.
సరిగ్గా ఏడాది క్రితం తెలుగు న్యూస్ చానెళ్ల రేటింగు మీద రాసిన కథనం, అప్పటి టేబుల్ ప్రకారం…
టీవీ9 రేటింగ్స్ 78.5 … దానికి టఫ్ ఫైట్ ఇచ్చిన ఎన్టీవీ రేటింగ్స్ 41.5… ఒక దశలో ఎన్టీవీ టీవీ9 ను దాటేసి, కాలరెగరేస్తూ… రెండు చానెళ్ల నడుమ నెక్ టు నెక్ ఫైట్ జరిగిన కొన్నాళ్ల తరువాత ఇదీ సిట్యుయేషన్…
Ads
కానీ తరువాత ఏం జరిగింది..? ఏమో, ఈ రేటింగ్సే ఓ మాయ.., ఎన్టీవీ మరీ టీవ9 రేటింగుల్లో సగం దాదాపు… అంటే టీవీ9 పూర్తిగా అప్పర్ హ్యాండ్ సాధించేసిన రోజులు అవి…
అప్పట్లో టీన్యూస్ 9వ ప్లేసు… మరి ఇప్పుడు..? ఈ చార్ట్ చూడండి…
ఎన్టీవీ మళ్లీ కాస్త పికపైంది… మరీ అప్పటిలాగా టీవీ9 లో సగం కాదు… పేరుకు మూడో ప్లేసు టీవీ5… అప్పుడూ ఇప్పుడూ… కానీ ఫస్ట్ ప్లేసులో ఉన్న టీవీ9 చానెల్‌కు చాలా చాలా దూరం… మరీ పచ్చ చొక్కా తొడిగీ తొడిగీ… ఒకప్పుడు టీవీ9, ఎన్టీవీలతో పోటీపడిన ఆ చానెల్ వాటికన్నా చాలా దిగువన కనిపిస్తోంది… అయితే, దాని లక్ ఏమిటంటే..? మిగతా చానెళ్లు మరీ దయనీయంగా ఉండిపోయి, టీవీ5ను అదే మూడో ప్లేసులో ఉంచుతున్నాయి…
మరీ టీన్యూస్ ఏడాదిలో 9 నుంచి 13 వ ప్లేసుకు దిగజారిపోయింది… రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి నమస్తే తెలంగాణ, టీన్యూస్ చానెల్ మీద కూడా కనిపిస్తున్నట్టుంది… ఏబీఎన్ కూడా యెల్లో పక్షపాతంతో ఉన్నా సరే నాలుగో ప్లేసులో కొనసాగుతుంది ఏడాదిగా…
టాప్ ఫైవ్‌లో టెన్ టీవీ కనిపిస్తోంది ఇప్పుడు… ఇంట్రస్టింగు… ఈసారి విశేషంగా కనిపిస్తున్నది మరొకటి… బిగ్ టీవీ ఏడో ప్లేసుకు వచ్చింది… ఈమధ్య నాసిరకం థంబ్ నెయిల్స్, పిచ్చి పాత్రికేయంతో మస్తు బదనాం అయిన అదే 9, 10 రేటింగ్స్‌తో కొనసాగుతుండటం విశేషమే… ఈటీవీ తెలంగాణను యాజమాన్యం వదిలేసినట్టుంది… రోజురోజుకూ డౌన్ ఫాల్… ఐన్యూస్ రేటింగ్స్ పెరిగాయి…!!
Share this Article