.
Pardha Saradhi Potluri …. ఫ్రాన్స్ లో విద్యార్థుల హింస!
165 మంది అదనపు టీచింగ్ స్టాఫ్ ని స్కూళ్లలో నియమించే విషయంలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నది అనే కారణం చూపిస్తూ ఫ్రాన్స్ లోని విద్యార్థులు దేశ వ్యాప్తంగా హింసాత్మాక ఆందోళనకి పాల్పడుతున్నారు!
ఈ రోజు వరకూ 500 స్కూళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా మూసివేయడం జరిగింది!
బయటికి కనిపిస్తున్న కారణాలు…
1.ఫ్రాన్స్ ప్రభుత్వం పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా స్కూల్ ఫీజులని పెంచాలనే ప్రతిపాదన తెచ్చింది. దీనిని విద్యార్థులు తిరస్కరించారు.
2. ఫీజుల పెంపు విషయంలో విద్యార్థుల ఆందోళన సమంజసమే, అలా అని అదనపు టీచింగ్ స్టాఫ్ నియామకం విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోలేక పోయింది ప్రభుత్వం!
Ads
3.ఇదే అదనుగా ఫ్రాన్స్ లోని విద్యార్థి సంఘాలు ఆందోళనకి పిలుపు ఇవ్వడం జరిగింది! మొదట్లో శాంతియుతంగా నిరసన తెలిపినా హఠాత్తుగా హింసకి దారి తీసింది!
4.గత పది రోజులుగా ఫ్రాన్స్ హింసతో అట్టుడుకుతున్నది! పారిస్ ( Paris ), స్ట్రాట్స్ బర్గ్ ( Strasbourg ), లియోన్ ( Lyon ) నగరాలలో షాపులని లూటి చేసి తగలపెట్టడం, స్కూల్స్, కాలేజీ లలో ఫర్నిచర్ ని దగ్ధం చేయడం, రోడ్ల మీద వెళుతున్న వాహనాల మీద డస్ట్ బిన్ లని వేసి ధ్వంసం చేయడం జరుగుతున్నది.
5. ఇవన్నీ విద్యార్దులే చేస్తున్నారు అని అనుకుంటే పొరపాటు. విద్యార్థులతోపాటు వలస వచ్చిన ముస్లిమ్స్, ఫ్రాన్స్ లోని లెఫ్టిస్టులు కలిసి చేస్తున్నారు.
పోలిక చూడండి…
6. ఫ్రాన్స్ ఎడ్యుకేషన్ మినిష్టర్ ఎడ్వర్డ్ జెఫ్రె ( Edouard Geffray ) విద్యార్థులతో చర్చలు జరుపడానికి ఒప్పుకున్నా హింస ఆగడం లేదు! విద్యార్థి సంఘాలు డిమాండ్స్ ఏమిటి?
7.ఇప్పుడున్న టీచర్స్ సంఖ్యని రెట్టింపు చేయాలి. స్కూల్స్, కాలేజీలకి ఇప్పుడు వెచ్చిస్తున్న నిధులని రెట్టింపు చేయాలి. క్లాసులో విద్యార్థుల సంఖ్య తగ్గించి ఆ మేరకు సెక్షన్లని పెంచాలి. స్కూళ్లలో సౌకర్యాలు మెరుగుపరచాలి. ఇలా మరికొన్ని డిమాండ్స్ ఉన్నాయి.
వీటి విషయంలో ఫ్రాన్స్ ప్రభుత్వం విద్యార్థి సంఘాల నాయకులతో చర్చలు జరిపి నిర్ణయిద్దాం అని చెప్పినా విద్యార్థి సంఘాలు ఒప్పుకోకుండా ముందు అమలు చేస్తేనే ఆందోళన ఆపుతాం అని అంటున్నాయి.
హింసలో ఆస్తుల నష్టం జరిగింది కానీ ప్రాణ నష్టం జరగలేదు. ఫ్రాన్స్ పోలీసులు హింసని ఆపలేకపోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది!
పోలీసులు కాల్పులు జరిపేంత హింస ప్రజ్వరిల్లుతున్నా కేవలం టియర్ గ్యాస్ ప్రయోగించి ఊరుకుంటున్నారు!
8. ఇప్పటి వరకూ ( అక్టోబర్ 5) 5,000 మందిని పోలీసులు అరెస్టు చేసి చార్జెస్ ఫైల్ చేశారు, వీళ్ళలో విద్యార్థులతో పాటు విద్యార్థులు కానివారే ఎక్కువగా ఉన్నారు.
ఫ్రాన్స్ న్యాయశాఖ మంత్రి ఆర్డర్స్ :
హింసకి పాల్పడి ఆస్తి నష్టం కలిగించిన విద్యార్థుల తల్లితండ్రులని ఆస్తి నష్టానికి బాధ్యులుగా చేసి వాళ్ళ నుండి నష్టపోయిన షాపు, వాహన యజమానులకి నష్ట పరిహారం ఇప్పించే దిశగా చర్యలు తీసుకోమని ఫ్రాన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇచ్చింది!
గత రెండు నెలలుగా బొద్దింకలు స్కూళ్ళకీ వెళ్లి తనిఖీ చేసే నెపంతో వార్తలలో ఉండడం ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరుగుతున్న హింసకి సంబంధం ఉంది!
ఇలాంటి వాటికి వ్యూహ రచనలు చేసేది జార్జ్ సోరోస్ & Co.,
కాకపొతే జార్జ్ సోరోస్ ఎంపిక సరిగా లేదు.. అభిజిత్ చిప్కే, రాంకా, సౌరవ్ దాస్ లు స్క్రిప్ట్ కి తగిన న్యాయం చేయలేకపోతున్నారు!
ఫ్రాన్స్ లో విద్యార్థులతో లెఫ్టిస్ట్ లు కలిసి తోడుగా పాలస్తినా మద్దతుదారులని కలుపుకొని హింసకి పాల్పడుతున్నారు కానీ మన దేశంలో నేహా బోహ్రా లాంటి తుకడే గ్యాంగ్ ప్రయత్నిస్తున్నారు కానీ సక్సెస్ కాలేకపోతున్నారు.
జార్జ్ సోరోస్ స్క్రిప్ట్ రైటర్, నిర్మాత, దర్శకుడి బాధ్యత తీసుకొని నటీ నటులని ఎంచుకోవడంలో ఫ్రాన్స్, జెర్మనీలో సఫలం అయినా భారత్ లో విఫలం అయ్యాడు!
అమిత్ షా సరిగ్గానే వ్యవహారిస్తున్నారా? గత ఏప్రిల్ నెలలో 61,000 కోట్ల రూపాయలు విత్ డ్రా అయ్యాయి. అవి నగదు రూపంలో వివిధ వ్యక్తుల దగ్గర ఉన్నాయి. ప్రస్తుత బొద్దింకల ఆందోళనలకి నగదు రూపంలోనే చెల్లింపులు జరుగుతున్నాయి కాబట్టి మనీ లాండరింగ్ పేరుతో ఎవరినీ అరెస్ట్ చేయలేరు.
అరెస్ట్ అంటూ జరిగితే అనుమతి లేకుండా ప్రదర్శనకి దిగడం, అధికారుల విధులని అడ్డుకోవడం, పబ్లిక్ న్యూసెన్స్ లాంటి కేసులు మాత్రమే పెట్టగలుగుతున్నారు. ఈ కేసులలో కొన్ని స్టేషన్ బెయిల్ మరికొన్ని మేజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ వచ్చేవే!
ఇక యూ ట్యూబర్లకి కూడా నగదు రూపంలోనే చెల్లింపులు జరుగుతున్నాయి కాబట్టి దొరకరు.
ప్రెజర్ కుక్కర్ స్ట్రాటజీ?
- ప్రస్తుతం అమిత్ షా అండ్ కో ప్రెజర్ కుక్కర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు.
జస్ట్ కుక్కర్ లో నీళ్లు వేడెక్కి ఆవిరి విజిల్ రూపంలో బయటికి వెళ్లిపోయే వరకూ వేచి చూసి నీళ్లు అయిపోయాక కింద మంట ఆపేస్తారు!
నీళ్లు అయిపోయే వరకూ కుక్కర్ విజిల్ వేస్తూనే ఉంటుంది సహజంగానే!
My observations… గూగుల్ న్యూస్ ఫీడ్ లో ఒకే సంఘటన మీద The Hindu, Al Jazeera లను హై లైట్ చేస్తూ ఫీడింగ్ ఉంటున్నాయి గత ఆరు నెలలుగా! ఘటన నేషనల్ లేదా ఇంటర్నేషనల్ అయినా సరే ఈ రెండు మాత్రమే హై లైట్ అవుతాయి. వాటిని ఓపెన్ చేయకుండా స్వాప్ చేస్తున్నా సరే అవే వస్తున్నాయి న్యూస్ ఫీడ్ హై లైట్స్ లోకి. అంటే ఈ రెండూ గూగుల్ కి పేమెంట్స్ చేస్తున్నాయి!
ఒక యూట్యూబ్ విశ్లేషకుడు ఏమంటాడు అంటే మోడీకి ప్రజాదరణ తగ్గుతూ ఉండడం చేత త్వరలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలుతుందిట!
మరో తెగులు తమ్ముడు ఇంకొంచెం పైకి వెళ్ళిపోయి 200 మంది బీజేపీ MP లు బీజేపీని వీడి చంద్రబాబుతో చేరుతారుట, అంచేత చంద్రబాబు ప్రధానమంత్రి అయిపోయి లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడని తెగ రాలిపోతున్నాడు సదరు శాల్తీ!
61,000 కోట్ల రూపాయల మహిమ!
Share this Article