అకస్మాత్తుగా సోషల్ మీడియాలో మాళవిక హెగ్డే గురించి పుంఖానుపుంఖాలుగా కథనాలు కనిపిస్తున్నాయి… మెయిన్ స్ట్రీమ్ పత్రికల అనుబంధ సైట్లు కూడా హఠాత్తుగా ఈ కథనాలను అందుకున్నయ్… విషయం ఏమిటయ్యా అంటే…? ‘‘కేఫ్ కాఫీడే వ్యవస్థాపకుడు, తన భర్త వీజీ సిద్ధార్థ్ ఆత్మహత్య చేసుకున్నాక ఆమె ఆ బాధను తట్టుకుంటూనే ధైర్యంగా నిలబడింది… జీవితంతో పోరాడటానికే నిశ్చయించుకుంది… 7 వేల కోట్ల బ్యాంకు రుణాలను ఏడాదిలో 3 వేల కోట్లకు తీసుకొచ్చింది… తను నిలబడింది, కంపెనీని నిలబెట్టింది, వేల మంది ఉద్యోగులను నిలబెట్టుకుంది… గ్రేట్ సక్సెస్ స్టోరీ…’’ స్థూలంగా ఆ వార్తలు, పోస్టుల సారాంశం అదే… నిజానికి ఇది చాలా పాత కథనం… మనం ‘ముచ్చట’లో ఏడాది క్రితం ఆమె గురించి రాసిన కథనం లింక్ ఇదుగో… మరోసారి చదవండి…
వేల కోట్ల ధనిక స్త్రీలు ఉండొచ్చుగాక..! అందరూ చూస్తున్నది ఈమె వైపే..!!
నిజానికి ఆమె తన అప్పుల్ని సగానికి తగ్గించాక… కంపెనీ ఓ గాడిన పడ్డాక కూడా కథ ముగియలేదు… సాగుతూనే ఉంది… నిజానికి మాళవిక ఎలా ఈ తీవ్ర ఒత్తిడిని తట్టుకుని నిలబడింది అనేదే కాదు, ఆమెకు అండగా నిలబడిన వాళ్లెవరనేది కూడా కథే… బ్యాంకర్ల ఒత్తిడి, ఐటీ అధికారుల కుట్రలు, తాచుపాముల్లా దెబ్బతీయడానికి కాచుకున్న ప్రత్యర్థులు, భర్త మరణంతో తనకు వ్యక్తిగతంగా జరిగిన నష్టం, వేల మంది ఉద్యోగులు… ఇన్ని సవాళ్ల నడుమ ఆమెకు అండగా నిలబడింది భర్త స్నేహితుడు, కర్నాటక రాజకీయాల్లో అత్యంత కీలకనాయకుడు డీకేశివకుమార్, అలాగే మాజీ ముఖ్యమంత్రి, ఆమె తండ్రి ఎస్ఎంకృష్ణ… ప్రత్యేకించి డీకే గురించే చెప్పుకోవాలి… సిద్ధార్థ బతికి ఉన్నప్పుడే డీకే బిడ్డను సిద్ధార్థ కొడుక్కి ఇవ్వాలని అనుకున్నారు… సిద్ధార్థ మరణం తరువాత డీకే మొహం చాటేయలేదు… తన మాటకు కూడా కట్టుబడ్డాడు… ఆ పెళ్లి జరిగింది… ఆ వివరాల ‘ముచ్చట’ లింక్ ఇదుగో…
Ads
ఐశ్వర్యమస్తు..! ఈ పెళ్లికి ఈ దీవెనే కరెక్టు… ఎందుకో చదవండి…!!
వ్యాపార వ్యవహారాల్లో డీకే సపోర్ట్, అందివచ్చిన కొడుకు-కోడలు… బండి సజావుగా సాగుతోంది… కానీ ఆమె మొత్తం రుణాల్ని తీర్చేసిందా..? కంపెనీని రుణరహితం చేసిందా..? ఏడాదిగా మళ్లీ ఏ వార్త కనిపించలేదు… నిజానికి చెప్పుకోవాల్సింది వేరే కథ… ఆమెకు అన్యాయం చేసింది బీజేపీ… ఆశ్చర్యంగా ఉందా..? సూటిగా, సంక్షిప్తంగా చెప్పుకుందాం… గుజరాత్ రాజ్యసభ ఎన్నికలు… సోనియా కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలక వ్యక్తి అహ్మద్ పటేల్… తనను రాజ్యసభకు రాకుండా చేయాలని బీజేపీ ప్రయత్నం… దాంతో గుజరాత్ నుంచి 44 మంది ఎమ్మెల్యేలను కర్నాటకకు తరలించి క్యాంప్ పెట్టేశారు… అదంతా ఆర్గనైజ్ చేసింది డీకే… దీంతో బీజేపీ కుతకుత ఉడికిపోయింది…
బీజేపీకి తెలిసిన విద్య ఏమిటి..? ఐటీ, ఈడీ, సీబీఐ గట్రా సంస్థల్ని రాజకీయ ప్రత్యర్థుల మీదకు ఉసిగొల్పడమే కదా… ఇంకేముంది..? డీకే ఆస్తుల మీద భారీ ఎత్తున దాడులు సాగాయి… డీకే, సిద్ధార్థ స్నేహితులే కదా… ఆర్థిక లావాదేవీలు గట్రా కామన్… సో, ఈ దాడుల ప్రభావం సిద్ధార్థ మీదకు కూడా మళ్లింది… ‘ఒత్తడం’ ప్రారంభించారు… సాక్షాత్తూ సిద్ధార్థే తన సూసైడ్ నోట్‌లో ఐటీడీజీ తనను ఎలా టార్గెట్ చేసి, సఫర్ చేశాడో రాసుకున్నాడు… బ్యాంకులు రుణాల చెల్లింపుకై ఒత్తిళ్లు ప్రారంభించాయి… మైండ్ ట్రీ వంటి కంపెనీల్లో తనకున్న షేర్లు అమ్మి, ఆస్తులు అమ్మి, కాఫీడే రుణాలు తీర్చేయాలని సిద్ధార్థ ప్రయత్నించాడు… కానీ ఐటీ ఏ రేంజ్ కక్షసాధింపుకి వెళ్లిందంటే, సిద్ధార్థ షేర్లను, ఆస్తులను కూడా అటాచ్ చేయసాగింది…
ఈ స్థితిలో మెంటల్‌గా సిద్ధార్థ డౌనయిపోయాడు… ఓ బలహీన క్షణంలో సూసైడ్ చేసుకున్నాడు… అదుగో అలా మాళవిక అన్యాయమైపోయింది… వేల మంది ఉద్యోగుల కుటుంబాలు బజార్న పడే ప్రమాదం ఎదురైంది… అఫ్‌కోర్స్, అవన్నీ ఆలోచిస్తే దాన్ని బీజేపీ అనరు కదా… అన్నట్టు, మరో విషయం… తన అల్లుడి కోసమే ఎస్ఎంకృష్ణ బీజేపీలో చేరాడనీ అంటారు… ఐతేనేం, ఆ కుటుంబానికి డీకే శివకుమార్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా బీజేపీ ఎస్ఎంకృష్ణను లైట్ తీసుకుంది… సో, బీజేపీ రాజకీయ ప్రేరేపిత, కక్షసాధింపు ఐటీ దాడులు, వేధింపుల ప్రస్తావన లేకుండా మాళవిక హెగ్డే సక్సెస్ స్టోరీ చెప్పలేం… చెప్పకూడదు…!!
Share this Article