. రాష్ట్ర విభజన తరువాత… దశాబ్దాల కల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తరువాత… ఏం జరిగింది..? కేసీయార్ అరాచక, నియంత పాలనలో చిక్కుకుని మరింత విలవిలలాడిపోయింది… తను ఏది అనుకుంటే అదే రాజ్యాంగం… తను ఏది చెబితే అది శాసనం… మగ శివగామి… ఆర్థికంగా అస్తవ్యస్త నిర్వహణ… గందరగోళం… అయోమయం… కల్లోలం… ఆర్థిక క్రమశిక్షణ వీసమెత్తు కనిపించని కాలం… అలవిమాలిన అప్పులు… బడ్జెట్లు మొత్తం జీతభత్యాలు, వృథాఖర్చులు, రుణ నిర్వహణ తాలూకు చెల్లింపులు, వడ్డీలు… తొమ్మిదేళ్ల […]
ఫాఫం కేటీయార్… తన విలువను తనే దెబ్బతీసుకుంటున్నాడు..!!
. నాయకుడికి క్రెడిబులిటీ ముఖ్యం… తన మాటలకు విలువ ఉండాలి… రాజకీయ విమర్శ అయినా సరే జనంలో ఆలోచనను రేకెత్తించాలి… బట్, ముఖ్యమంత్రి కావాలనుకునే కేటీయార్‌కు అదేమీ పట్టినట్టు లేదు… ఇది సోషల్ మీడియా యుగం… రకరకాల అబద్ధాలు, అతిశయోక్తులు సమాజంలో ప్రవహిస్తూ ఉంటాయి… కానీ వాటిని మెయింటెయిన్ చేసినా సరే, నాయకుడు అలా మాట్లాడకూడదు… జనం నవ్వుకుంటారనే ఇంగితాన్ని ప్రదర్శించాలి… ఫాఫం కేటీయార్… తను బాగానే సబ్జెక్టు అర్థం చేసుకోగలడు, ఆశువుగా మాట్లాడగలడు… కానీ తన టీమ్ […]
‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా… ఏ యూనివర్శిటీ క్యాంపసులో తన మీద కూడా దాడి జరగడానికి ప్రయత్నాలు జరిగాయో…. ది గ్రేట్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధకుడు అని పెయిడ్ కీర్తనల ఘోషల బాహుబలి నాయకుడు కూడా ఓయూ అంటేనే భయపడిపోయాడో… ఎస్, అక్కడే రేవంత్ రెడ్డి ఏకంగా సీఎం హోదాలో ఘనస్వాగతం పొందాడు… డెస్టినీ… కేసీయార్ శుక్రమహర్దశ కొడిగట్టిందీ అనడానికి తార్కాణం… ఎస్, 2012లో ఇదే కేసీయార్ అనుకూల జేఏసీ […]
నిజమే సార్… ఖజానా దివాలా… పాలన దివాలా… సొసైటీయే దివాలా…
. నన్ను కోసినా పైసా పుట్టదు, అప్పులు ఎవడూ ఇస్తలేడు, బ్యాంకులు చివరకు చెప్పుల దొంగల్ని చూసినట్టు చూస్తున్నయ్, ఏ ప్రజాపథకం కట్ చేయాలో మీరే చెప్పండి… వస్తున్న ఆదాయం అంతా పెన్షన్లు, జీతాలు, పాత అప్పుల మిత్తీలకు సరిపోతోంది… . ఫాఫం, రేవంత్ రెడ్డి ఇలా వాపోయాడు… దాదాపు దివాలా ప్రకటన… ఈ విషయంలో సారు గారి అనుభవలేమి, పాలన వైఫల్యం అని హఠాత్తుగా ఓ ముద్ర వేయలేం… నిజంగానే ఆ దొర చేసిన అప్పులు […]
తెలంగాణ ఓ పవర్ హౌజ్… ఐటీయే కాదు, ఇది ఫార్మా హబ్ కూడా…
. Jaganadha Rao ……. తెలంగాణ అనేది ఒక పవర్ హౌజ్. ఎలాగంటే..? వివిధ రకాల ఉత్పత్తులు, ఆహారం, దుస్తులు, వివిధ రకాల సేవలు, కిరాయిలు, రవాణా ఖర్చులు మొదలైన వాటి ధరల పెరుగుదల రేటుని ద్రవ్యోల్బణం (Inflation) గా పిలుస్తారు. భారత దేశంలో ప్రస్తుతం ది బెస్ట్ రాష్ట్రం అంటే తెలంగాణ. నిన్న రిలీజ్ చేసిన జాతీయ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) లెక్కల ప్రకారం మన దేశంలో తెలంగాణలో అతి తక్కువ ఇన్ ఫ్లేషన్ (1.3%) […]
రేవంత్ రెడ్డి..! కొన్నిసార్లు తనేం మాట్లాడతాడో తనకే సమజ్ కాదు..!!
. సీఎం రేవంత్ రెడ్డి కొన్నిసార్లు తను ఏం మాట్లాడతాడో తనకే సమజ్ కాదు… నిన్న కేరళలో కూడా అంతే… చివరకు స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీ మోడీ పేరు చెప్పి వోట్లు అడుగుతుంది, కాంగ్రెస్‌కు అది చేతకావడం లేదు, లింక్ మిస్సవుతోంది, అందులో విఫలమవుతోంది, జాతీయ నాయకుల పేర్లు చెప్పి ఓట్లడగాలి అంటాడు… మేం మొన్నటి ఎన్నికల్లో సోనియా పేరు చెప్పి ఓట్లడిగాం, అందుకే గెలిచాం అని సూత్రీకరించాడు… నిజమేనా..? 2014లో… అంటే సోనియా తెలంగాణ ఇచ్చిన […]
కేసీయార్ సార్… ఢిల్లీలో దిగిన ఈ గ్రూప్ ఫోటో యాదికున్నదా..?
నీ పాలన దుర్మార్గం, నువ్వు ప్రజావ్యతిరేకంగా పాలిస్తున్నవ్, నీ పార్టీ అనేక బలిదానాలకు కారణం, తెలంగాణ అనేది నీ పార్టీ దయాభిక్ష కాదు, అస్తిత్వ చిహ్నాలను అవమానిస్తున్నవ్….. ఇలా అనేకానేక నిందారోపణలతో మాజీ సీఎం కేసీయార్ సీఎం రేవంత్‌రెడ్డికి ఒక లేఖ రాశాడు… తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితిని క్రియేట్ చేసింది కేసీయారే… అందులో డౌట్ లేదు, ఎవడూ వ్యతిరేకించరు… కానీ ఓ రేంజ్ క్రెడిట్ సొంతం చేసుకున్న తను కీలకమైన దశాబ్ది ఉత్సవం సందర్భంలో… రాజధాని […]
తెలంగాణ రాజకీయాల్లో బలాల పోలరైజేషన్… బీఆర్ఎస్‌కు వరుస షాకులు…
వివిధ పార్టీల నుంచి కేసీయార్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను లాగేసే క్రమంలో… ఎవరినిపడితే వారిని, చివరకు తెలంగాణ ద్రోహులుగా ముద్రపడిన వారిని కూడా తీసేసుకుంటున్న క్రమంలో… ఒకే మాటతో తనను సమర్థించుకునేవాడు… రాజకీయ శక్తుల పునరేకీకరణ… ప్రస్తుతం ప్రజాప్రతినిధులకు సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, విధేయతలు, నైతికతలూ మన్నూమశానం జాన్తా నై… ఎటు గాలి వీస్తే అటు కొట్టుకుపోవడమే… అఫ్‌కోర్స్, దేశమంతా అలాగే ఉంది… పైగా కొత్తదేమీ కాదు, ఆయారాం, గయారాం, ఇండియన్ పాలిటిక్సులో పెద్ద విశేషం కూడా ఏమీ కాదు… […]