Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యాంకర్ అనసూయమ్మ గారూ… మొత్తానికి మీరు మారిపోయారు మేడమ్…

July 15, 2024 by M S R

యాంకర్ అనసూయ… ఇప్పుడలా అనకూడదేమోనట కదా, సరే, రంగమ్మత్త అనసూయమ్మ గారూ… మీరు మారిపోయారు మేడమ్ అని నెటిజనం హాశ్చర్యపోతున్నారు… నిజం… ఆమె అనసూయేనా అని నాలుగుసార్లు సదరు ట్వీట్ ఖాతాను ఫ్రెష్ కొట్టీ కొట్టీ చెక్ చేస్తున్నారు…

విషయం ఏమిటంటే..? అనసూయ అంటేనే ఓ ఫైర్ కదా… అంటే పుష్ప బాపతు ఫైర్ కాదు… సోషల్ మీడియాలో తన మీద చిన్న వాక్యం నెగెటివ్‌గా కనిపించినా, అనిపించినా వెంటనే సదరు ట్రోలర్‌ను తిట్టేస్తుంది… చాకిరేవు పెడుతుంది అక్కడే… ఒరేయ్, నీ యంకమ్మా, నీ మీద సైబర్ క్రైమ్ కేసు పెడుతున్నా, ఇక నీ పని ఖతం అని దులిపేస్తుంది కదా…

ఉత్తినే రియాక్ట్ అయిపోతూ ఉంటుంది… పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ, సోషల్ మీడియాలో కొన్ని ఫుల్ రొమాంటిక్ ఫోటోలు పెడతూ… ఎవరైనా కాస్త స్పందించి వెటకారంగానో, విమర్శిస్తూనో లేదా తామూ ఫ్లర్ట్ చేస్తూనో కామెంట్స్ పెట్టినా, పోస్టులు పెట్టినా వాడిని దడదడ షూట్ చేసేస్తూ ఉంటుంది…

Ads

అలాంటిది ఒకరి పోస్టుకు స్పందిస్తూ ఈసారి… ‘‘నా మానసిక శాంతి కోసం నేను ఇలాంటివాటికి రియాక్ట్ కాకూడదని భావిస్తున్నాను… కానీ అప్పుడెప్పుడో నాలుగేళ్ల క్రితం నేను మహానటి సావిత్రమ్మకు నివాళిగా చేసిన ఓ పర్‌ఫామెన్స్ గురించి చులకనగా పోస్ట్ పెట్టడం అంటే, అది ఆమెను అగౌరవపరచడమే… అది బాబుగారింట్లో బుట్టభోజనం అనే ప్రోగ్రాం, జీ5లో ఉంది, మొత్తం చూసి అప్పుడు స్పందించండి… పారదర్శకమైన, సమంజసమైన విమర్శలు నాకు వోకే… నా పర్‌ఫామెన్స్ మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ అలాంటివారికి నివాళి అర్పించే కార్యక్రమాల మీద మరీ ఇలాంటి విమర్శ కాదు… మిగతావాటిపై నన్ను విమర్శిస్తానంటే వోకే…’’



Hello Teju! Hope you are well!! I decided for my own peace not to react on anything mean.. but I have been seeing this particular bit of my performance giving a tribute to the Mahanati Savithramma for one of the festival events on a channel 4 years back.. using it in a very… https://t.co/u05s1L16oG

— Anasuya Bharadwaj (@anusuyakhasba) July 15, 2024



నిజానికి ఆ షోలో అనసూయ పర్‌ఫామెన్స్ అస్సలు బాగాలేదు… ఆమె ఆ పాత్రకు అస్సలు సూట్ కాలేదు… కానీ అదే చెప్పేస్తే సరిపోయేది… పర్‌ఫామెన్స్ బాగాలేదని చెప్పొచ్చు, అదేదో అప్పుడే చెప్పేస్తే అయిపోయేది, ఇప్పుడు మళ్లీ ఎందుకు ఆమెను టార్గెట్ చేస్తున్నారో తెలియదు… అదంతా వోకే…

ఇలాంటి విమర్శల పట్ల కస్సుమని అంతెంతుకు ఎగిరిపడే అనసూయ ఇంత సాఫ్ట్‌గా, ఇంత మర్యాదగా… అదీ నేను సద్విమర్శను ఆహ్వానిస్తాను అన్నట్టుగా పెట్టిన సుదీర్ఘమైన పోస్టే ఆశ్చర్యం, అంతే… సో, మీరు మారిపోయారు మేడమ్… ప్చ్, అనసూయ పాత అనసూయగా ఉంటేనే బెటర్ అనిపిస్తోందా..? సహజమే… ఆమె పాత ధోరణి తెలిసినవాళ్లు అలాగే అనుకుంటారు..!! అసలు ఆంటీ అనే పదం మీద జరిగిన రచ్చ గుర్తుంది కదా… మీ కోపాన్ని మీరు వదిలేయొద్దు మేడమ్…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions