Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మోనోపలీ (monopoly) అంటే తెలుసు… డుయోపలీ (duopoly) తెలుసా మీకు !?

September 2, 2026 by M S R

.

రిలయెన్స్ ముఖేష్ అంబానీ, జీ గ్రూప్ సుభాష్ చంద్ర తగాదా వింటుంటే, చదువుతుంటే… సరే, కార్పొరేట్ వార్, ఎగవేతలు, అక్రమాల మాటెలా ఉన్నా… ఇద్దరి నడుమ లొల్లి ఇంకొన్ని విషయాలను స్ఫురణకు తెస్తోంది… అది మీడియా, ఎంటర్‌టెయిన్‌మెంట్ వార్…

సుభాష్ చంద్ర అక్రమాలపై రిలయెన్స్ మీడియా విస్తారంగా కథనాలను ప్రచారంలోకి, ప్రసారంలోకి తెస్తుంటే… అంబానీ, బీకేర్ ఫుల్, నీ ఇంటి బీరువాల్లోనూ స్కెలిటన్లున్నాయి అని ఝలక్ ఇచ్చాడు సుభాష్ చంద్ర… ఎవరూ తక్కువ కాదు కదా, ప్రజాధనం స్వాహాలో… సామ్రాజ్యాల నిర్మాణాల్లో…

Ads

కాస్త డిఫరెంట్ కోణంలోకి వెళ్దాం, వాళ్లతోపాటు మరికొందరిని పరిశీలిస్తూ… మనోపలీ (monopoly) అంటే గుత్తాధిపత్యం… ఒక ఒక్కడు టైపు… ఇది ఏ రంగంలోనూ మంచిది కాదని అంటారు… కానీ ప్రతి కంపెనీ, ప్రతివాడూ మోనోపలీ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు…

నిజానికి టీవీ రంగంలో ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం శుద్ధ దండుగ… టీవీ ప్లస్ ఓటీటీ కంబైన్డ్ యవ్వారం అయితే తప్ప, అదీ లార్జ్ స్కేల్ అయితే తప్ప గెటాన్ కాలేరు… అదీ రిస్క్, పెద్ద టాస్క్… ఈ చార్ట్ చూడండి…

z vs star

ఈ టీఆర్పీలు పెద్ద బోగస్ యవ్వారం… ప్రకటనకర్తలు ఓటీటీలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వైపు వేగంగా వెళ్లిపోతున్నారు… టీవీల వ్యూయర్‌షిప్ దారుణంగా పడిపోతోంది… ఇక్కడే duopoly అనే పదం గురించి చెప్పుకోవాలి… అంటే, ద్వంద్వాధిపత్యం… అంటే, ఇద్దరే… మూడో వాడు ఉండొద్దు… ఐతే నువ్వు, లేకపోతే నేనే… దట్సాల్…

హిందీ టీవీ, న్యూస్, వినోద రంగంలో ఇదే పోటీ… హాట్‌స్టార్ vs జీ గ్రూపు… పైన చెప్పుకున్న వైరమూ అందులో నుంచి పుట్టిందే… ఇంకో ట్విస్టు… పూర్తి ద్వంద్వాధిపత్యం కాదు… 2.5 … అంటే నడుమ ఒక న్నర రెండో స్థానం లేదా ఒకటో స్థానం కోసం విశ్వప్రయత్నం చేస్తూ ఉంటాడు… ఇక్కడ ఆ న్నర ఎవరంటే, సోనీ గ్రూప్…

జీ గ్రూపుకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి  కదా, సోనీ వాడు సెకండ్ ప్లేసు కోసం ప్రయాపడి దూరుతున్నాడు…  ఇంకా సరళంగా చెప్పాలంటే… తెలుగు వినోద చానెళ్లు జెమిని తీసేస్తే మూడు… అందులో స్టార్ మా దేశంలోనే నంబర్ వన్… పోటీ ఇచ్చేది జీ తెలుగు… అంతే, ఈటీవీ ఉండీలేనట్లు న్నర బ్యాచ్…

సేమ్.., ఈనాడు, సాక్షి టాప్ 2 ప్లేసులు, న్నర ఎవరంటే ఆంధ్రజ్యోతి… మిగతావన్నీ జుజుబీ… లైట్… న్యూస్ చానెళ్లలో టీవీ9, ఎన్టీవీ… న్నర ఎవరు..? టీవీ5 కావచ్చు బహుశా… మిగతావి జుజుబీ… ఇంకో చార్ట్ ఇస్తాను…

duopolli

టెలికాంలో జియో, ఎయిర్‌టెల్… నడుమ న్నర ఎవరు..? బీఎస్ఎన్ఎల్… అది ప్రభుత్వరంగం కాబట్టి, సర్వీస్ బాగుండదు కాబట్టి, ఎవడూ పనిచేయడు కాబట్టి… అదంతే, ఇక ఎదగదు… డిజిటల్ పేమెంట్స్‌లో ఫోన్ పే, గూగుల్ పే… అంతే… సేమ్, రైడ్ హైరింగ్‌లో ఊబర్, ఓలా… న్నర గాళ్లూ ఎవరూ లేరు… డీటీహెచ్‌లో టాటా ప్లే, ఎయిర్ టెల్… మూడో పోటీదారే కనిపించడు…

సేమ్, ఫుడ్ డెలివరీ… జొమాటో, స్విగ్గీ, మూడోవాడు లేడు… ఇదంతా డ్యుయోపలీ… చివరకు విమాన సర్వీసుల్లో కూడా ఎయిర్ ఇండియా, ఇండిగో… ఓటీటీల్లో ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్… రాజకీయాలు అంటారా..? సేమ్… బీజేపీ, కాంగ్రెస్… మరో జాతీయ పార్టీ ఏది..? కనీసం న్నర పార్టీలు కూడా లేవు… అంతా డ్యుయోపలీ… !!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దిక్కుమాలిన సంత – యాణ్నుంచి పట్టుకొచ్చార్రా వీళ్లను ?
  • ఆ సంధ్య థియేటరే దేనికి..? సొంత హైటెక్ థియేటర్లు ఉన్నాయిగా..!!
  • నాని పైత్యం ! పెంటపెంట… జవహర్‌నగర్ డంపింగ్ యార్డు దుర్వాసన !!
  • ఒవైసీ చెప్పిన ఈ పేరు వెనుక ఓ చరిత్ర’… అసలెవరు ఈ ‘మౌల్వీ?
  • బిడ్డ బాలీవుడ్ స్టార్ ! తల్లి ఓ తమిళపల్లెవాసి ! ఇదీ అసలు సౌందర్యం !!
  • చిన్న సినిమా అంటే చిన్నతనం కాదు… చిల్లరతనం అసలే కాదమ్మా…
  • హీరో నాని ఓ వెర్రి ట్వీట్ ! ప్రజాప్రభుత్వమా ఇక సాగిలబడు ఓ నటుడి ఎదుట !!
  • చచ్చీ చెడీ… చావు దప్పి… ఓ అవమానకరమైన విజయం…
  • ఓసారి ఓ కుర్ర జర్నలిస్టు అక్కినేనికి ఓ చికాకు ప్రశ్న వేశాడు..!
  • లిక్కర్ స్కాంలో జగన్‌ను లోపలేస్తారా..? ఏపీ పాలిటిక్స్‌లో చర్చ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions