Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జిజ్ఞాసకు ముసలితనమేంటి..? కంప్యూటర్‌ భాషను రపారపా నమిలేశాడు..!

May 18, 2025 by M S R

.

అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం…. అంటే ఎయిటీస్‌లో మాట… రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నాడు… ఆయన మంత్రివర్గంలో పీవీ నరసింహారావు మంత్రి… కీలకమైన శాఖలే… తరువాత కాలంలో అదే రాజీవ్ భార్య సోనియాకు నచ్చలేదు, అమానవీయంగా తొక్కేసింది, చివరకు ఆయన శవం మీద కూడా కక్ష కనబర్చింది… అది వేరే కథ…

తిట్టకండి, ఆమె తెలంగాణ ప్రదాత… అయితే రాజీవ్ గాంధీ టెక్నాలజీకి గేట్లు తెరిచాడు, దేశాన్ని కొత్త సాంకేతిక జ్ఞానం వైపు తీసుకుపోయాడు,.. ఓరోజు ఓ ఉన్నత స్థాయి సమావేశంలో… రాజీవ్ మాట్లాడుతూ…. ‘‘పర్సనల్ కంప్యూటర్లు వచ్చేస్తున్నయ్… అఫ్ కోర్స్, వయస్సు మళ్లిన వాళ్లకు అందిపుచ్చుకోవడం కష్టమే, కానీ రాబోయే కాలం మాత్రం వాటిదే’’ అని ఏదేదో చెప్పేశాడు… కట్ చేసేయండి ఇక్కడ…

Ads

pv

అదే మంత్రివర్గంలోని సీనియర్లలో పీవీ అనే ఓ నిత్యయవ్వనుడు ఉన్నాడని మరిచిపోయాడు… ఆయనొక మానవాతీతుడు… ‘‘మంత్రివర్గంలో మరీ వయస్సెక్కువ నేనే కదా… ఇదేదో నన్నే ఉద్దేశించి అన్నట్టుంది…’’ అనుకున్నాడు… పాజిటివ్‌గా తీసుకున్నాడు… మనిషి ఓ యోగి తెలుసు కదా… సరే, ఓ సవాల్‌గా తీసుకుందాం అనుకున్నాడు…

అసలే పే-ద్ద గట్టి బుర్ర… అందులోనూ రాజీపడని బుర్ర… ఇప్పటిలాగా ఓటి బుర్రలు కాదు కదా… అసలు ఈ కంప్యూటర్ అనేది అంతటి క్లిష్టమైన సబ్జెక్టా, సరే, దీని సంగతీ చూద్దాం అనుకుని… అదే వారంలో తన సొంత ఖర్చులతో ఓ పర్సనల్ కంప్యూటర్ అమెరికా నుంచి తెప్పించుకున్నాడు… మాన్యువల్స్ చదివేశాడు, బుర్రలోకి ఎక్కేసినయ్… పెద్దగా ఎవరి సాయమూ అక్కరకు రాలేదు…

ఇక కొన్ని రోజులపాటు తన రెగ్యులర్ పనిని సాయంత్రానికల్లా ముగించుకోవడం… ఇంటికి చేరడం… మిగతా రోజంతా ఆ కంప్యూటర్ మీద కూర్చుని, దాని పనిపట్టడం… అసలు పర్సనల్ కంప్యూటర్ అనగానేమి దగ్గర్నుంచి, దాని భాష ఏమిటో తెలుసుకునేదాకా…

మెల్లిమెల్లిగా దానిపై పట్టు ఎంత వచ్చిందంటే… మూడు విభిన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పట్టు దొరికించుకున్నాడు… అంతేకాదు, తనకంటూ ఓ సొంత లాంగ్వేజీ క్రియేట్ చేసుకున్నాడు… దాంతో అక్షరాలా ఆడుకోవడం స్టార్ట్ చేశాడు…

ఇతర మంత్రులు ఈర్ష్యపడేవాళ్లు… ఎవరో గుర్తించాలని, ఎవరో సర్టిఫికెట్ ఇవ్వాలని కాదు….. మనిషి కనిపెట్టిన ఓ సాంకేతిక పరికరం అది… అదేమైనా బ్రహ్మపదార్థమా..? అనుకున్నాడు… పూర్తి పట్టు సాధించాడు…

నిజానికి ఆ కుటుంబ పార్టీలో గనుక ఉండకుండా ఉంటే పీవీ ఎక్కడో ఉండేవాడు… సోనియా వంటి లీడర్ నెగెటివ్ దృష్టి పడకుండా ఉంటే ఎక్కడికో వెళ్లేవాడు… కాదు, దేశాన్ని ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్లేవాడు… ఒక లాల్ బహద్దూర్ శాస్త్రి, ఒక వాజపేయి, ఒక పీవీ…. ఇంకెవ్వరూ కనిపించడం లేదు ఆ కాలం తెర మీద… ఈరోజుకూ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…
  • డార్క్ వెబ్ అంటే… అది ఇల్లీగల్ కాదు, క్షుద్రమూ కాదు నానీ…
  • లోకేష్‌కు రాధాకృష్ణ సర్టిఫికెట్… తమరిక తప్పుకోవాలి బాబు గారూ…
  • అదెలా..? కేసీయార్‌కు నోటీసులిస్తే తెలంగాణకు ఇచ్చినట్టేమిటి..?!
  • ఫాఫం సాక్షి… నానాటికీ ప్రమాణాల ఖుర్బానీ… ఇదీ ఓ ఉదాహరణ…
  • హమ్మో… ఆ పాత నాగదుర్గ కాదు… ‘దారిపొంటచ్చి’ దడపుట్టించింది…
  • తేడా లేని పాటలు… నటిగా అదే జయప్రద… బాపు ఫెయిల్… దాసరి హిట్…
  • ఆ పదం వినగానే యూనిట్ మొత్తం కకావికలై పరుగులు తీసింది…
  • ఆయన ఆ జడ్జిని చూపిస్తే… ఈయన పోటీగా మరో జడ్జిని ప్రవేశపెట్టాడు…
  • మరో జలియన్‌ వాలాబాగ్… పాకిస్థాన్ ఆర్మీ ఘాతుకం… ఢాకా గుడి కథ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions