్తీకదీపం-2ను కూడా అలాగే ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు… సరే, దాదాపు అన్ని టీవీ సీరియళ్లూ అంతే కదా…
కానీ ఆమె అదృష్టమో, స్టార్ మా రేటింగుల మాయో గానీ… అప్పట్లో ఆ కార్తీకదీపం ఎలా ఫస్ట్ ప్లేసో… ఇప్పుడు ఈ కార్తీకదీపం అలాగే ఫస్ట్ ప్లేస్… తెలుగు టీవీ సీరియళ్లలో కన్నడ ఆర్టిస్టులదే హవా… ఈమె ఒక్కతే మలయాళీ… ఐనా మిగతా వాళ్లెవరికీ అందనంత ఎత్తులో ఉంటుంది… ఆమె రెమ్యునరేషన్ కూడా… పిచ్చి టీవీ షోలకు రాదు, ఇంటర్వ్యూలు ఇవ్వదు, రీల్స్ చేయదు, షాపుల ఓపెనింగ్ వెళ్లదు… భలే కేరక్టర్…
తాజా బార్క్ రేటింగ్స్ చూస్తే ఏ వారమైనా సరే దాదాపు 12 వరకూ ఉన్నాయి రేటింగ్స్… సో, స్టిల్ తెలుగు టీవీ సీరియళ్లకు సంబంధించి ప్రేమీ విశ్వనాత్ స్పష్టమైన డామినేషన్… టీవీ శోభన్ బాబుగా పిలవబడే నిరుపమ్ పరిటాల ఉన్నా సరే ప్రేమి పాత్రకే ప్రాధాన్యం…
స్టార్ మా సీరియళ్లలో తరువాత స్థానాల్లో ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఇంటింటి రామాయణం, గుండె నిండా గుడిగంటలు, చిన్ని, నువ్వుంటే నా జతగా కొనసాగుతున్నాయి… ఫాఫం, జీ తెలుగు సీరియల్స్ సత్తా సరిపోవడం లేదు… అసలు టాప్ 30 జాబితాలో ఒక్క జీతెలుగు సీరియల్ కూడా ఉండటం లేదు…
జీతెలుగు సీరియల్స్‌లో మేఘసందేశం ఫస్ట్, తరువాత ప్లేసు జగద్ధాత్రి… పడమటి సంధ్యారాగం, చామంతి, నిండు నూరేళ్ల సావాసం, అమ్మాయిగారు వరుసగా తరువాత ప్లేసుల్లో… మొదట్లో అమ్మాయిగారు కాస్త మంచి రేటింగ్సే పొందినా తరువాత క్రమేపీ దిగజారిపోయింది… ఈటీవీలో రియాలిటీ షోల రేటింగ్స్ పతనం కొనసాగుతోంది… జెమిని అనే చానెల్ ఉందని జనం మరిచిపోతున్నారు తెలిసిందే కదా…
Share this Article