Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇదేందే హన్మంతన్నా… ఇది నీ భాషా కాదు, నీ స్క్రిప్టూ కాదు…

August 8, 2026 by M S R

.

ఓ వీడియో కనిపించింది, ఫేస్‌బుక్‌లో… దిగువన లింక్ ఉంది… చూస్తుంటే నవ్వొచ్చింది, ఎందుకో కూడా చెబుతాను… అందులో ఉన్నది కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు… వీర కాంగ్రెస్‌వాది… పుట్టు కాంగ్రెస్… చాలా సీనియర్… భోళా మనిషి కూడా… ఇతర పార్టీల నాయకులతోనూ బాగానే ఉంటాడు…

తను నిజానికి ఎక్స్‌టెంపర్‌గానే తన అనుకున్నది బడబడా చెప్పేయగలడు… ప్యూర్ హైదరాబాదీ తెలంగాణ యాక్సెంటులో… తనకు ఏ స్క్రిప్టులు, ముందస్తు ప్రిపరేషన్లు, క్లాసులు, ట్రెయినింగులు, రిహార్సల్స్ ఏమీ అక్కర్లేదు… కానీ ఈ వీడియలో స్మార్ట్ ఫోన్‌లో స్క్రిప్టు చదువుతున్నాడు… అదీ నవ్వొచ్చింది… అంతేకాదు…

Ads

తను ఏమంటాడంటే..? ‘‘ఒక సందర్భంలో… నేను, కేసీఆర్‌, ఫ్రొఫెసర్‌ జయశంకర్‌ ముగ్గురమే ఉన్నాం, అప్పుడు జయశంకర్‌ను కేసీఆర్‌ అవమానపరిచేట్లు నోటికొచ్చినట్లు మాట్లాడారు, నేను కేసీఆర్‌ మాటలు విని చాలా బాధ పడ్డాను…. ఆ తరువాత జయశంకర్‌ను అడిగాను… ఇవాళ మాట్లాడిన మాటలు చాలా తక్కువ,
ఇలాంటి మాటలు తరచూ అంటూ ఉంటాడు….కాని నేను ఏమి చేయలేను హనుమంతున్నా అన్నాడు.

నాకు ఆలోచన ఉంది… దానిని అమలు చేసే శక్తి నాకు లేదు… మంచి అయినా చెడు అయినా…. కేసీఆర్‌ నోటికొచ్చినట్లు మాట్లాడినా…. తెలంగాణ రాష్ట్రం కోసం భరిస్తున్నా అన్నాడు. బతికి ఉన్నప్పుడు అవమాన పరిచిన బీఆర‌‌ఎస్‌ నాయకులు…ఇప్పుడు ఆయనను దేవుడు మాదిరి కొలుస్తున్నారు…’’

…. ఇలా చదువుతూ వెళ్లాడు, అది తన భాష కాదు, అప్పటికప్పుడు మాట్లాడిన మాటలూ కాదు… ఎస్, మొన్నటి ఆరో తేదీన జయశంకర్ జయంతి… బీఆర్ఎస్ సహా తెలంగాణవాదులు అందరూ ఆయన్ని స్మరించుకున్నారు… సహజం…

తనకు జాతిపిత అనే పేరు రాకుండా ఉండేందుకు, కేసీయార్ పదే పదే తనను జాతిపితగా తన అనుచరగణంతో చిత్రీకరించుకునేందుకు పాడే పాట్లు అందరికీ తెలుసు… ఆ పదానికి అర్హుడు జయశంకర్ మాత్రమే అనేది సగటు తెలంగాణవాది అంతరంగం… ఎవరినైనా తిట్టేయడం కేసీయార్ తత్వం… తనతో కలిసి నడిచిన, నడిచేవాళ్లందరికీ తెలుసు అది…

ఆయన బతికి ఉన్నప్పుడు తిట్టారు, అవమానించారు సరే, కానీ ఇప్పుడు అనివార్యంగా జనంలో పలుచన గాకుండా ఉండేందుకు స్మరిస్తున్నారు కదా బీఆర్ఎస్ నేతలు… దాన్ని తప్పుపట్టే పనేముంది హన్మంతన్నా..? పైగా నీ నుంచి ఇలాంటి విమర్శలు అస్సలు చూడలేదు ఎప్పుడూ, ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు, అదీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్, అదీ నీకు అస్సలు సూట్ కాని నాన్-తెలంగాణ డిక్షన్…

ఓ జాతికి మార్గదర్శకంగా నిలిచిన వ్యక్తిని స్మరించకపోతే విమర్శిస్తే తప్పులేదు, కానీ వీళ్లు తప్పు తెలుసుకుని, ఇప్పుడైనా కొలుస్తున్నారు కదా… జనం కోసమైనా దండలు వేస్తున్నారు, దండాలు పెడుతున్నారు… సో, ఇప్పుడు ఏమంటావన్నా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇదేందే హన్మంతన్నా… ఇది నీ భాషా కాదు, నీ స్క్రిప్టూ కాదు…
  • ఒకప్పటి వైసీపీ నెంబర్ టూ – విజయసాయిరెడ్డి దారి ఎటు..?
  • ఆప్’ కోపం ! పాకిస్థాన్ ఉగ్రకుట్ర బయటపెట్టినందుకు శిక్షించింది !!
  • హరీష్ గొంతులో పచ్చి వెలక్కాయ ! బనకచర్లకు కేంద్రం చెక్ !!
  • డూప్లికేట్ ‘ఆధార్’లతో డబుల్ జీతాలు… దోషులపై క్రిమినల్ కేసులు !
  • వామికా గబ్బి ! డీసీ సినిమాకు ప్రధాన బలం ఈమె నటనే !
  • నిజంగానే ‘కొరియన్ కనకరాజు’ ఎన్టీఆర్‌ను అవమానించాడా !?
  • UPI పై చార్జీల బాదుడు ! అమెరికా ఒత్తిడే కారణమా !?
  • ‘ఏక్ దిన్’… సాయిపల్లవి ఉద్వేగ ప్రదర్శన అపూర్వం ! ఓ వసంత కోకిల !!
  • శ్రీశైలం పవర్ జనరేషన్‌పై బీఆర్ఎస్ క్యాంపు క్షుద్ర వాదన !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions