.
ఒక దశలో దాసరి నారాయణరావు పేరు గానీ, వార్తలు గానీ, ఫోటోలు గానీ ఈనాడు, సితార పత్రికల్లో రాకుండా రామోజీరావు నిషేధం విధించాడు… స్ట్రిక్టుగా అమలైంది కూడా… (తరువాత కొన్నేళ్లకు అది సమసిపోయింది…)
ఐతే వాళ్లిద్దరికీ ఎక్కడ చెడింది..? ఇద్దరూ మీడియాలో ఉన్నారు, ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు… ఎందుకు ఆ దూరం ఏర్పడింది..? చాలామందికి అసలు కథ తెలియదు… అప్పటి పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి ప్రముఖ రచయిత యెర్రంశెట్టి శాయి…
Ads
not only ban on dasari news coverage… beyond that…. తన వాల్ మీద షేర్ చేసుకున్న వివరాలు… కాస్త అక్కడక్కడా కుదించి… ఆయన మాటల్లోనే… ఆసక్తికరం…
మీకు తెలీని ఓ సినిమా కథ… నేను సితార మాగజైన్ లో కొంత కాలం సినిమా వాళ్ళ మీద సెటైరికల్ కామెడీ కథలు రాశాను. అవి రెండు పుస్తకాలుగా వచ్చాయ్. సినీ పంచతంత్రం, సినీ బేతాళం…
అప్పట్లో ఇండస్ట్రీ ఇంకా పూర్తిగా హైద్రాబాద్ కి షిఫ్ట్ అవలేదు. అందుకని చెన్నై వెళ్లి సినిమా స్టోరీలన్నీ స్టడీ చేయాల్సి వచ్చింది . ఆ టైమ్ లో జ్యోతి మాసపత్రిక ఎడిటర్ వేమూరి సత్యనారాయణ గారు సినిమా ఫీల్డ్ లోని విషయాల గురించి చాలా వివరాలు అందించారు.
సినీ ఫీల్డ్ లో సినీ ప్రముఖుల మధ్య జరిగిన ఒక ఓపెన్ క్లాష్ గురించి మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలని నాకనిపించి ఈ స్టోరీ ప్రజెంట్ చేస్తున్నాను … ఇది జరిగి షుమారు 40 ఏళ్లు అవుతుందేమో…
అప్పట్లో సితారలో ఒక రచయిత వర్క్ చేస్తుండే వారు ఇంచార్జీగా… నేను మామూలుగా అప్పుడప్పుడు అందులో సినిమాల మీద సెటైర్ రాస్తూండే వాడిని. ఒకరోజు నేను నాంపల్లి స్టేషన్లో డ్యూటీలో వుండగా ఈనాడు నుంచి ఫోన్ వచ్చింది.
ఒకసారి వచ్చి రామోజీరావు గారిని కలుసుకోవాలి అన్నారు రామారావ్ గారు. అంతకు ముందు ఒకే ఒక్కసారి రామోజీ రావ్ గారిని కలిసాను. సాయింత్రం డ్యూటీ అయ్యాక వెళ్లి రామోజీ రావ్ గారిని కలుసుకున్నా…
అప్పటికే అక్కడ రామారావ్ గారు, శ్రీకంఠ మూర్తి గారు వున్నారు. శ్రీకంఠ మూర్తితో అప్పటికే మంచి రచనలు చేసిన రచయిత కాబట్టి నాకు పరిచయముంది. అదివరకు సితార ఇంచార్జీగా పని చేసిన రచయిత స్థానంలో శ్రీకంఠమూర్తిని నియమించినట్లు రామారావ్ గారు చెప్పారు.
అప్పుడు రామోజీరావు గారు మాట్లాడారు. ‘సాయి గారూ. మేటర్ చెప్పేముందు మీకు ఇక్కడ ఈ మధ్య జరిగిన కొన్ని విషయాలు చెప్పాలి. ఈమధ్య దాసరి నారాయణరావు గారు రిలీజ్ చేయబోతున్న లేటెస్ట్ మూవీ గురించి మీకు తెలిసే వుండాలి’
తెలుస్సార్ అన్నాను.
అట్లూరి రామారావ్ గారు, శ్రీకంఠ మూర్తి వారందరి మాటల్లో అంతకు ముందు కొద్ది రోజుల క్రితం జరిగిన విషయాలు ఇవీ:
సితార ఇంచార్జీగా పని చేస్తున్న వ్యక్తి దాసరి రిలీజ్ చేయబోతున్న సినిమాకి పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఆ సినిమాకి సితార గైడ్ లైన్స్ కి , పాలసీకి విరుద్ధంగా సితారలో అతిగా పబ్లిసిటీ చేయటం మొదలు పెట్టాడు.
ఇది రామోజీ గారి దృష్టికి తీసుకెళ్లారు అట్లూరి రామారావ్ గారు.
వెంటనే ఆ ఇంచార్జీనీ పిలిచి అలా ఒక వ్యక్తికి – ఒక బానర్ కి ఎందుకు స్పెషల్ కవరేజ్ ఇచ్చావని అడిగారు ఆయన. అతను తన తప్పుని గ్రహించి ఏదో ఎక్సప్లనేశన్ ఇచ్చుకున్నాడు. ఇంకోసారి అలాంటివి జరగకుండా చూసుకోమని హెచ్చరించి వదిలేశారు రామోజీ గారు.
ఆ ఇంచార్జీ స్థానంలో ఇంకెవరున్నా గానీ చేయాల్సింది ఏమిటంటే అప్పటి నుంచీ సితార పాలసీకి అనుగుణంగా వర్క్ చేసుకోవటం. అయితే ఆ వ్యక్తి అలా చేయలేదు.
తిన్నగా వెళ్లి దాసరిని కలుసుకున్నాడు. ఆయన సినిమా న్యూస్ కవర్ చేసినందుకు తనను రామోజీ గారు నీలదీసినట్లు , తనను నానా మాటలూ అన్నట్లు… ఇంకా ఏమేం కప్లెయింట్ చేశాడో తెలీదు. అసలు అలా ఎందుకు చేశాడో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం.
అప్పటికే దాసరి సినిమాలు మంచి సక్సెస్ లో వుండడంతో… ఆఫ్టరాల్ సితార, నా లెవల్ ఏంటి, ఆఫ్టరాల్ ఒక సినిమా మాగజైన్ లెవల్ ఏంటి అనే ఫీలింగ్ తో రియాక్ట్ అయాడు. వెంటనే రామోజీ రావ్ గారికి ఫోన్ చేశాడు .
‘చూడండి. నా మూవీస్ న్యూస్ గానీ స్టిల్స్ గానీ ఏవీ ఇకముందు మీ మాగజైన్ లో పబ్లిష్ చేయడానికి వీల్లేదు’ అన్నాడు.
అందుకు రామోజీరావు గారిచ్చిన సమాధానం ఇదీ: ‘అలాంటిదేమీ జరగదు. కానీ ఒకవేళ ప్రస్తుతం ప్రింట్ లో వున్న సితార ఇష్యూలో ఇప్పటికే -ఏదైనా -ప్రింట్ అయివుంటే నేనేం చేయలేను…’ ఆ సమాధానం దాసరి ఇగోని ఇంకా హర్ట్ చేసింది… (సో, రామోజీరావు తనంతట తాను దాసరి మీద నిషేధం విధించలేదు… అలా విధింపచేయబడ్డాడు అన్నమాట…)
ఆ రోజు నుంచీ క్లాష్ మొదలయింది. సితారలో దాసరి ఫిలింస్ తాలూకు న్యూస్ గానీ , స్టిల్స్ గానీ ప్రింట్ ఆపేసారు. ఈ గొడవకు కారణమయిన సితార ఇన్చార్జి తన జాబ్ వదిలేసి దాసరి స్క్రిప్ట్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయినట్లు తెలిసింది.
అప్పటికే పీక్ లో ఉన్న దాసరికి సితార లాంటి పెద్ద మాగజైన్ అండ లేకపోయేసరికి కొంత ఇబ్బంది కలిగి వుండొచ్చు. సినిమా ఫీల్డ్ ఎలా వుంటుందంటే అచ్చం రాజకీయ రంగంలాగానే వుంటుంది. ఒక ప్రముఖుడి ప్రాపకం కోసం వాళ్ళు ఎన్ని వేషాలేస్తారో అందరికీ తెలిసిందే.
ఈ గొడవంతా దాసరి ప్రాపకం కోసం ఎక్సప్లాయిట్ చేసే బాచ్ ఒకటి దాసరిని రెచ్చగొట్టారు. ఆఫ్టరాల్ సితార లేకపోతే ఏమిటి? మీరే సినిమా మాగజైన్ పెట్టండి అంటూ భజన మొదలెట్టేసరికి ఆయన ఆవేశంగా ఉదయం న్యూస్ పేపర్ తో పాటు సినిమా మాగజైన్ స్టార్ట్ చేసాడు.
నిజానికి ఉదయం అందరూ అనుకున్న దానికంటే బాగానే సక్సెస్ అయింది. కానీ న్యూస్ పేపర్ నడపటం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. రామోజీరావు అనే ప్రిన్సిపుల్డ్ మరియు బిజినెస్ మైండెడ్ వ్యక్తులు నడిపితేనే అలాంటివి పదికాలాల పాటు నడుస్తాయి. ఆ సామర్థ్యం లేకపోబట్టే దాసరి పబ్లికేషన్స్ మూత బడినాయ్.
సరే, ఆ మేటర్ అలా వదిలేస్తే అప్పుడు సినీ ఫీల్డులో వున్న మోసాల గురించి సెటైర్ రాయమని రామోజీరావు గారు కోరటం, నేను కొద్ది రోజులు వేమూరి సత్యన్నారాయణ గారి సహకారంతో , మద్రాస్ లో వుండి అక్కడి దారుణాలన్నీ తెలుసుకుని సినీ బేతాలం, సినీ పంచతంత్రం రాయటం జరిగింది. అందులో దాసరి గారి వ్యవహార శైలికి సంబంధించిన కథలు కూడా వున్నాయి… (యెర్రంశెట్టి సాయికి ధన్యవాదాలతో…)
Share this Article