.
నాటు కొట్టుడు, వీర కొట్టుడు, దంచి కొట్టుడు… అని అప్పట్లో చిరంజీవి బూతు పాట… ఆ సినిమాలో ఆ పాటకు ఆ అర్థమేదైనా సరే గానీ… ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో బ్యాటింగుకు కూడా సరిపోతాయి ఆ పదాలు, ఆ వ్యక్తీకరణ… కేవలం దంచుడు కోసమే రూల్స్, పిచ్‌లు… దంచుతుంటేనే స్టేడియాల్లో కేకలు… ప్రత్యక్ష ప్రసారం చూసే వీక్షకుల్లో జోష్… మరి బౌలర్లు..?
నిత్య నరకం… ఇది బ్యాటర్ల ఆట మాత్రమేనా..? ఇవే కదా ఐపీఎల్ మీద వస్తున్న విమర్శలు… చివరకు స్టార్ బౌలర్ బుమ్రా కూడా వికెట్లు సాధనలో విఫలమవుతున్న వేళ… ఇద్దరు కొత్త కుర్రాళ్లు ప్రఫుల్, సాకిబ్ సంచలనం క్రియేట్ చేశారు… ప్రఫుల్ తొలి ఓవర్‌లోనే రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో ముగ్గురు స్టార్ బ్యాటర్లను ఔట్ చేయడం అయితే సూపర్బ్…
Ads
సాకిబ్ కూడా మ్యాచులో నాలుగు వికెట్లు తీశాడు, ప్రఫుల్‌లాగే… వరుస విజయాలతో టాప్‌లో ఉన్న ఆర్ఆర్ ఈ దెబ్బకు నేలకు దిగొచ్చింది… సో, ఐపీఎల్ బ్యాటర్ల స్వర్గం మాత్రమే, బౌలర్లకు నరకం దశ నుంచి ఇలాంటి బౌలర్లు కొత్త దశను చూపిస్తున్నారనే విశ్లేషణలు కనిపిస్తున్నాయి… ఆ ఇద్దరూ ప్రశంసలకు అర్హులే కానీ ఒకేసారి ఆ నిర్దారణకు రావడం సరైంది కాదు…
ఎందుకంటే..? వాళ్లు రిజర్వ్ ప్లేయర్లుగానే ఉంటున్నారు… ఎప్పుడైతే హైదరాబాద్ టీం బౌలింగ్‌లో పస లేదని గత మ్యాచుల్లో తేలిపోయిందో, కెప్టెన్ కూడా ఇలాంటి బౌలర్ల బౌలింగుతో పెద్ద స్కోర్లయినా సరే ఎలా డిఫెండ్ చేసుకోగలం అని బహిరంగంగా కామెంట్ చేశాడో, అప్పుడు అనివార్యంగా ఒకరిద్దరు పాత బౌలర్లను పక్కనపెట్టి రిజర్వ్ బెంచ్ మీద ఉన్న ఈ ఇద్దరు కుర్రాళ్లను ఆటలోకి తీసుకొచ్చింది కావ్య మారన్…
జస్ట్ 60 లక్షలకు కొనుక్కుంది వీళ్లను వేలంలో… అలాంటి ‘చౌక ప్లేయర్లే’ ఇప్పుడు దేశమంతా క్రికెట్ ప్రేమికులు ప్రశంసల్ని పొందుతున్నారు… కోచ్ వరుణ్‌ను కూడా మెచ్చుకుంటున్నారు… వోకే, కానీ హైదరాబాద్ టీమ్‌లోని ఇతర బౌలర్లకు ఇదే కోచ్ ఎందుకు పదును పెట్టలేకపోయాడు..? అంతేకాదు…
పవర్ ప్లేలో నిప్పులు కురిపించి, జస్ట్ 9 పరుగులకే 5 వికెట్లు కూల్చిన ఈ ఇద్దరూ ప్లస్ ఇతర బౌలర్లు… రవీంద్ర జడేజా, ఫెరెరా భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయడానికి నానా అవస్థలూ పడ్డారు… సో, నిన్నటి రోజు ఈ బౌలర్లకు అనుకూలించింది… పిచ్ సహకరించింది… ఇదే ప్రదర్శన ఇకపైనా ఉండాలని ఆశిద్దాం, వేచి చూద్దాం… కన్సిస్టెన్స్ ముఖ్యం…
వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్ తదితర సీనియర్ బౌలర్లు గతంలో చూపిన ప్రదర్శన ఇప్పుడు లేదు… కారణాలు అనేకం… ఇదుగో ఇలాంటి కొత్తతరం బౌలర్లు దూసుకొస్తే ఫస్ట్ ఎగిరిపోయేవి అలాంటి సీనియర్ బౌలర్లే… అన్ని జట్లలోనూ ఓసారి సావధానంగా పరికిస్తే… రిజర్వ్ బెంచీలపై కూర్చున్న ఒక ప్రఫుల్, ఒక సాాకిబ్ కనిపించకుండా పోరు..!!
(ఫస్ట్ బంతికే వైభవ్ టికెట్ తీస్తానని ప్రఫుల్ ప్రతిజ్ఞ చేసినా… క్రిస్ గేల్ రికార్డును తుడిపేస్తానని వైభవ్ వీరంగం వేసినా… కుర్ర చాపల్యం… తమనుతామే మోటివేట్ చేసుకునే ప్రయత్నం…)
Share this Article