.
తాతా మధు… ఇప్పుడు వార్తల్లో వ్యక్తి… చాలామందికి తనెవరో తెలియదు… తను ఎమ్మెల్సీ… అసెంబ్లీ స్పీకర్‌ను బజారు భాషలో దూషించిన నాయకుడు… ఇంత రచ్చ, ఇంత గొడవ జరుగుతున్నా వీసమెత్తు పశ్చాత్తాపం లేదు తనలో…
పైగా నేను స్పీకర్‌ను ఏమీ అనలేదు, నేను అనని మాటల్ని నాకు ఆపాదిస్తున్నారు అని తెగబడి సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు… కానీ ఎందుకైనా మంచిదని మళ్లీ తనే ‘స్పీకర్‌నే అన్నట్టుగా భావిస్తే నా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను’ అంటున్నాడు…
Ads
అటూఇటూ కాని ధోరణి… అచ్చం కేసీయార్ తరహాలోనే! బూతులు మాట్లాడే అసెంబ్లీకి నేనెందుకొస్తా, రానుపో అంటున్నాడు కదా కేసీయార్… ఏదో ఓ విఫల సాకు… ఎవరిది బూతుల కల్చరో తనే అనుచరుడే ఎంచక్కా బయటపెట్టేశాడు… సేమ్, యథా చీఫూ తథా స్టాఫూ కదా… సేమ్ కేసీయార్, సేమ్ మధు… కేసీయార్‌కు తాత !!
మిత్రుడు Gurram Seetaramulu సోషల్ పోస్టు ఓసారి చూద్దాం… ‘‘ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటే పాలన, గౌరవం, విలువలు అర్ధం అవుతాయి. మేనేజ్మెంట్ కోటాలో పదవి కొనుక్కుని చట్ట సభలకు వస్తే ఎవరి భాషయినా ఇలానే ఉంటది. స్పీకర్‌ను పట్టుకుని వాడు, వీడు, అంతిమంగా లం.. కొడుకు అనే అనగలడు .
ఆయన పుట్టింది మా అమ్మ పుట్టింది ఒకే వూరు, ఖమ్మం జిల్లా పిండిప్రోలు. ఆ వూరు కమ్యూనిస్ట్ పార్టీ హైదరాబాద్ స్టేట్ మొదటి కార్యదర్శి సర్వదేవ భట్ల రామనాధంను కన్న వూరు…
నూట పదమూడేళ్ళ కింద పుట్టిన తొలి తరపు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు . త్యాగానికి నిలువెత్తు చిరునామా. మా అమ్మమ్మ తరం వాళ్ళది . తన కుటుంబానికి చెందిన మొత్తం ఏడు వేలు, తన వాటాగా వచ్చిన పద్దెనిమిది వందల ఎకరాల స్వంత భూమిని ప్రజలకు పంచి కడు బీదరికంలో అంతిమ దినాలు గడిపిన మహనీయుడు .
ఆ వూరిలో పుట్టిన తాత మధు ఒకనాడు స్టూడెంట్ ఫెడరేషన్ మనిషి. మహా సంస్కారమైన తానాకు అధ్యక్షుడు. ఆయన ఒకనాడు సిపిఎం తర్వాత ప్రజారాజ్యం, ఇప్పుడు బిఆర్‌యెస్ . (1998 నుండి 2014 మధ్యకాలంలో అట్లాంటా తెలుగు సంఘం (తామా – TAMA) అధ్యక్షుడు, అలాగే తానా (TANA) కార్యదర్శి).
ఆయన ఉన్న ఎర్రజెండా పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రజాబలం కోల్పోయి అంతిమంగా అటవిక వేట కొడవళ్ళను నమ్ముకున్నా ఫలితం లేదు. ప్రజలే వాళ్ళ అహంకారాన్ని తుదమట్టానికి నరికేశారు .
అటువంటి మనిషి తన పుట్టుక సంస్కారమో, పెరిగి నడిచిన తొవ్వ చూపిన, ఇప్పుడు నడుస్తున్న రాజకీయమో గానీ ఒక దళిత స్పీకర్‌ను పట్టుకుని లంజ- కొడుకు అన్నాడు. నా fb రాతల్లో బూతును మాత్రమే చూసే వెతికే ఒకావిడ ఉండేది. ఇప్పుడు చట్టసభలో ఇదే చర్చలో బహుశా నిద్రపోతూ ఉండవచ్చు’’
Share this Article