Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డీఎంకే స్టాలిన్‌తో స్ట్రెయిట్ ఫైట్‌కే విజయ్ రెడీ! ఇలా మొదలైంది!!

July 30, 2026 by M S R

.

త్వరలో ఎన్నికలు – సిద్ధంగా ఉండండి – విజయ్ ప్రభుత్వం చాన్నాళ్లు ఉండదు – మన వాళ్ల మద్దతుతోనే మనుగడ – ఊతకర్రలు తీసేస్తే ఉట్టి మునిగినట్టే -… ఇలా డీఎంకే నేత స్టాలిన్ ఝలక్కులు  ఇస్తున్నాడు కదా సీఎం విజయ్‌కు..!

వీళ్లు కాకపోతే అన్నాడీఎంకే వాళ్లు కాచుక్కూర్చున్నారని తెలుసు కదా, అందుకని తాడోపేడో తేల్చేసుకుందాం అని విజయ్ ఫిక్సయిపోయినట్టున్నాడు… డీఎంకేతో ఫైట్‌కు రెడీ అయిపోయాడు… డీఎంకే పార్టీలో ఆర్థిక, తెర వెనుక యవ్వారాలకు సూత్రధారి, కింగ్ పిన్ మీదే గురిపెట్టాడు… అవును…

Ads

వి.సెంథిల్ బాలాజీ మీద ఏసీబీ గురిపెట్టింది… తన నివాసంలోనే కాదు, బంధువులు, సన్నిహితుల నివాసాల్లో దాడులు చేసింది నిన్న… అది చెప్పే కారణాలు… (తనపై గతంలోనూ కేసులున్నాయి, నేరచరితుడే)…

1) తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో నడిచే ‘టాస్మాక్’ (TASMAC – Tamil Nadu State Marketing Corporation) ద్వారా మద్యం కొనుగోళ్లు, పంపిణీ, డిస్టిలరీల కేటాయింపులలో జరిగిన భారీ ఆర్థిక అవకతవకలు, అక్రమాస్తుల కూడబెట్టడం… సెంథిల్ బాలాజీ గతంలో రవాణా, ఎక్సైజ్/ విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఈ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి… స్టాలిన్‌ను కూడా ఇరికించే ఆధారాల కోసం ఏసీబీ వేట ఇప్పుడు!!

2) ఎమ్మెల్యేల కొనుగోలు (హార్స్ ట్రేడింగ్) ఆరోపణలు… తాజాగా ఒక ఎమ్మెల్యేను ప్రలోభపెట్టి, ఓటింగ్‌ను ప్రభావితం చేసేందుకు రూ. 35 కోట్ల భారీ మొత్తాన్ని ఎరగా చూపారనే ఆరోపణలకు సంబంధించి వెలుగు చూసిన ‘హార్స్ ట్రేడింగ్’ (Horse-trading) వివాదంలో సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్‌ల ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు, దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి… ఇందులోనూ స్టాలిన్‌ను ఇరికించే ప్రయత్నం…

senthil

ఇంతకీ ఎవరు ఈ సెంథిల్ బాలాజీ..? 

తమిళ రాజకీయాల్లో పవర్ ఫుల్ లీడర్… పశ్చిమ తమిళనాడులో బలమైన నెట్‌వర్క్, డబ్బు, సాధనసంపత్తి… పార్టీలకు తను కావాలి, తనకు ఏ పార్టీ అయినా ఒకటే… ముందుగా జయలలిత కేబినెట్‌లో రవాణా మంత్రి… తరువాత టీటీవీ దినకరన్‌కు మద్దతు, కొన్నాళ్లకే స్టాలిన్ క్యాంపులో చేరాడు… ఈ కేబినెట్‌లో కూడా పవర్ ఫుల్ మంత్రి (విద్యుత్తు- ఎక్సయిజు)… కోయంబత్తూరు, ఈరోడ్, కరూర్ ఏరియాల్లో బలమైన రాజకీయ పట్టు తనది…

అన్నాడీఎంకే మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలకు డబ్బు (Cash for Jobs) స్కామ్ బయటపడింది… ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది… మంత్రిగా ఉండగానే 2023లో అరెస్టు చేసింది… ఐనా స్టాలిన్ తనను తొలగించలేదు… పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తొలగించాల్సి వచ్చింది…

ఈ కేసులో తను ఎన్నిసార్లు బెయిల్ ప్రయత్నాలు చేసినా బెయిల్ రాలేదు, 15 నెలలపాటు జైలులోనే ఉన్నాడు… మధ్యలో ఏదో ఆపరేషన్ కూడా జరిగింది… ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది… వెంటనే స్టాలిన్ తనను అదే పోర్ట్‌ఫోలియోతో మళ్లీ కేబినెట్‌లోకి తీసుకున్నాడు… అదీ తన పవర్… (సెంథిల్, తన సోదరుడు అశోక్, మరికొందరు నాయకులను కలిపి కరూర్ గ్యాంగ్‌గా వ్యవహరిస్తారు)…

నిజానికి విజయ్‌ను పదే పదే ఎందుకు గోకుతున్నాడో, స్టాలిన్ లెక్కలేమిటో ప్రస్తుతానికి ఓ అస్పష్టత… సెంథిల్ బాలాజీ స్కెచ్ ఏమిటో, తెర వెనుక యవ్వారాలేమిటో ఓ అస్పష్టత… ఓ తమిళ జర్నలిస్టు వ్యాఖ్య ఏమిటంటే..? *విజయ్ ప్రభుత్వం కూలిపోకపోతే, ఇదే బాలాజీ మళ్లీ ఇదే విజయ్ కేబినెట్‌లోకి మళ్లీ అదే విద్యుత్తు- ఎక్సయిజు మంత్రిగా చేరిపోయినా ఆశ్చర్యపడకూడదు* అన్నట్టు, తన మీద ఈడీ కేసు క్లోజ్ కాలేదు… ఈలోపు సెంథిల్‌నే ముందు పెట్టి, బీజేపీ రంగప్రవేశం చేస్తుందా..? చూడాలి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజం ఏదో చెప్పాల్సిన మీడియానే… నిజం కోసం వెతకాల్సి వస్తే ?
  • ఆరబోత – వాన పాట – అదీ ఓ కుర్ర హీరో … అప్పట్లో సౌందర్య సైతం !!
  • అనసూయా జాగ్రత్త ! కర్మ ఎవరినీ వదలదు ! పది రెట్లు తిరిగి ఇస్తుంది !!
  • రేవంత్‌ రెడ్డిపై బహుముఖ కుట్ర ! జగన్ కూడా ఓ పాత్రధారేనా ?
  • నూరేళ్ల విల్లాకు కొత్త కళ ! సొగసైన బ్యాటింగే కాదు – కళాత్మక అభిరుచి !
  • కాళేశ్వరం బరాజుల బ్లండర్స్‌లాగే ఈనాడులో ఓ బ్లండర్ కథనం..!
  • న్యూయార్క్ సిటీ మేయర్ పక్కా భారత ద్వేషి- నిజమే, సో వాట్..?!
  • అబ్బో.., రేవంత్‌ను కూల్చేస్తే బీఆర్ఎస్ సహకరిస్తుందట !!
  • SIR – తెలంగాణ Chief Electoral Officer కి పద్మశ్రీ ఇవ్వాలి మోదీజీ…!!
  • ఆర్గానిక్ హిట్..! టాలీవుడ్‌కు ఓ ‘మంచిబాట’ చూపిన ఇరుముడి..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions