Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ జెండాలు స్పష్టంగానే కుట్ర హెచ్చరికల్ని జారీ చేస్తున్నయ్!!

October 14, 2026 by M S R

.

Pardha Saradhi Potluri … ఉద్దేశ్యం ఏమిటో స్పష్టంగా చెప్పబడుతున్నది కానీ అందరికీ అది అర్ధం కాదు… కానీ చాలా చరిత్ర దాగి ఉంది నిగూఢoగా!
నేను చెప్పబోతున్నది నేహా బోరా వేసుకున్న T షర్ట్, దాని మీద ప్రింట్ చేసిన కపాలం బొమ్మ గురుంచి!

సముద్రపు దొంగలు ( Pirates )… జోలీ రోగర్ ( Jolly Roger ) అనేది సముద్రపు దొంగల జెండా! 18 వ శతాబ్దంని సముద్రపు దొంగల గోల్డెన్ ఎరా ( Golden age of Piracy ) అని పిలుస్తారు. ముఖ్యంగా 1650 నుండి 1730 వరకూ ఈ గోల్డెన్ ఏజ్ ని పేర్కొంటారు. ఈ సముద్రపు దొంగల పడవల మీద ఉండే జెండాలని బట్టి అర్ధాలు మారుతాయి.

Ads

1.Classic design: నలుపు రంగు జెండా మీద పుర్రె ఉంటుంది, పుర్రె కింద క్రాస్ గా రెండు ఎముకలు ఉంటాయి. దీని అర్ధం ఏమిటంటే ఈ సముద్రపు దొంగలు ఏ వాణిజ్య లేదా ప్రయాణికుల నౌకని దోచుకోవడానికి చుట్టుముట్టుతారో ఆ నౌకలోని కెప్టెన్ కి సూచన అన్నమాట… అంటే మర్యాదగా లొంగిపోతే నౌక కెప్టెన్ తో పాటు ఇతర ప్రయాణికులని చంపము, కేవలం దోచుకొని వెళ్ళిపోతామని అర్ధం. నౌకని అందులోని వాళ్ళని దోచుకొని వదిలేస్తారు.

2.Red Flag (“No Quarter ”): రెడ్ ఫ్లాగ్ మీద పుర్రె, ఎముకల గుర్తు ఉంటుంది. దీని అర్ధం ఏమిటంటే నౌకని స్వాధీనం చేసుకుంటాము, ఎదురు తిరిగితే చంపి సముద్రంలో పడేస్తాము. రెడ్ ఫ్లాగ్ అర్ధం జాలి, దయ అనేవి ఉండవు.

3. సముద్రపు దొంగలు వాళ్ళు వాడే పడవలు, వాటి మీద ఉండే జెండాలు వాటి అర్ధాల గురుంచి 1724 లో చార్లెస్ జాన్సన్ ( Charles Johnson ) అనే రచయిత తన పుస్తకం ‘ A General History of Pyrates ’ లో వివరంగా వ్రాశాడు.

4. జోలీ రోగ్ ( Jolly Rogue ) అనేది ఫ్రెంచ్ పదం అయిన ‘Joli Rouge ’ (“Pretty Red ”) నుండి వచ్చింది.

cjp

కొత్త తరం జెండాలు: 20 వ శతాబ్దంలో బ్రిటిష్ రాయల్ నావీకి చెందిన సబ్ మెరైన్లు యుద్ధ సమయంలో శత్రు సబ్ మెరైన్లు తమ ప్రాదేశిక జలాలలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నందుకు గుర్తుగా జోలీ రోగర్ ని తమ సబ్ మెరైన్ల మీద ఎగురవేసేవి.

పాప్ కల్చర్: పాప్ కల్చర్ లో కూడా రోగర్ ఫ్లాగ్స్ ని వాడుతున్నారు కానీ అవి కొంచెం భిన్నంగా ఉంటాయి.
తిరుగుబాటు: తిరుగుబాటు కోసం వన్ పీస్ స్ట్రా హాట్ రోగర్ ఫ్లాగ్ ని వాడుతున్నారు కాకపొతే పుర్రెకి ఆరెంజ్ కలర్ టోపీ ఉంటుంది, ఎముకలు పుర్రె వెనుక భాగంలో ఉంటాయి.

  • నేహా బోరా వేసుకున్న T షర్ట్ మీద one piece straw hat గుర్తు ఉంది.
    ఫోటోలకి ఫోజులిస్తూ నేహా బోరా దిగిన ఫోటో గురుంచి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ “ మేము ఎవ్వరినీ లెక్క చేయము ” అనే అర్ధంలోనే వన్ పీస్ స్ట్రా హాట్ సూచిస్తుంది.

న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ వ్యవస్థలని లెక్క చేయము అని పరోక్షంగా చెప్తున్నారు… బ్లాక్ జెండా మీద పుర్రె గుర్తు, కింద రెండు ఎముకలు ఉన్న గుర్తు ఉంటే టార్గెట్ లొంగిపోవాల్సిందే అని గతంలో జరిగినట్లు ఇప్పుడు కూడా జరుగుతుంది అని అర్ధం వచ్చేలా హెచ్చరిస్తున్నారు!

వన్ పీస్ స్ట్రా హాట్ లో రెడ్ లేదా ఆరెంజ్ టోపీ పెట్టడం వెనుక గతంలో రెడ్ ఫ్లాగ్ తో పైరేట్స్ చుట్టముట్టినట్లుగా అంటే నౌకని ( ప్రభుత్వాన్ని ) వదిలేసి పారిపోతే బ్రతికి ఉంటారు అనే అర్ధంలో వాడుతున్నారు!

సముద్రంలో ప్రయాణించే పెద్ద నౌకలు వేగంగా వెళ్ళలేవు. సముద్రపు దొంగల చిన్న పడవలతో పోలిస్తే. కాబట్టి చుట్టు ముట్టిన చిన్న పడవలలో ఉండే దొంగలకు భయపడేవాళ్ళు పెద్ద నౌకలో ఉండేవాళ్ళు! పైగా మహిళలు, చిన్న పిల్లలు ఉండేవాళ్ళు కాబట్టి భయం ఉండేది.

ఇప్పుడు ప్రభుత్వాలకి శాంతి భద్రతలు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి పెద్ద నౌకలలో ఉండే మహిళలు, చిన్న పిల్లల తరహాలో.
హింస చెలరేగేలా రెచ్చగొట్టి కాల్పులు జరిపేలా చేసి సమస్య పెద్దది అని అనిపించేలా చేయడమే అసలు లక్ష్యం. అందుకే విద్యార్థుల మీద కేసులు ఎత్తివేసింది!

పానిక్ అనేది ఒక్కసారిగా భారీగా వచ్చేట్లు చేయడం అనేది సోషల్ మీడియాతో చేస్తారు.
టీవీ 5 మూర్తి పిచ్చిపట్టినట్లుగా మాట్లాడడం అనేది కర్టైన్ రైజర్! డబ్బు చేతులు మారుతున్నది అంతా నగదు రూపంలోనే కాబట్టి ఎవరికి ఎప్పుడు ఎంత ముట్టింది అనేది తెలుసుకోవడం కష్టం!

శ్రీలంక, నేపాల్, బాంగ్లాదేశ్ లలో ఇలానే జరిగింది! ఇప్పుడు ఇండోనేషియా, భారత్ లలో వన్ పీస్ స్ట్రా హాట్ ని ప్రదర్శిస్తున్నారు.
ఈ వన్ పీస్ స్ట్రా హాట్ అనేది జపాన్ యానిమేషన్ నుండి తీసుకొని వాడుతున్నారు అంటే అది బెదిరింపు కాదు కేవలం యానిమేషన్ కారక్టర్ నుండి తీసుకున్నాము అని వాదించి కోర్టుల నుండి తప్పించుకోవచ్చు!

కేరళ కాంగ్రెస్ ఒక ట్వీట్ చేసింది..‘కేసులు త్వరగా పరిష్కరించలేకపోతె తప్పుకోండి ’ అంటూ సుప్రీం కోర్టుని ఉద్దేశించి చేసింది. రాజ్యసభ సభ్యుడు, సుప్రీం కోర్ట్ అడ్వకెట్ అభిషేక్ మను సింగ్వి కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ తో మాట్లాడి ఆ ట్వీట్ డిలీట్ చేయించాడు.

రాజ్యాంగ వ్యవస్థలో భాగం అయిన ఎలక్షన్ కమిషన్, న్యాయవ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగంని లెక్కచేయకపోవడం అనేది ఇప్పటికే మొదలుపెట్టేశారు!
బహుశా సైన్యం రంగంలోకి దిగవచ్చు ముందు ముందు!

సమస్య పెద్దది చేయాలంటే అభిజిత్ చిప్కేను వాళ్ళే హత్య చేసి ఆ నేరాన్ని ప్రభుత్వం మీదకి నెట్టి దేశవ్యాప్తంగా హింస చెలరేగేలా చేసే అవకాశం ఉంది!

2027 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చేలోపు ఏదో ఒకటి చేస్తారు!
అజిత్ దోవల్ గారిని టార్గెట్ చేసే అవకాశం ఉందని గతంలోనే నా పోస్టులో చెప్పాను ఇప్పుడు అదే జరుగుతున్నది!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ జెండాలు స్పష్టంగానే కుట్ర హెచ్చరికల్ని జారీ చేస్తున్నయ్!!
  • పొలిటికల్ రిపోర్టింగ్ ఎన్నో జీవితసత్యాల్ని ‘అక్షరాలా’ కళ్లకుగట్టింది !!
  • 40 ఏళ్ల కిందటే ఉమ్మడి పౌరస్మృతి, విదేశీ నిధులు, మతమార్పిడిపై చర్చ!
  • ఇది సొంత గడీ కాదు సార్… బాత్రూం రిపేర్లకు కోటి రూపాయలా..?!
  • అర్ధరాత్రి- అందరూ నిశ్శబ్దం- గుప్త తాంత్రిక పూజ- ఎక్కడంటే?
  • మహిళలకు ప్రత్యేకంగా వేరే శబరిమల..? నిజమేంటో చెప్పుకుందాం..!!
  • ఓ వెధవ ట్రోలర్‌కు వేణుస్వామి భార్య వీణశ్రీవాణి పర్‌ఫెక్ట్ కౌంటర్ !!
  • CJP – కూలీ ఇచ్చి మరీ తన్నించుకున్నట్టు అయిపోయింది !!
  • రైతు డిస్కమ్‌పై బీఆర్ఎస్ వక్రబాష్యాలు – పసలేని విమర్శలు
  • అసలే గతితప్పిన సంసారి… పైగా సమాజానికి బోడి ఉచిత సలహాలు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions