.
చాన్నాళ్ల క్రితం… వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్లకు… ప్రభుత్వం ఓ కొత్త ప్రతిపాదనను ఆలోచించింది, చర్చించింది.,. అదేమిటంటే..? సర్జరీని విడదీసి, కేవలం మెడికల్ డిగ్రీ కోర్స్ ప్రవేశపెట్టాలని! దీనివల్ల ప్రాథమిక చికిత్స, అంటువ్యాధుల నివారణ, చిన్నాచితకా రోగాలకు చికిత్స, వ్యాధి నిర్దరణ, చెకప్స్ అంశాల్లో నిపుణులు వస్తారు…
పీఎంపీలు, ఆర్ఎంపీలు, ఫేక్ డాక్టర్ల బెడద పూర్తిగా తొలగిపోవడమే గాకుండా… గ్రామీణ ప్రాంతాల్లో శాస్త్రీయ వైద్యం, అన్నింటికీ మించి సరైన వైద్యసలహాలు లభిస్తాయనేది దాని ఉద్దేశం… నిజంగా సరైన దిశలో సాగిన ఆలోచన… ఇప్పుడు దిక్కుమాలిన డిగ్రీలు చేసి ఎటూగాకుండా పోతున్న తరానికి, ఓ శాస్త్రీయ పంథా చూపినట్లు, సమాజానికి ఓ ఉపయుక్తత సమకూర్చినట్టు అయ్యేది…
Ads
పైల్స్, అబార్షన్లు, కేటరాక్ట్ తదితర ఆపరేషన్లను ఎడాపెడా కంపౌండర్లు, నర్సులే చేసి పారేస్తున్నారు ఇప్పుడు… కార్పొరేట్ హాస్పిటల్స్‌కు బ్రోకర్లుగా పనిచేస్తున్నారు… మరెందుకు ఈ ప్రతిపాదన అమల్లోకి రాలేదు..? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంగీకరించలేదు… ఈ అపెక్స్ బాడీ ఎంత అశాస్త్రీయ లోతుల్లో ఉందంటే..?
ఎంబీబీఎస్, బీడీఎస్, ఫిజియోథెరపీ, బీఫార్మా… ఇవేనా..? ఆప్టోమెట్రీ, నర్సింగ్ వంటి అనుబంధ మామూలు డిగ్రీలు అదనం… ఇవే ప్రస్తుతం మెడికల్ కోర్సులు… డెంటల్‌కు సపరేట్ కోర్సు, మరి ఆప్తమాలజీకి, సాంక్రామిక వ్యాధులకు, డయాగ్నయిజ్, ప్రాథమిక చికిత్సలకు ఎందుకు లేవు..? డెంటల్ అంత ప్రాధాన్యాంశమా..? ఈఎన్టీ, చెస్ట్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, వైరాలజీ, గైనిక్, న్యూట్రిషన్, వేక్సినేషన్, హెల్త్ చెకప్స్, సైకియాట్రీ ఎన్ని లేవు..,? కానీ ఎందుకు లేవు..? సో, అసలు సమస్య నీట్‌లో కాదు… టోటల్ వైద్య వ్యవస్థలోనే ఉంది… (ఈరోజు గ్రామీణ, పట్టణ మహిళలకు కూడా కావల్సింది న్యూట్రిషన్, గైనిక్ గైడెన్స్…)
చివరకు ఇక్కడ సీట్లు దొరక్క చైనా, పాత రష్యా దేశాలు, తూర్పు దేశాలకు వెళ్లి, లక్షలు వెచ్చించి ఆరేళ్లు చదువకుని వస్తే… ఎంఎస్, ఎండీ కోర్సుల స్థాయిలో క్వశ్చన్లతో అర్హత పరీక్ష పెట్టి, వాళ్లు ఫీల్డులోకి రాకుండా చేస్తున్నారు… అది మరో దరిద్రం… వాళ్లు చదువుకున్నది మెడిసినేరా బాబూ అన్నా ఎవడూ వినేవాడు లేడు…
ఓ మెడికల్ కాలేజీ పెట్టాలంటే… హాస్పిటళ్లు, పడకలు, స్టాఫ్, నిపుణులు, బోధన సిబ్బంది… వందల కోట్ల ఖర్చు… అదంతా వాడు సీట్లు అమ్ముకుని సంపాదిస్తాడు… ఇక సామాన్యుడికి, మధ్యతరగతికి మెడిసిన్ కల నెరవేరేదెలా..? ఆ వైద్య జ్ఞానం సమాజానికి అక్కరకొచ్చేది ఎలా..? కాంగ్రెస్‌ను వదిలేయండి కాసేపు, తెల్లారి లేస్తే లక్ష సుద్దులు చెప్పే మోదీ 13 ఏళ్లలో ఏం ఆలోచించినట్టు..?
నిష్ఠురంగా ఉన్నా ఇవీ నిజాలు… రెండు దశాబ్దాల కాలం తీసుకొండి… ఐటీ సీట్ల సంఖ్య పెరుగుదలతో పోలిస్తే మెడికల్ సీట్ల పెరుగుదల దాదాపు శూన్యం… ఊళ్లల్లో, పట్టణ పేదల్లో పెరుగుతున్న ఆత్మహత్యలకు అనేక కారణాల్లో అప్పులు కూడా ఒకటి… ఆ అప్పుల ప్రధాన కారణాల్లో వైద్యం ఒకటి… కార్పొరేట్ దోపిడీ… డ్రగ్స్ దోపిడీ… ఇది తగ్గాలంటే విస్తృతంగా వైద్యం, అదీ శాస్త్రీయ వైద్యం పల్లెను చేరాలి… అది తప్ప మన ప్రభుత్వాలు అన్నీ చేస్తుంటాయి… అదీ అసలైన విషాదం!!
వైద్యంలోకి రోబోలు వస్తున్నాయి, టెలి మెడిసిన్, బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ, మెడిసిన్ టు హోమ్, ఎఐ ఇన్ మెడిసిన్ వంటి అనేక కొత్త అంశాలు ప్రాచుర్యం పొందుతున్నాయి… ఏదీ, మన భావి తరాలను అటు వైపు నడిపించే నాయకత్వం?! ఇదంతా నాలాంటి పామరుడిలో ఉన్న సందేహాల పరంపర… నిజంగా ఆ ఫీల్డులో పనిచేసేవాళ్లు ఇంకెన్ని చెప్పగలరో..!! ( Subject to Corrections )
Share this Article