మొన్నటి నుంచే స్టార్ట్… మళ్లీ అల్లు అర్జున్ ఏమన్నాడు..? ఒక్కో మాట వెనుక అర్థమేమిటి…? ఆల్రెడీ పవన్ కల్యాణ్ స్మగ్లర్లు హీరోలేమిటీ అన్నాడు కదా… బన్నీ మీద ఫుల్లు నెగెటివ్, అప్పట్లో నాగబాబూ అన్నాడుగా, పరాయోళ్లు, సొంతోళ్లు అని… ఇక ఈ వైరం తెమలదు… నా ఫ్రెండ్స్ కోసం నేనేమైనా చేస్తా అన్నాడు కదా బన్నీ… అంటే నాగబాబుకు, పవన్ కల్యాణ్‌కు ఇచ్చిపడేశాడు అంటూ ఫ్యాన్స్ నెట్‌లో ఒకటే రొద…
చూశారా, చూశారా, సుకుమార్‌ను హత్తుకున్నాడు, అంటే విభేదాలు లేనట్టే కదా అంటాడొకడు… ఫ్యాన్స్‌ను చూసి హీరో అయ్యానన్నావ్, హీరో గాకుండా ఫ్యాన్సెలా వచ్చారోయ్ అని ప్రశ్నిస్తాడు మరొకడు… ఐనా మెగా క్యాంపు అనే మర్రిచెట్టు కిందే బతకాలా బన్నీ… సొంతంగా తనే ఓ మర్రిచెట్టు కావాలని అనుకోవడం తప్పా..? జై చిరంజీవి, జై పవన్‌కల్యాణ్ అని ఎప్పుడూ నినదించాల్సిందేనా..? తనకంటూ ఓ సొంత వ్యక్తిత్వం, సొంతంగానే ఇంకా ఎదగాలనే ఆశ తప్పా..?
సరే, ఈ ఖండనమండనల మాటెలా ఉన్నా… రోజూ ఇదే చర్చ, ఉండొచ్చు… చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాల నడుమ కూడా గతంలో ఉన్నంత బలమైన బంధం లేదనీ అంటున్నారు కదా… రాంచరణ్‌లాగే బన్నీ కూడా పోటీగా ఓ పాన్ ఇండియా హీరోలా ఇంకా ఎదగాలనుకుంటే ఠాట్, కుదరదు అని మనం రుసరుసలాడటం దేనికి..? దాన్ని వదిలేద్దాం కాసేపు… సేమ్ ఇలాంటి కథే మరో కుటుంబంలో కూడా…
Ads
అసలు సినిమా వ్యక్తులు, కుటుంబాలు అంటేనే విపరీతమైన ఇగోయిస్టిక్… తమ అహాలను ఫ్యాన్స్‌కు కూడా రుద్దుతుంటారు… సర్లె, మరో విషయానికి వస్తే… బాలయ్య బాబు, అదేనండీ బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్లు అవుతుందట కదా… ఈ సందర్భంగా ఓ పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయబోతున్నారు… సెప్టెంబరు ఒకటిన…
దానికి జూనియర్ ఎన్టీయార్‌ను పిలుస్తారా అనేది మరో చర్చ… పిలవనక్కర్లేదు అన్నాడట బాలయ్య… అసలు మొదటి నుంచీ జూనియర్‌ను దూరం దూరమే పెడుతున్నారుగా… ఏదో అప్పట్లో చంద్రబాబుకు అవసరమొచ్చి, వీళ్లందరినీ కలిపాడు… ఆ తరువాత తన సహజ ధోరణిలో అవసరం తీరగానే జూనియర్‌ను తీసి పక్కన పారేశాడు… చంద్రబాబు తత్వం అర్థమై ఇక తను దూరంగా ఉంటున్నాడు… చంద్రబాబు క్యాంపుకి పది ఆమడల దూరంలోనే మెలుగుతున్నాడు…
చివరకు తమ సోదరికి కూకట్‌పల్లి టికెట్టిచ్చినా సరే, జూనియర్ ప్లస్ కల్యాణరామ్ ప్రచారానికి వెళ్లలేదు… ఇక ఆ దూరం తగ్గదు… జూనియర్ పాపులర్ అవుతూ ఉంటే తన అసలు సిసలు రాజకీయ వారసుడు లోకేష్‌కు ఇబ్బంది కాబట్టి చంద్రబాబు ఇక జూనియర్‌ను దగ్గరకు రానివ్వకపోవచ్చు… అలా సహజంగానే బాలకృష్ణకూ పడదు… ఐతే సొంతంగా తనకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకుంటున్న జూనియర్ ఊరుకుంటాడా..?
తన రాబోయే సినిమా దేవర ఉంది కదా… దాని ప్రిరిలీజ్ ఈవెంట్ కర్నూలులో భారీగా ప్లాన్ చేస్తున్నాడట… భలే వారే, తనెందుకు బాలయ్యను రమ్మంటాడు… నెవ్వర్… అటు అల్లు వారి ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ నడుస్తూనే ఉంటుంది కదా… ఇటు జూనియర్ వర్సెస్ బాలయ్య కూడా అలా నడుస్తూనే ఉంటుంది… ఈ వైరంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏపీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పాత్రధారులు… అదీ విశేషం..!!
Share this Article