.
నిజానికి చాలాసార్లు చెప్పుకున్నదే… సొల్లు రాజకీయ ప్రకటనలు, ఫోటోలు, వీడియోలు, ఆరోపణలు, మీటింగుల వార్తలకే మెయిన్ స్ట్రీమ్ మీడియా సరిపోతోంది…
పరిశోధనాత్మక వార్తలు ఎప్పుడో మాయమయ్యాయి.,. కనీసం నేరవార్తలు, మానవాసక్తి కథలైనా ప్రయారిటీతో వేస్తున్నారా అంటే అదీ లేదు… వాస్తవానికి హ్యమన్ ఇంట్రస్ట్ స్టోరీలే జనంలోకి బాగా వెళ్తాయి…
Ads
కొన్ని చదువుతుంటే ఎక్కడో కలుక్కుమంటుంది… పొద్దున్నే ఆంధ్రజ్యోతిలో ఓ వార్త… (మాస్ట్ హెడ్ పక్కనే ఇండికేషన్ పెట్టి మంచి ప్రయారిటీ ఇచ్చారు, అభినందనలు బాధ్యులకు…)
వార్త ఏమిటంటే..?
‘‘తమిళనాడులోని కోయంబత్తూరు… సింగనల్లూరో పోలీస్ట స్టేషన్ పరిధి… ఇరుగూర్ ఈశ్వరన్ కోవిల్ వీధిలో నాగమాణిక్యం (73) అని ఓ భర్త, రాజసులోచన అని ఓ భార్య (63)…. పిల్లలు ఇద్దరు… వాళ్లకు పెళ్లిళ్లయిపోయాయి… వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు… ఓపిక ఉన్నప్పుడు పెయింటింగ్ పని చేస్తుంటాడు మాణిక్యం… బీపీ, సుగర్ పేషెంట్…
ఈ భార్యాభర్తలు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు… ఏవో మనస్పర్థలు… మాట్లాడుకోవడమే లేదు… ఎన్నేళ్లుగానో తెలుసా..? ఒకే ఇంట్లో ఉంటూ పదేళ్లుగా వాళ్ల నడుమ మాటల్లేవ్… అతిశయోక్తి అనిపించినా సరే అదే నిజం… ఏ అక్కరొచ్చినా, ఏ సందర్భమొచ్చినా ఒకే గూడు కింద వేర్వేరు సొంత జీవితాలు…
మిద్దెపై గదిలో రాజమాణిక్యం ఉంటాడు… ముసలాయన రోజూ కిందకు వస్తాడు… ఆమె వండి రెడీగా పెట్టిన భోజనం, తాగేనీళ్లు తీసుకుని పైకి వెళ్లిపోతాడు… ఇద్దరి నడుమ భీకరమైన నిశ్శబ్దం… ఆ దూరం తగ్గించుకునే ఆసక్తి గానీ, ప్రయత్నం గానీ రెండు వైపులా లేవు… పిల్లలు, బంధువులు, ఇరుగుపొరుగు కూడా మీ ఖర్మ అని వదిలేసినట్టున్నారు…
అనారోగ్యాలో, నొప్పులో, కష్టాలో ఏవీ వాళ్లను కలపలేకపోయాయి… ఆ ఇద్దరి మనస్తత్వాల్ని సూచించే తగిన పదం తెలుగులో లేదేమో…
డిసెంబరు 29న ఎప్పటిలాగే కిందకు దిగివచ్చాడు, అన్నం తీసుకుని పైకి వెళ్లాడు… అంతే… మళ్లీ కిందకు ఎప్పుడూ రాలేదు… ఆమె కనీసం ఏమైంది అని కనుక్కోలేదు… ఏమోలే ఎటో వెళ్లి ఉంటాడు అనుకుంది… ఆరు రోజులైనా సరే, తను పత్తా లేడు…
ఆరు రోజులూ ఆమె తన తిండి తను వండుకుంది, తిని పడుకుంది… ఐదు రోజుల తరువాత డౌటొచ్చిందట ఆమెకు… అదీ పైనుంచి దుర్వాసన వస్తుండటంతో… జనవరి 3న రాత్రి పైకి వెళ్లడంతో తలుపు మూసి ఉంది, లోపల నుంచి గొళ్లెం వేసి ఉంది… కిటికీ నుంచి చూస్తే రాజమాణిక్యం శవం కుళ్లిన స్థితిలో కనిపించింది… పోలీసులకు సమాచారం పంపించింది…
పోలీసులు వచ్చారు… ఏం చేయగలరు..? పోస్ట్‌మార్టం కోసం తరలించారు, అసాధారణ మరణం కేసు పెట్టారు..? దర్యాప్తు చేస్తున్నారు… ఇదీ వార్త… ఏం దర్యాప్తు చేస్తారు..? ఆమె మీద ఏ సెక్షన్లు పెడతారు..? ఏ నేరారోపణలు చేస్తారు..? అదేమీ భౌతిక హత్య కాదు, హత్యకు ప్రేరేపణ కాదు… అసలు తను ఎలా మరణించాడో కూడా తెలియదు… వయోకారణమా..?
Share this Article