. నాయకుడికి క్రెడిబులిటీ ముఖ్యం… తన మాటలకు విలువ ఉండాలి… రాజకీయ విమర్శ అయినా సరే జనంలో ఆలోచనను రేకెత్తించాలి… బట్, ముఖ్యమంత్రి కావాలనుకునే కేటీయార్‌కు అదేమీ పట్టినట్టు లేదు… ఇది సోషల్ మీడియా యుగం… రకరకాల అబద్ధాలు, అతిశయోక్తులు సమాజంలో ప్రవహిస్తూ ఉంటాయి… కానీ వాటిని మెయింటెయిన్ చేసినా సరే, నాయకుడు అలా మాట్లాడకూడదు… జనం నవ్వుకుంటారనే ఇంగితాన్ని ప్రదర్శించాలి… ఫాఫం కేటీయార్… తను బాగానే సబ్జెక్టు అర్థం చేసుకోగలడు, ఆశువుగా మాట్లాడగలడు… కానీ తన టీమ్ […]
కేసీయార్‌కు కుదుటపడని ఆరోగ్యం… తరచూ ఏవో సమస్యలు..!?
. చిన్న వార్తలాగా కనిపించింది… కానీ పెద్ద వార్తే… తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీయార్ ఆరోగ్యం బాగాలేదు… సరే, వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, అది కాదు విషయం… నిజానికి తన ఫామ్ హౌజులోనే చిన్న చిన్న సమస్యలను డయాగ్నయిజ్ చేసి, అవసరమైతే యశోద డాక్టర్లు అప్పటికప్పుడు అటెండ్ అవుతారు… కానీ ఈమధ్య హైదరాబాదులో ఇన్‌పేషెంటుగా చేరాడు… తరువాత మళ్లీ అస్వస్థత… ఇప్పుడు మళ్లీ అస్వస్థత… ఏమైంది..? అసలు కేసీయార్ ఆరోగ్య పరిస్థితి ఏమిటి..? […]
కాళేశ్వరం కమిషన్ చట్టబద్ధ ఏర్పాటు… ఆ రిపోర్టే చెల్లదు అనొచ్చా..?!
. బహుశా దేశంలో ఏ రాజకీయ నాయకుడు లేదా ఏ ఉన్నతాధికారీ ఒక స్వతంత్ర విచారణ కమిషన్‌పై… దాని ఏర్పాటే రాజకీయ ప్రేరేపితమనీ, దురుద్దేశపూరితమనీ ఆరోపించి ఉండడు… కోర్టుకెక్కి ఉండడు… కేసీయారే తొలి వ్యక్తి కావచ్చు… కాళేశ్వరం నిర్మాణ వైఫల్యాలు, అక్రమాలపై జనంలో చర్చ ఇంకా ఇంకా జరుగుతూనే ఉంది… కేసీయార్ అండ్ క్యాంప్ ఎంత యాగీ చేస్తుంటే అంతగా జనంలోకి నెగెటివ్‌గా వెళ్తుంది… ఐనా కమిషన్ ఏర్పాటు వల్ల, రిపోర్టు ఇవ్వడం వల్ల వ్యక్తిగత ప్రతిష్ట […]
మోడీషా మెడలే వంచాలనుకుని కేసీయార్ ఆడిన ఓ డ్రామా అది..!!
. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్‌కు రాజీనామా చేశాడు… దానికి కారణాలు, ఏ పార్టీలోకి వెళ్తాడనే అంశంకన్నా తను చెప్పిన రెండు వాక్యాలు ఆసక్తికరంగా ఉన్నాయి… ‘‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేను సూత్రధారిని కాను, పాత్రధారిని మాత్రమే, కేసీయార్ చెబితే అక్కడికి వెళ్లాను, అంతే…’’ గుర్తుంది కదా… ఆ కేసు… ఎవరో గుర్తుతెలియని స్వాములను బీజేపీ పంపించి,, నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించినట్టు కావాలనే కేసీయార్ దర్శకత్వంలో ఓ స్కిట్ నడిపించాడు… తను ఏదో […]
బీఆర్ఎస్ పంథాలో ఏమిటీ మార్పు… KCR ఉద్యమ ధోరణికి వ్యతిరేకం…
. తెలంగాణ ఉద్యమ సాధన దిశలో సమైక్యవాదం ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఏ వేషాలు వేసినా సరే… కేసీయార్ ఏ ఒక్క క్షణమూ అదుపు తప్పలేదు, ఉద్యమాన్ని అదుపు తప్పనివ్వలేదు… ఒక్క ఆంధ్రుడి మీద గానీ, వ్యాపార సంస్థల మీద గానీ, మీడియా ఆఫీసులపై గానీ ఒక్క రాయీ పడలేదు… వాళ్లే భయంతో ఇళ్లకు, ఆఫీసులకు పెద్ద పెద్ద నెట్లు పెట్టించుకున్నారు రాళ్ల దెబ్బల్ని కాచుకోవడానికి… ఒక్క ఉద్యమకారుడూ ఒక్క రాయీ విసరలేదు… అది […]
నీడనూ నమ్మలేనితనం… క్షణక్షణమూ అభయం కాదు, ఆ భయమే..!!
. ముందుగా ఓ వార్త చదవండి.,. ‘‘ABN ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల చైర్మన్ రాధాకృష్ణ ఫోన్ నంబర్లను కేసీయార్ ప్రభుత్వం ట్యాప్ చేసినట్లు గుర్తించిన సిట్ అధికారులు… విచారణకు రావాలని రాధాకృష్ణకు సూచించిన అధికారులు..! నోటీసులు పంపిస్తే… వీలును బట్టి వచ్చి వాంగ్మూలం ఇస్తానని సిట్ అధికారులకు చెప్పిన రాధాకృష్ణ! పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు, అలా జరగకపోతేనే ఆశ్చర్యం… రారా పోరా అనుకునేంత చనువు, దోస్తీ… ఐతేనేం… రాధాకృష్ణ టీడీపీ మనిషి, చంద్రబాబు మనిషి… కేసీయార్ కూడా […]
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం… మోడీ వద్దన్నాడా..? ఎందుకు కవితమ్మా..?.!
. ఏముంది..? ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొస్తా, మంత్రి పదవి ఇవ్వండి అని కవిత కాంగ్రెస్‌తో రాయబారాలు చేసినట్టు ఆంధ్రజ్యోతి రాసింది… అంతేకాదు, బీఆర్ఎస్ పార్టీనే బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని కవితే చెబుతోంది మీడియా చిట్‌చాట్‌లో… ప్రముఖంగా కవరేజీ రావాలనే భావనతోనే… హరీష్‌రావును కూడా తీసుకుని వచ్చెయ్, ఇద్దరికీ ఉపముఖ్యమంత్రుల పదవులు ఇస్తాం అని కూడా కాంగ్రెస్ రెడీ అవుతుంది ఆ ఆఫర్‌ను కవిత అంగీకరిస్తే… రాజకీయాల్లో ఇది జరగాలి, ఇలాగే జరగాలి అని ఏమీ […]
వాళ్లను దేవుడే శిక్షిస్తాడులే… అని వదిలేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..!
. అసలు గవర్నర్ పర్మిషన్ కూడా ఇచ్చాడు… ఫార్ములా వన్ కేసులో కేటీయార్‌ను అరెస్టు చేస్తారని అందరూ అనుకున్నారు… కేటీయార్ కూడా మానసికంగా ప్రిపేరయిపోయాడు… రోజూ యోగా చేసుకుని ఫిట్, స్లిమ్ అవుతాననీ, జైలులో వేసుకుంటే వేసుకొండని, బయటికి రాగానే పాదయాత్ర స్టార్ట్ చేస్తా అన్నాడు… కానీ రేవంత్ రెడ్డి అరెస్టు జోలికి పోలేదు… భయం కాదట, సంకోచం కూడా కాదట… జస్ట్, కక్షసాధింపు వద్దులే అనుకున్నాడట… దేవుడే చూసుకుంటాడులే, ఎవరి పాపం వాళ్లదేలే అనుకున్నాడట… తనే […]
ఇదేం ప్రజాజీవితం..? జనానికి మంచి శాస్తి జరిగిందనే కసి వ్యాఖ్యలేంటి..?
. నిజంగానే కేసీయార్‌కు ఏదో అయ్యింది… ఏమంటున్నాడు తను..? కత్తి ఒకరికిచ్చి ఇంకెవరినో యుద్ధం చేయమంటే ఎట్లా..? అన్నా రావే రావే అని ఆయన్ని వేడుకుంటున్నారట.,. నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన్రు కదా, ఏడికి రావాలె అనడుగుతున్నాడు… సంపూర్ణ బాధ్యతారాహిత్యపు వ్యాఖ్యలు… ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తి నోటి నుంచి రాకూడని, ఊహించని డొల్ల మాటలు అవి,., కేసీయార్‌కు ఏదో రాజకీయ పరిణతి ఉందని అనుకునేవాళ్లను కూడా షాక్‌కు గురిచేస్తుండు కేసీఆర్… అసలు తన కత్తి అనే వ్యాఖ్యలకు […]
పుష్ప, మన్మోహన్… ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, తప్పులు..!!
. రెండు అంశాలు… 1) మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు రెండు తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ఎందుకు వెళ్లలేదు..? 2) అల్లు అర్జున్‌ను ఫోన్‌లో చంద్రబాబు పరామర్శించడం సబబేనా..? ఐదారు రోజులుగా చర్చ… బన్నీ మీద కేసు, అరెస్టు అనగానే వెంటనే కేటీయార్ ఖండించాడు… ఎందుకంటే, ఏ ఆలోచన లేకుండా కాంగ్రెస్ చేసిన ప్రతి పనినీ వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారు, పైగా ఇండస్ట్రీతో రాసుకుని పూసుకుని తిరిగిన అలవాటు… తీరా బన్నీ మీద జనంలో బాగా నెగెటివిటీ […]
రేవంత్ సార్… ఇదుగో కేసీయార్ సీదా సవాల్… జవాబ్ దో అంటున్నాడు…
ఏమైంది, ఏమీ కాలేదు… నిక్షేపంలా ఉంది, బంగారంలా ఉంది, అత్యద్భుతమైన అతి గొప్పాతిగొప్ప ప్రాజెక్టు… ప్రపంచ ఎనిమిదో వింత… జస్ట్, ఒక పిల్లర్ కుంగింది, మరో పిల్లర్ కాస్త ఫ్రాక్చరయింది, అంతే… ఈమాత్రం దానికి ఇంత ఏడవాలా రేవంత్ రెడ్డి..? అసలు కాళేశ్వరం లేకుండా యాసింగిలో నీళ్లిస్తవా, ఇచ్చి చూడు, మేమూ చూస్తాం… మాట్లాడితే లక్ష కోట్ల అవినీతి అంటవ్, కేసీయార్ తినేశాడు అంటవ్, మళ్లీ మళ్లీ అదే కూస్తే మర్యాద దక్కదు సుమా…….. దాదాపు ఇలాగే […]
కేసీయార్ సార్… ఢిల్లీలో దిగిన ఈ గ్రూప్ ఫోటో యాదికున్నదా..?
నీ పాలన దుర్మార్గం, నువ్వు ప్రజావ్యతిరేకంగా పాలిస్తున్నవ్, నీ పార్టీ అనేక బలిదానాలకు కారణం, తెలంగాణ అనేది నీ పార్టీ దయాభిక్ష కాదు, అస్తిత్వ చిహ్నాలను అవమానిస్తున్నవ్….. ఇలా అనేకానేక నిందారోపణలతో మాజీ సీఎం కేసీయార్ సీఎం రేవంత్‌రెడ్డికి ఒక లేఖ రాశాడు… తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితిని క్రియేట్ చేసింది కేసీయారే… అందులో డౌట్ లేదు, ఎవడూ వ్యతిరేకించరు… కానీ ఓ రేంజ్ క్రెడిట్ సొంతం చేసుకున్న తను కీలకమైన దశాబ్ది ఉత్సవం సందర్భంలో… రాజధాని […]
వేణుస్వామిగా మారిన రాధాకృష్ణ… జోస్యాల్లో ఎక్కడికో వెళ్లిపోయాడు…
సెలబ్రిటీల జ్యోతిష్యుడు వేణుస్వామిని తలపిస్తూ ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో ఈరోజు రాధాకృష్ణ తన వ్యాసంలో ఏవేవో జోస్యాలు చెప్పాడు.,. ఎక్కడికో వెళ్లిపోయాడు… ఎప్పుడైతే కేసీయార్ మొన్నటి టీవీ9 ఇంటర్వ్యూలో ‘నాకున్న సమాచారం మేరకు జగన్ మళ్లీ గెలుస్తాడు’ అన్నాడో, అప్పుడే రాధాకృష్ణకు చర్రున ఎక్కడో మండినట్టుంది… గతంలో కూడా ఓసారి జగన్ గెలుస్తాడని చెప్పి కేసీయార్ భంగపడ్డాడు, తను ఆ మాట చెప్పడం వెనుక మర్మమేమిటో ఇక్కడ విశ్లేషణ, ఊహాగానం అనవసరం గానీ… అలా ఎందుకు చెప్పి […]
కేసీయార్ చెప్పింది నిక్కమైన నిజం… ఉద్యమ కేసీయార్ ప్రస్తుతం లేడు…
ఇన్నాళ్లూ శుక్రమహర్దశ నడిచింది కాబట్టి… అనుకున్నట్టు టైమ్ సహకరించింది కాబట్టి… ఆలోచనల్లో, అడుగుల్లో ఎన్ని లోపాలున్నా సరే నడిచిపోయింది… భజనపరులు చుట్టూ చేరి అపర చాణక్యుడు ఎట్సెట్రా భుజకీర్తులు తగిలించారు కాబట్టి నిజంగానే తను చాణక్యుడికి తాతనేమో అనే భ్రమల్లోకి కేసీయార్ జారిపోయినట్టున్నాడు… టైమ్ ఇక చాల్లే అన్నాక ఇప్పుడు తన పాలన వైఫల్యాలు, తన అక్రమాలు గట్రా తెర మీదకు వస్తున్నయ్… నిన్న ఎక్కడో అన్నాడు… 20- 25 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్‌లోకి వచ్చేస్తాను ఎవరో […]
ఇకిగాయ్… సరైన సమయంలో సరైన పుస్తకం చదువుతున్న కేసీయార్…
ప్రముఖులు ఏం పుస్తకం చదువుతున్నారు..? ఇది అందరికీ ఆసక్తికరమైందే… ప్రత్యేకించి పుస్తక ప్రియులకు..! వ్యక్తులు చదివే పుస్తకాలను బట్టి వాళ్ల తత్వాలను, అభిరుచులను, ఆలోచన ధోరణులను అంచనా వేయడం కూడా చాలామందికి అలవాటు… కాకపోతే 80 వేల నుంచి లక్ష పుస్తకాల్ని అలవోకగా ఊదిపారేసే కేసీయార్, పవన్ కల్యాణ్ వంటి నాయకులను ఈగాటన కట్టలేం… వాళ్ల రికార్డు ప్రపంచంలో ఎవరికీ చేతకాదు, అసాధ్యం, అందుకే వాళ్లను అంచనా వేయడం హరిహరాదులకూ అసాధ్యం… కేసీయార్ టేబుల్ మీద తాజాగా […]
జై శ్రీరాం అనొద్దు… ఉద్వేగాలు కడుపు నింపవు… శ్రీమాన్ కేటీయార్ ఉవాచ…
సోషల్ మీడియాలో కొందరి పోస్టులు చూసి, నిజంగా కేటీయార్ ఇలా అన్నాడా అనిపించింది… కానీ, అన్నాడు… అన్నాడని ఆయన పత్రిక నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది… ఎండార్స్ చేసింది… ఇంతకీ ఏమన్నాడు..? ‘‘యువత ఎవరైనా జై శ్రీరాం అంటే సముదాయించాలి. జై శ్రీరాం అనే నినాదం కడుపు నింపదు.. నీకు ఉద్యోగం ఇవ్వదు.. ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలి.. కొట్లాడేటోళ్లు కావాలి… ఈ రాష్ట్రంలో నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందా.. అంటే అది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ […]
ఒకరిద్దరు లంగల ఫోన్ల ట్యాపింగ్ కాదు… అసలు ఈ రేంజ్ ట్యాపింగే లంగ పని కాదా..?
జీవితంలో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు అని ఏదో తెలుగు సినిమాలో ఫేమస్ డైలాగ్… నిజం… రాజకీయాల్లో అదింకా ముఖ్యం… ఎప్పుడేం మాట్లాడాలో కాదు, ఎప్పుడు ఏం మాట్లాడకూడదో తెలిసినవాడే గొప్పోడు..!విపరీతమైన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న బీఆర్ఎస్ ముఖ్యనేతలకు ఈ సోయి ఉన్నట్టు కనిపించడం లేదు… అనేక మంది ఫోన్లను ట్యాప్ చేయడానికి ఓ కరడుగట్టిన పోలీస్ టీంను ఉసిగొల్పి, ప్రతిపక్ష నేతలే కాదు, జర్నలిస్టులు, మేధావులు, స్వచ్చంద సంస్థల బాధ్యులు సహా అందరి […]
హవ్వ… బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడు దొంగలట… మరిన్నాళ్లూ కాపాడిందెవరు మహాశయా..?!
1) కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ దోపిడీ, ఇప్పుడు కాంగ్రెస్‌కు ఏటీఎం, ఢిల్లీ దాకా కమీషన్లు చేరుతున్నయ్, బీఆర్ఎస్ స్కాములు ఢిల్లీని చేరాయ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర సహకారం, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ పార్టీల పాత్రే తేలుతోంది….. మోడీ వ్యాఖ్యలు ఇవన్నీ… …. నిజమే, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ అవినీతి పార్టీల పాత్రే తేలుతోంది అనేది కరెక్టే… కుటుంబ పార్టీలు ఖచ్చితంగా దేశానికి చేటు… కానీ బీఆర్ఎస్ అవినీతి మీద గతంలో తప్పనిసరై […]
అబద్ధం..! కేవలం సిట్టింగుల వల్లే పార్టీ ఓటమి అనే విశ్లేషణే పూర్తి అబద్ధం..!!
కేసీయార్ అలవోకగా అబద్ధాలు ఆడేయగలడు… అది పదే పదే నిరూపితమైంది… స్టిల్ ఇప్పుడూ అదే… నిన్న ఏదో పార్టీ మీటింగులో కొడుకుతో కలిసి పాల్గొన్నాడు… బీఆర్ఎస్ శ్రేణులతో మాట్లాడుతూ ‘కేసీయార్ గెలవాలని కోరుకున్నారు’ అన్నాడు… తప్పు… కేసీయార్ గెలవాలని జనం కోరుకుంటే కామారెడ్డిలో తనే ఎందుకు ఓడిపోయాడు..? పార్టీ సంగతి పక్కన పెట్టినా సరే, తనే స్వయంగా పోటీచేసినా సరే జనం ఎందుకు తిరస్కరించారు..? ఇదే రాష్ట్రవ్యాప్తంగా కనిపించింది… అందుకే ఎన్నికల్లో ఓటమి… అది తన పట్ల […]
… అందుకే అడుగుతున్నం, నువ్వు నా జాతి పితవు ఎట్లయితవ్..?
Gurram Seetaramulu…. జీవన తత్వాన్ని కుదించి చెప్పడంలో మా అమ్మ మాస్టర్. బాలి గాడు, పోలిగాడు కౌలు సేద్యానికి దిగారు. మొదటి రోజు ముళ్ళు, రాళ్లు, తుప్పలు ఉన్న ఆ బీడు సరి చేయడానికి పొద్దున్నే సద్ది కట్టుకుని పొలానికి పోయారు. కాసిన్ని గంజినీళ్ళు తాగి గొడ్డలి ఎత్తారు. కంపలోంచి ఒక కుందేలు ఉరికింది. ‘అరె, దాన్ని పోనీయకురా పోలిగా’ అన్నాడు బాలిగాడు. అలా కుందేలు కోసం ఎల్లినోడు ఇక రాడాయె, పోలిగాని కోసం బాలిగాడు ఎదురు […]