మన శరీరపు సూపర్ హీరో – టమాటా… మొన్నా మధ్య ఆగస్ట్ 21,2023 న సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్సన్ (CDC) సంస్థ ఈ భూమి మీద టమాటాని మించిన ఫ్రూట్ లేదు అని చెప్పింది. CDC అంటే అమెరికా జాతీయ పబ్లిక్ హెల్థ్ సంస్థ. ఆరోగ్యానికి సంబంధించి సైన్స్ పరంగా డేటాని ఎనలైజ్ చేయటంలో దీనికి మించినది ఎక్కడా లేదు.
వాళ్ళు చెప్పింది ఏంటి అంటే – మన శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ వలన ఆక్సిడేటివ్ ఒత్తిడి కలిగి దానివలన కేన్సర్, గుండె జబ్బులు, డయాబిటీస్ ఇంకా చాలా జబ్బులు వస్తుంటై. టమాటాలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఆ ఫ్రీ రాడీకల్స్ ని తొలగిస్తాయి అందుకే మన శరీర సూపర్ హీరో టమాటో.
ప్రధానంగా కేన్సర్ కి కారకమయ్యే ఫ్రీ రాడీకల్స్ ని నిరోధించటంలో టమాటా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ( టమాటాతో పాటు క్యాన్సర్ రాకుండా ఫైట్ చేయటానికి ఉపయోగపడే మిగతా 7 ఆహార పదార్ధాలు; క్యారట్, పసుపు, పాలకూర, టీ & కాఫీ, బ్రకోలి, స్టాబెర్రీ మరియూ అవిసె గింజలు)
Ads
ప్రపంచంలో ఉన్న 100 కేలరీల ఫ్రూట్ లల్లో 17 పోషక విలువల మీద పరిశోధన చేసి టమాటా ఈజ్ నంబర్ ఫ్రూట్ ఆన్ ఎర్త్ మరియూ మన శరీర సూపర్ హీరో టమాటో అని పేర్కొన్నారు.
టమాటలో ఉండే లైకోపీన్, బీటా కెరోటిన్ మొదలగు వాటివలన చాలా మేలు జరుగుతుంది; వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, జలుబు, ఫ్లూ ని నిరోధిస్తుంది, చర్మానికి మేలు చేస్తుంది, కంటి చూపుకి ఉపయోగం, ఆస్థమాతో ఫైట్ చేయటానికి , కేన్సర్, గుండె జబ్బులు, డయాబిటీస్ ఇంకా చాలా వ్యాధులు రాకుండా దీనిలో ఉండే పోషకాలు పనిచేస్తాయి.
కొన్ని అధ్యయనాల ద్వారా హైపర్ టెన్షన్ కంట్రోల్ చేస్తుంది అని తేలింది. ఇంకా టమాటాలో ఉండే పోషకాలు బయోటిన్, విటమిన్ సీ ప్రోటీన్స్ ఉత్పత్తిని క్రమబద్దీకరిస్తాయి, ఎక్కువగా బీపీని తగ్గించే లక్షణాలు కూడా టమాటాల్లో ఉంటాయి. బోన్ స్త్రెంత్ కూడా పెంచుతుంది. టమాటాలో విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే మరీ ఎక్కువగా తింటే ఎసిడిటీ పెరుగుతుంది.
మన పూర్వీకులు దాదాపు టమాటాని ప్రతి కూరలో వేస్తారు అందుకే; కానీ ఎవడో ఒక గొట్టం గాడు వచ్చి చెప్పి ప్రూవ్ చేస్తే కాని నమ్మే స్థితిలో మనం లేం. నిజానికి మన ఊర్లో, మన జీవనవిధానంలో, మన పూర్వీకులు & పెద్దలు చెప్పే విషయాల్లో ఉన్న సైన్స్, శాస్తీయతని మించినది ఎక్కడా లేదు…… ( By జగన్నాథ్ గౌడ్ )
Share this Article