సోషల్ మీడియాలో కొందరి పోస్టులు చూసి, నిజంగా కేటీయార్ ఇలా అన్నాడా అనిపించింది… కానీ, అన్నాడు… అన్నాడని ఆయన పత్రిక నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది… ఎండార్స్ చేసింది… ఇంతకీ ఏమన్నాడు..? ‘‘యువత ఎవరైనా జై శ్రీరాం అంటే సముదాయించాలి. జై శ్రీరాం అనే నినాదం కడుపు నింపదు.. నీకు ఉద్యోగం ఇవ్వదు.. ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలి.. కొట్లాడేటోళ్లు కావాలి… ఈ రాష్ట్రంలో నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందా.. అంటే అది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ […]
ఒకరిద్దరు లంగల ఫోన్ల ట్యాపింగ్ కాదు… అసలు ఈ రేంజ్ ట్యాపింగే లంగ పని కాదా..?
జీవితంలో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు అని ఏదో తెలుగు సినిమాలో ఫేమస్ డైలాగ్… నిజం… రాజకీయాల్లో అదింకా ముఖ్యం… ఎప్పుడేం మాట్లాడాలో కాదు, ఎప్పుడు ఏం మాట్లాడకూడదో తెలిసినవాడే గొప్పోడు..!విపరీతమైన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న బీఆర్ఎస్ ముఖ్యనేతలకు ఈ సోయి ఉన్నట్టు కనిపించడం లేదు… అనేక మంది ఫోన్లను ట్యాప్ చేయడానికి ఓ కరడుగట్టిన పోలీస్ టీంను ఉసిగొల్పి, ప్రతిపక్ష నేతలే కాదు, జర్నలిస్టులు, మేధావులు, స్వచ్చంద సంస్థల బాధ్యులు సహా అందరి […]
హవ్వ… బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడు దొంగలట… మరిన్నాళ్లూ కాపాడిందెవరు మహాశయా..?!
1) కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ దోపిడీ, ఇప్పుడు కాంగ్రెస్‌కు ఏటీఎం, ఢిల్లీ దాకా కమీషన్లు చేరుతున్నయ్, బీఆర్ఎస్ స్కాములు ఢిల్లీని చేరాయ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర సహకారం, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ పార్టీల పాత్రే తేలుతోంది….. మోడీ వ్యాఖ్యలు ఇవన్నీ… …. నిజమే, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ అవినీతి పార్టీల పాత్రే తేలుతోంది అనేది కరెక్టే… కుటుంబ పార్టీలు ఖచ్చితంగా దేశానికి చేటు… కానీ బీఆర్ఎస్ అవినీతి మీద గతంలో తప్పనిసరై […]
అబద్ధం..! కేవలం సిట్టింగుల వల్లే పార్టీ ఓటమి అనే విశ్లేషణే పూర్తి అబద్ధం..!!
కేసీయార్ అలవోకగా అబద్ధాలు ఆడేయగలడు… అది పదే పదే నిరూపితమైంది… స్టిల్ ఇప్పుడూ అదే… నిన్న ఏదో పార్టీ మీటింగులో కొడుకుతో కలిసి పాల్గొన్నాడు… బీఆర్ఎస్ శ్రేణులతో మాట్లాడుతూ ‘కేసీయార్ గెలవాలని కోరుకున్నారు’ అన్నాడు… తప్పు… కేసీయార్ గెలవాలని జనం కోరుకుంటే కామారెడ్డిలో తనే ఎందుకు ఓడిపోయాడు..? పార్టీ సంగతి పక్కన పెట్టినా సరే, తనే స్వయంగా పోటీచేసినా సరే జనం ఎందుకు తిరస్కరించారు..? ఇదే రాష్ట్రవ్యాప్తంగా కనిపించింది… అందుకే ఎన్నికల్లో ఓటమి… అది తన పట్ల […]
… అందుకే అడుగుతున్నం, నువ్వు నా జాతి పితవు ఎట్లయితవ్..?
Gurram Seetaramulu…. జీవన తత్వాన్ని కుదించి చెప్పడంలో మా అమ్మ మాస్టర్. బాలి గాడు, పోలిగాడు కౌలు సేద్యానికి దిగారు. మొదటి రోజు ముళ్ళు, రాళ్లు, తుప్పలు ఉన్న ఆ బీడు సరి చేయడానికి పొద్దున్నే సద్ది కట్టుకుని పొలానికి పోయారు. కాసిన్ని గంజినీళ్ళు తాగి గొడ్డలి ఎత్తారు. కంపలోంచి ఒక కుందేలు ఉరికింది. ‘అరె, దాన్ని పోనీయకురా పోలిగా’ అన్నాడు బాలిగాడు. అలా కుందేలు కోసం ఎల్లినోడు ఇక రాడాయె, పోలిగాని కోసం బాలిగాడు ఎదురు […]
NDA లో చేరిక ప్రయత్నాలు, KTR ను సీఎం చేసే ప్రయత్నాలూ నిజమే…
అంతా నిజమే… బీఆర్ఎస్‌లో ఎన్డీయేలో చేరడానికి సంప్రదింపులు నిజం… కేటీయార్‌ను ముఖ్యమంత్రిని చేయాలనుకున్నది నిజం… మోడీని ఆశీస్సులు అడిగిన మాట నిజం… మొన్నామధ్య బహిరంగంగానే మోడీ ఈ విషయాన్ని వెల్లడించడం నిజం… మోడీ బయటపెట్టాక కేటీయార్ తీవ్రంగా ఖండించాడు… పొల్లు మాటలు, నన్ను ముఖ్యమంత్రిని చేయడానికి ఆయన ఆశీస్సులు దేనికి..? మా ఎమ్మెల్యేలు తలుచుకుంటే అవుతుంది గానీ ఆయనెవరు నన్ను ముఖ్యమంత్రిని చేయడానికి…. అంటూ సీరియస్‌గా విరుచుకుపడ్డాడు మోడీ మాటలపై… అప్పుడు కూడా కేసీయార్ సైలెంట్… ఒక్కముక్క […]




