Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘సూపర్ సిక్స్’ ప్యాక్ రేవంత్ రెడ్డి… నిజంగానే ఇది చేస్తే మరింత మేలు..!!

June 17, 2025 by M S R

.

సూపర్ సిక్స్… రేవంత్ రెడ్డి సిక్స్ ప్యాక్… అవును, కష్టాలు, అడ్డంకులు, సవాళ్లు ఎన్ని ఉన్నా, సూపర్ సిక్స్ హామీల అమలు దిశలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోతోంది…

ఏపీ ప్రభుత్వంకన్నా, కర్నాటక ప్రభుత్వంకన్నా నయమే… అదే సూపర్ సిక్స్ ప్యాక్ అన్నాడు ఓ మిత్రుడు ఓ వార్త చదివి… ఆ వార్త ఏమిటీ అంటే…

Ads

నిన్న రైతునేస్తం వేదికగా రాష్ట్రవ్యాప్తంగా రైతులతో మాటామంతీ నిర్వహించాడు కదా… చాలా మంది రైతులు రైతు భరోసా, సన్నాల బోనస్, రుణమాఫీ అన్నీ పొందాం అని సీఎంకు చెప్పారు… వాళ్ల అభిప్రాయాలను ఈనాడు యథాతథంగా పబ్లిష్ చేయడం కాస్త ఆశ్చర్యం కలిగించింది… ఇదే ఇదీ…

ఈనాడు

అయితే ఇదే మీటింగులో సీఎం మరోమాటన్నాడు… ఇదీ…

రేవంత్

జొన్న రొట్టెలు రోజువారీగా తింటే జిమ్‌కు వెళ్లకుండానే సిక్స్ ప్యాక్ వస్తుందని..! అచ్చంపేట దోసకాయ పప్పు ముందు చికెన్, మటన్ కూడా సాటిరావని ఓ ఛలోక్తి… నిజానికి కొంత అతిశయోక్తి అనిపించినా సరే, చిరుధాన్యాల వాడకం విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు మంచి ఉత్తేజాన్ని ఇస్తాయి…

పొలిటిషియన్స్, సెలబ్రిటీలు చిరుధాన్యాల మీద పాజిటివ్ వ్యాఖ్యలు చేస్తుంటేనే వాటి సాగు పెరుగుతుంది, వాడకం కూడా పెరుగుతుంది, సిక్స్ ప్యాక్ కాకపోయినా… ఒబెసిటీ, మధుమేహం, బీపీ రోగులకు చాలా మేలు… తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ కారణంగా..!

గతంలో వేరు, ఇప్పుడు సజ్జలు, జొన్నలు, కొర్రలు ఇతరత్రా చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు మంచి ధరే వస్తోంది… ప్రత్యేకించి సుగర్ రోగగ్రస్తులు తెల్ల అన్నం మానేసి చిరుధాన్యాల వైపు వేగంగా మళ్లుతున్నారు… అవసరమే… ఐతే ఇక్కడ సిక్స్ ప్యాక్ రేవంత్ రెడ్డికి ఓ సూచన… ఓ వార్త… (నిన్ననే కనిపించింది)…

jowar rotti

సన్నాలకు బోనస్, రుణమాఫీ, రైతుభరోసా ఎట్సెట్రా చేస్తున్నారు కదా… నూనెగింజలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలకు ఎంతోకొంత మద్దతుధర పెంచడం… వాటి సాగు పెరగాల్సి ఉంది, ఆ అవకాశాన్ని తెలంగాణ అందిపుచ్చుకోవాలి… అపరాలు, నూనెల దిగుమతులు తగ్గాలంటే ఇదే మార్గం…

ఒకప్పటి మన హైదరాబాద్ స్టేట్‌లోనే భాగమైన గుల్బర్గాలో ఓ లేడీ ఐఏఎస్ ఆఫీసర్ మహిళలతో సహకార సంఘాలను ఏర్పాటు చేసి, వాళ్లకు వివిధ పథకాల నిధులతో జొన్నల రొట్టెల తయారీ మిషన్లను సమకూర్చింది… కలబురిగి రొట్టె పేరిట బ్రాండ్ ప్రమోషన్ చేశారు… బాగా క్లిక్కయింది…

roti machine

ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేయనున్నారు… జొన్న రొట్టెలు మన తెలంగాణలోలాగే అక్కడి ఆహార సంస్కృతి అది… దాన్నే వ్యాపారంలా మార్చి ఉపాధి పొందడం ఈ పథకంలో భాగం… ఆ బ్రాండ్ రొట్టెలను ప్రభుత్వ ముఖ్యులు ప్రత్యేక సమావేశాల్లో ప్రదర్శించి, ప్రమోట్ చేశారు… మంచి అడుగు…

కలబురిగి రొట్టె

నిజానికి ప్రైవేటు ప్లేయర్లు జొన్నలతోపాటు జొన్న రొట్టెలను ఎప్పటి నుంచో ఎగుమతి చేస్తున్నారు… మన దేశంలోని వివిధ ప్రాంతాలకే గాకుండా వేరే దేశాలకు కూడా… కాకపోతే అవి కడక్ రొటీలు… తెలంగాణ, గుల్బర్గా రెండు ప్రాంతాల్లోనూ చాలామంది మహిళలకు ఉపాధి దొరుకుతోంది… చేతులతో చేసేవే ఎక్కువ… మరీ యంత్రాలు అధికంగా రాలేదు…

హైదరాబాద్ మాత్రమే కాదు, మన పలు నగరాల్లో సాయంత్రంవేళ జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెలు చేసి ఉపాధి పొందుతున్న మహిళల సంఖ్య వేలల్లో… హైదరాబాదులో 12 నుంచి 20 రూపాయల వరకు… ఏరియాను బట్టి, రొట్టె సైజును బట్టి… విపరీతమైన గిరాకీ ఉంటోంది… కాకపోతే సజ్జ రొట్టెలు దొరకవు అంతగా… గోధుమ రొట్టెలు కాస్త ఈజీ, కానీ జొన్న, సజ్జ రొట్టెల తయారీ ఓ కళ…

ఇంకా డిమాండ్ ఉండబోతోంది… మనుషుల్లో ఆరోగ్య స్పృహ పెరిగేకొద్దీ చిరుధాన్యాల రొట్టెలకు గిరాకీ పెరుగుతూనే ఉంటుంది… ప్రియ ఫుడ్స్ వాళ్లు కూడా ఈమధ్య బాగా ప్రయారిటీ ఇస్తున్నారు వాటికి… ఎలాగూ కోటి మంది మహిళలు కోటీశ్వరులు అనే బృహత్ సంకల్పం పెట్టుకున్నారుగా… ఆ దిశలో జొన్న, చిరు ధాన్యాల రొట్టెల తయారీ, ఎగుమతులపై ‘గుల్బర్గా మోడల్’ ఓసారి సీరియస్‌గా ఆలోచిస్తే తెలంగాణకు మేలు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • AIలో ఫోటో అప్‌లోడ్ చేస్తే అకౌంట్‌లో డబ్బులు పోతాయా? నిజమేంటి?
  • ‘‘ఆ రీసెర్చ్ కోసం- బ్లడ్ క్యాన్సర్ సోకిన నీ కూతుర్ని ఇస్తావా?”
  • 40 స్క్రీన్లకు పడిపోయిన సినిమా… 2,500 స్క్రీన్లకు ఎలా వెళ్లింది?
  • పూలమ్మి పాలమ్మి వేల కోట్లు ఆర్జించిన మల్లారెడ్డి ఫిక్స్..?!
  • బహుశా ఇలాంటి ‘ఘనత’ ప్రపంచంలో కేవలం కేసీయార్ పార్టీకే సాధ్యం !!
  • డేటా సెంటర్లు వద్దు… కానీ AI ఫిల్టర్ల మోజు మాత్రం కావాలా?
  • పాకిస్థాన్ ప్రతీకార ఆశలపై నీళ్లు … గుమ్మరించింది ఇండియా కాదు, శ్రీలంక !!
  • చైత్ర ! బిగ్‌బాస్ పైత్యానికి బలి … 4 రోజులకే ఇద్దరు ఔట్ ఏమిట్రా !!
  • అతి పెద్ద మ్యూజిక్ లిటిగెంట్ – పాపం పద్మవిభూషణ్ పురస్కారం…
  • ప్చ్, సుమంత్‌కు మళ్లీ భంగపాటే – బహుశా అమ్మవారి శాపమేమో…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions