Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాదంబరి జెత్వానీ – జిందాల్ కేసులో ఇవేం ట్విస్టులు బాబూ..!?

July 20, 2026 by M S R

.

మీకు ఆ కేసు గుర్తుందా..? ముంబై నుంచి ఓ నటిని ఎత్తుకొచ్చారు, నిర్బంధించారు, హింసించారు, మొత్తం పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి దాసోహం అన్నది… ఆమె పేరు కాదంబరి జెత్వానీ… ఎందుకంత కక్ష? ఆమెకూ జిందాల్‌కూ నడుమ ఏదో యవ్వారం… బెడిసింది…

ఆయన గారు జగన్ గారిని అడిగారు… అసలే రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాడు, అడిగితే కాదనలేడు, అందుకని ఆమెను అలా పట్టుకొచ్చారు… కుక్కల విద్యాసాగర్‌తో ఆమె మీద ఓ కేసు దాఖలు చేశారు ఏపీలో… ఇంకేం, సినిమా నటి కదా, అందరికీ అలుసే… ఎత్తుకొచ్చేశారు… (యెల్లో మీడియా కూడా ఇదే కదా ప్రచారంలోకి తీసుకొచ్చింది)… సున్నితమైన జీవితాలు, ఆమె కుటుంబం కూడా కాస్త ఉన్నత స్థాయిలో బతికెేదే… సీన్ కట్ చేస్తే…

Ads

జగన్ పార్టీ దారుణాతిదారుణంగా ఓటమి పాలైంది… తన ప్రభుత్వం మీద, పాలన మీద ఎంత వ్యతిరేకత అంటే… చంద్రబాబు, పవన్ కల్యాణ్ మీద ప్రేమ లేకపోయినా, వేరే ఆల్టర్నేట్ దిక్కులేక జనం వాళ్లనే గెలిపించారు… జగన్ మరీ 11 సీట్లకు పరిమితమయ్యాడు…

కాదంబరి కేసులో ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేశారు… అసాధారణం… చంద్రబాబు ఆ ధైర్యం చేస్తాడని కూడా ఎవరూ అనుకోలేదు… ఆమె కేసును సీఐడీకి అప్పగించారు… ఆమెకు న్యాయం జరుగుతుందని అందరూ ఆశించారు… అంతకుముందు యెల్లో మీడియా కూడా ఆమెకు మద్దతుగా నిలిచింది… (టీవీ5 మూర్తి ఓవరాక్షన్ అయితే చెప్పనక్కర్లేదు, కొన్ని పాత వీడియోలు చూస్తుంటే…) కానీ ఇప్పుడు ఏం జరిగింది..?

తను చంద్రబాబు… పైగా ఆమె ఎవరి బాధితురాలు, జిందాల్… తను ఎవరు…? ఏపీలో పెట్టుబడులు పెట్టే వ్యాపారి… స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన, చంద్రబాబు హాజరు… తెర వెనుక ఏం జరిగింది..? ఏమో… సో, జగన్‌లాగే చంద్రబాబూ దాసోహం ఏమో… పెట్టుబడిదారుల ఎదుట సాగిలబడని రాజకీయ నాయకుడు ఎవరు ఈ కాలంలో..?!

ఈ మాట ఎందుకు చెప్పుకోవాలంటే… నిన్న ఈనాడులో వచ్చిన ఓ వార్త… అందులో ఏముందంటే..? సారాంశం… ‘‘కాదంబరి జెత్వానీ పలు దఫాలుగా కుక్కల విద్యాసాగర్‌ను బెదిరించి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయడంతో తను డబ్బులు ఇచ్చాడట… ఆమె, ఆమె తల్లి ఖాతాలకు ఏకంగా 1.32 కోట్లు చెల్లించాడట… ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్‌లను సీఐడీ విశ్లేషించిందట…

(ఆశా జెత్వానీ (తల్లి), నరేంద్రకుమార్ జెత్వానీ (తండ్రి), అంబరీష్ (సోదరుడు) ప్రమేయం లేదని సీఐడీ చెప్పిందట చార్జిషీటులో… మరి ఆమె తల్లికి డబ్బు ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేశాడు విద్యాసాగర్..? అంతా గందరగోళం… మొత్తానికి అర్థమవుతున్నదేమిటంటే..? జిందాల్ శుద్ధపూస, ఐపీఎస్ ఆఫీసర్లు శుద్ధపూసలు… కాదంబరి జెత్వానీ మాత్రమే నేరస్థురాలు, బ్లాక్‌మెయిలర్, కుక్కల విద్యాసాగర్ కూడా స్వాతిముత్యం…

మరి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను ఎందుకు సస్పెండ్ చేసినట్టు..? ఆమెను ఎత్తుకురావడం, నిర్బంధించడం, వేధించడం, బెదిరించడం, హింసించడం అంతా హంబగ్ అనుకోవాల్సిందేనా..? ఏమో, ఈనాడు వార్త చదివాక తలెత్తే బోలెడు ప్రశ్నలు… Subject to Corrections ,…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాజకీయులు అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ నుంచి ఏం నేర్చుకోవచ్చు..?
  • ఓ చేతిలో మొబైల్, మరో చేతిలో మైక్ ఉంటే… జర్నలిస్టేనా..?!
  • సత్యశ్రీ సోదరి ! నటి కాదు… నిన్నటి విక్రమ్ రాకెట్ ప్రాజెక్టులో సైంటిస్టు !!
  • బాలీవుడ్ పొగరు vs దక్షిణాది ప్రతిభ … సాయిపల్లవిపై వివక్ష వ్యాఖ్యలు
  • కదిలే రైలులో కంట్రాక్ట్ కిిల్లర్ ! ఢాం ఢాం ! మరో ‘మొగుడు’ ఖతం !!
  • వరల్డ్ కప్ ఫైనల్ కవరేజీలో… ఆ పత్రికలు అర్జెంటీనాలాగే ఓటమిపాలు!!
  • ఈ తేజస్విని మరణం – సమాజం ఎదుట కొన్ని కీలక ప్రశ్నలు !!
  • వాంగ్‌చుక్ ప్రతి అడుగు వెనుక ఆమె… నిజమైన సహచరి !!
  • నిజం చెప్పాలంటే., కొన్నిసీన్లలో మమ్ముట్టి ముందు రజనీ తేలిపోయాడు..!
  • పెళ్లి లేకపోతేనే శాంతి ! అవివాహిత తారల్లో ఈ ‘పంచదార’ చిలక కూడా !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions