Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పొద్దుగాల సిన్సియర్‌గా డ్యూటీకి వస్తే… ఇంత అవమానిస్తారా సార్..?

September 17, 2024 by M S R

మునుగోడు ఎమ్మెల్యే శ్రీమాన్ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సాబ్… ఏమిటి మీరు చేస్తున్న పని..?

సరే, ఓ మందు షాపుల వద్దకు వెళ్లారు… ఈ మందు షాపుల ఆకస్మిక తనిఖీలు ఏమిటి..? ఎవరైనా ఆఫీసులో, స్కూళ్లో, హాస్టళ్లో, ఇంకా ఏవైనా ప్రజావసరాల సంబంధిత వ్యవస్థలో తనిఖీలు చేస్తారు… మంచీచెడూ కనుక్కుంటారు… కానీ తమరేమిటి ఇలా మందు షాపులు బాగా నడుస్తున్నాయా లేదాని తనిఖీలు చేస్తున్నారు..?

సరే, చేశారు… ప్రభుత్వ ఖజానాకు ఆదాయం ముఖ్యం కాబట్టి, తమ పరిధుల్లోని మద్యం దుకాణాలను ఇలాగే ప్రతి ఎమ్మెల్యే సందర్శించి, తనిఖీలు చేసి, అవి సజావుగా నడిచేలా చూడాలి… మీరు స్పూర్తి… నకిలీ మద్యం అమ్ముతున్నారా అని పరిశీలించారు, గుడ్, ఖజానాకు మహారాజపోషకులైన మందుబాబుల ఆరోగ్యం బాగుంటేనే కదా వ్యవస్థలు బాగుండేది…

Ads

వాడు బాగుంటేనే కదా, ఖజానా నిండేది… ఉద్యోగులకు జీతభత్యాలు సక్రమంగా వచ్చేది… వ్యవస్థలు నడిచేది… సో, వాడు బాగుండాలి, ఉండాలంటే కల్తీ మద్యం రావద్దు… ఇవన్నీ నిజమే గానీ… బెల్టు షాపుల బెడద గురించి అడగడం ఏమిటి..? అవి నడిస్తేనే కదా, జనం నాలుగు సీసాలు ఎక్కువ తాగేది..? ఖజానాకు నాలుగు రాళ్లు ఎక్కువ జమయ్యేది..?

liquor

పాపం, పొద్దుగాల పొద్దుగాల తమ డ్యూటీ నిర్వర్తించడానికి వచ్చిన త్యాగజీవులను మందలించడం ఏమిటి అసలు..? అలా నిరుత్సాహపరిస్తే జనం ఎంత షాక్‌కు గురవుతారు..? ఎక్సయిజు, జీఎస్టీ గట్రా ఖజానాకు ధారబోయడానికి తగిన ఉత్సాహం, జోష్, కిక్కు ఎలా వస్తాయి..?

అసలే పేద కుటుంబాలు, పూట గడవడం ఎలా..? పెళ్లాంపిల్లలు ఏమైపోవాలి అని దబాయించి గట్టిగా నిలదీస్తే పాపం వాళ్ల మనసులు చిన్నబుచ్చుకోవా..? ఎర్లీ మార్నింగు డ్యూటీకి వచ్చినా సరే తిట్లు తినాల్సిందేనా..?

పొద్దుగాల పర్మిట్ రూమ్స్ తెరిస్తే బాగుండదు అని ఆదేశిస్తే ఎలా సార్..? అంతంత డబ్బులు పోసి పెట్టుకున్న మందు దుకాణాలు… బొచ్చెడు డబ్బు కడుతున్నారు ప్రభుత్వానికి… ప్రభుత్వమే పర్మిట్ రూమ్స్ ‘పనివేళలు’ ఖరారు చేసింది… మరి పొద్దుగాల మూసేయాల్సిందే అంటే ఎలా..? సాయంత్రం మాత్రమే పర్మిట్ రూమ్స్ తెరుస్తాము అంటే మందుబాబులకు ఎంత అవమానం..? ఎంత నామర్దా..?

పొద్దునపూట పర్మిట్ రూమ్స్ తెరవకుండా ఓ పాలసీ తీసుకురావాలి సార్… రేవంత్ రెడ్డితో సీరియస్‌గా డిస్కస్ చేయొచ్చుగా ఓసారి… ఓన్లీ ఈవెనింగ్ పర్మిట్, నో మార్నింగ్ పర్మిట్ అని తేల్చిపారేస్తే సరి… ఈసారి వైన్స్ దందాలో ఎంతమంది మిగులుతారో చూద్దాం… ఏమంటారు సార్..? సారూ, జెర పైలం… మందుబాబులతో పెట్టుకుని అంత జగనుడే కళ్లు తేలవేశాడు మరి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • *99 రోజుల ప్రోగ్రాం* వెనుక రేవంత్ రెడ్డి లక్ష్యాలేంటి- సవాళ్లేంటి…!!
  • ‘‘ఏం..? ఆమెకు ఓ కొత్త జీవితం ప్రసాదించాలనుకున్నాడు, తప్పేంటి..?’’
  • ముందు ఓ పాట యూట్యూబ్‌లో చూడండి… తరవాతే ఇది చదవండి…
  • నాలుగు దేశాల క్రికెట్ ఫ్యాన్స్‌కు చాన్నాళ్లు గుర్తుండే ఓ వైడ్ బాల్..!!
  • అదిరింది..! ఆ పెళ్లి ఫోటోలకన్నా బాగుంది..! ఇంతకీ ఎవరు ఆ రణబాలి..?!
  • గల్ఫ్ వార్ విస్తరిస్తోంది… ఇజ్రాయిల్, అమెరికాల వ్యూహం ఏమిటి..?
  • దేశవాళీ క్రికెట్‌లో అనూహ్యంగా ఓ కొత్త చరిత్ర రాసిన జమ్ముకశ్మీర్..!!
  • సీడాన్స్..! ఇలా చెప్పండి, అలా ఓ అవతార్ తాతను క్రియేట్ చేసిస్తుంది..!!
  • దేవుడే ఇచ్చాడు వీథి… నిజంగా ఈ పాట సందర్భానికి, పాత్రలకూ నప్పిందా..?!
  • “Kavitha walks free..! A massive blow to an already battered BRS..!!”

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions