.
ప్రతిపక్షం… ఎన్నికల సంఘం, ఆర్మీ, స్పీకర్, సీబీఐ, ఈడీ… ప్రతి వ్యవస్థను టార్గెట్ చేస్తోంది… సిస్టమ్‌ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తోంది… డీలిమిటేషన్ వద్దు, మహిళా రిజర్వేషన్లు వద్దు, ఎన్ఆర్సీ వద్దు, సీఏఏ వద్దు, సర్ ప్రక్రియ వద్దు… ఏదీ వద్దు… చివరకు జడ్జిల మీద పడ్డారు… తాజాగా ఇది కేజ్రీవాల్ వంతు…
“నాకు న్యాయం జరుగుతుందా?” : జస్టిస్ స్వర్ణ కాంత శర్మపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు… ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీ హైకోర్టులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు… ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన సీబీఐ పిటిషన్‌ను విచారిస్తున్న జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ కేసు నుండి తప్పుకోవాలని (Recusal) ఆయన కోరాడు… ఈ సందర్భంగా న్యాయమూర్తి గతంలో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ కార్యక్రమాలకు హాజరయ్యారని కేజ్రీవాల్ ఆరోపించాడు…
Ads
ఆమె ఆర్ఎస్ఎస్ మనిషి అని ముద్ర వేయడం, తద్వారా తన కేసు విచారణపై ప్రభావం ఉంటుందని ముందే ఆ జడ్జిని డిఫెన్స్‌లో పడేసే ఎత్తుగడ… కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన కేజ్రీవాల్, జస్టిస్ స్వర్ణ కాంత శర్మ గతంలో ‘అధివక్త పరిషత్’ అనే న్యాయవాదుల సంస్థ నిర్వహించిన కార్యక్రమాలకు నాలుగుసార్లు హాజరయ్యారని పేర్కొన్నాడు…
-
రాజకీయ ప్రేరేపితం…: “అధివక్త పరిషత్ అనేది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం కలిగిన సంస్థ… ఆ భావజాలాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం,,. ఈ కేసు పూర్తిగా రాజకీయ కోణంతో కూడుకున్నది” అని కేజ్రీవాల్ వాదన…
-
నిష్పాక్షికతపై ప్రశ్నలు…: ప్రత్యర్థి భావజాలం ఉన్న సంస్థలతో సంబంధం ఉన్న న్యాయమూర్తి విచారణ జరిపితే, తమకు న్యాయం జరుగుతుందా? అన్న సందేహం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు… “ప్రజాస్వామ్యంలో పారదర్శకత కంటే, ప్రజల్లో ఉండే అభిప్రాయం (Perception) ముఖ్యం” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశాడు…
సీబీఐ తీరుపై విమర్శలు … కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)పై కూడా కేజ్రీవాల్ విరుచుకుపడ్డాడు… సీబీఐని గతంలో కోర్టులే “పంజరంలో చిలుక”గా అభివర్ణించాయని, రాజకీయ ప్రత్యర్థులపై మాత్రమే విచారణ సంస్థలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని ఆయన ఆరోపించాడు…
“ట్రయల్ కోర్టు వేల పేజీల రికార్డులను పరిశీలించి మమ్మల్ని నిర్దోషులుగా ప్రకటించింది… కానీ హైకోర్టు కేవలం ఒక చిన్న విచారణ తర్వాత, మా వాదనలు వినకుండానే ఆ తీర్పు తప్పని (Prima facie erroneous) ఎలా చెబుతుంది? ఇది చూసి నా గుండె ఆగిపోయినంత పనైంది” అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించాడు…
“మీరు లాయర్ అయిపోవచ్చు” – జడ్జి ప్రశంస …. సుమారు గంటకు పైగా కేజ్రీవాల్ వినిపించిన వాదనలను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ నిశితంగా గమనించారు. ఆయన వాదనలు ముగిసిన తర్వాత స్పందిస్తూ.. “మీరు చాలా బాగా వాదించారు. మీరు భవిష్యత్తులో లాయర్ కూడా అయిపోవచ్చు” అని చిరునవ్వుతో వ్యాఖ్యానించారు. దీనికి కేజ్రీవాల్ బదులిస్తూ.. “ధన్యవాదాలు మేడమ్, ప్రస్తుతం నేను చేస్తున్న పనితోనే సంతోషంగా ఉన్నాను” అని నవ్వుతూ సమాధానమిచ్చాడు…
నేపథ్యం … ఫిబ్రవరి 27న ట్రయల్ కోర్టు మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. (ఇందులో కేసీయార్ బిడ్డ కవిత కూడా ఉంది)… అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది… మార్చి 9న హైకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరిస్తూ, ట్రయల్ కోర్టు తీర్పులో లోపాలు ఉన్నాయని ప్రాథమికంగా అభిప్రాయపడింది… దీనిపైనే కేజ్రీవాల్ ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు…
అవునూ, ఇన్నాళ్లు ‘నాట్ బిఫోర్ మి’ అనేది న్యాయవ్యవస్థలో చూస్తున్నాం, న్యాయమూర్తులే కొన్ని కేసులను తమ విచారణకు రాకుండా అవాయిడ్ చేయడం… ఇది పూర్తిగా డిఫరెంట్, నాట్ బిఫోర్ దట్ జడ్జ్ అనే కేజ్రీవాల్ కొత్త ధోరణి… ఫలానా జడ్జి వద్దు అని నిందితుడు డిమాండ్ చేసే హక్కు, అవకాశం ఉంటాయా యువరానర్..?
Share this Article