Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే… కేసీయార్ మరో బిగ్ బ్లండర్…

September 25, 2026 by M S R

.

ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే… తెలంగాణకు కరెంటు విషయంలో ద్రోహం చేసిందేమో కేసీయార్… ఉల్టా ఇప్పటి ప్రభుత్వానిదే తప్పు అంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయిస్తున్నాడు… కొన్ని నిజాలు మాట్లాడుకుందాం ఓసారి…

తెలంగాణను రెండుమూడు కోణాల్లో కేసీయార్ పదేళ్ల వెనక్కి తీసుకుపోయాడు… కాళేశ్వరం దగ్గర నుంచి మొదలుపెట్టి పాపాలపుట్ట పగిలి అనేక దారుణాలు బయటపడుతున్నాయి… ఎలాంటి పాలకుడు ఉండకూడదో ఓ ఉదాహరణగా మిగిలిపోయాడు… బోలెడు దృష్టాంతాలు…

Ads

తెలంగాణను సాధించిన నాయకుడిగా ఆర్జించుకున్న పేరు, తెలంగాణ సమాజం తనపట్ల చూపిన ఆదరణను తనంతటతానే తన పాలనలో పూర్తిగా చెడగొట్టుకోవడం ఓ పేద్ద ఐరనీ… భూముల కబ్జాల దగ్గర నుంచి ఎడాపెడా ఆర్జన దాకా… కాళేశ్వరం అంటున్నాం గానీ, విద్యుత్తు ప్రాజెక్టులకు సంబంధించి తన ద్రోహం మామూలుది కాదు…

కరెంటు కొనుగోళ్ల కమీషన్లు, చత్తీస్‌గఢ్ కారిడార్ అక్రమాలు పక్కనబెడితే… ఫస్ట్… భద్రాద్రి 1080 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఓ బ్లండర్… ప్లాంటు అభిలషణీయమే కానీ ప్రపంచం మొత్తం వదిలేస్తున్న సబ్ క్రిటికల్ టెక్నాలజీతో కట్టడం బిగ్ బ్లండర్… తెలంగాణను వెనక్కి నడిపించడం అంటారు దీన్నే…

ఈ ప్లాంట్‌లోని నాలుగు యూనిట్లు గతంలోనే పూర్తయి ఉత్పత్తిని ప్రారంభించినప్పటికీ, బొగ్గు కొరత, సాంకేతిక సమస్యలు, నిర్వహణ కారణాల వల్ల అప్పుడప్పుడు కొన్ని యూనిట్లు షట్ డౌన్ కావడం కామన్ అయిపోయింది… అదీ దురవస్థ…

అన్నింటికన్నా మించిన బ్లండర్ యాదాద్రి పవర్ ప్లాంటు… తను ఓ సాగునీటి ఇంజినీర్ అయిపోయి కట్టిన కాళేశ్వరం కథ చూశాం కదా… తను ఓ పవర్ ఇంజినీర్ అయిపోయి కట్టాలనుకున్న యాదాద్రి కథ కూడా సేమ్ ఓ మేడిగడ్డ… ఎలాగంటే..?

యాదాద్రి ప్లాంటు

ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ ఏమిటంటే..? పిట్ హెడ్ స్టేషన్స్… అంటే ఇంధనం ఉన్న దగ్గరే ప్లాంటు నిర్మించడం… సింగరేణితో బొగ్గు ఒప్పందాలున్నప్పుడు అక్కడే ప్లాంటు కట్టేసి, అక్కడి నుంచి హైపవర్ ట్రాన్స్‌మిషన్ లైన్ల ద్వారా కరెంటును తీసుకుపోతే అది ఉత్తమ చర్య… దానికి పూర్తి భిన్నంగా తిరోగమనం కేసీయార్‌ది… జగమెరుగని పవర్ ఇంజినీర్ కదా…

మొత్తం ప్రతిపాదిత కెపాసిటీ…: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) సామర్థ్యం 4,000 మెగావాట్లు (5 X 800 MW)…

బొగ్గు అవసరం – సింగరేణి పరిస్థితి…: ఈ ప్లాంట్ పూర్తిస్థాయిలో నడవడానికి వార్షికంగా సుమారు 14 మిలియన్ టన్నుల G9 గ్రేడ్ బొగ్గు అవసరం… అయితే సింగరేణి కాలరీస్ (SCCL) వద్ద ఈ నిర్దిష్ట G9 గ్రేడ్ బొగ్గు నిల్వలు లేదా ఉత్పత్తి లేకపోవడం పెద్ద సమస్య…

సింగరేణి వార్షిక జీ9 (ఉత్తమ గ్రేడ్) ఉత్పత్తే ఏటా 4 మిలియన్ టన్నులు… మరి ఏం చూసి సింగరేణితో ఒప్పందం..? ఈమేరకు పవర్ ప్లాంట్ నిర్మాణం ఎలా..? ఏదో మాయ చేసి, మభ్యపెట్టి ప్లాంటు నిర్మాణం మొదలుపెట్టారు… నిర్మాణవ్యయం పెరిగిపోతూనే ఉంది… ఇప్పటికి నాలుగు యూనిట్లు వోకే, అయిదో యూనిట్ కానేలేదు…

ఈలోపు అవసరమైన జీ9 గ్రేడ్ బొగ్గు లభ్యత లేకపోవడంతో రెండు యూనిట్లను షట్ డౌన్ చేస్తున్నారు… ఇదీ మేడిగడ్డ సిట్యుయేషనే… ఈ ఎల్‌నినో కటకటలో ఈ ప్లాంటు ఉపయోగపడాల్సి ఉండగా, తీరా సమయానికి పనికిరాకుండా పోతోంది… సో, నేరం- ద్రోహం కేసీయార్‌ది, పైగా తనే బీఆర్ఎస్ శ్రేణులతో ఆందోళనలు  చేయిస్తున్నాడు… అందుకే చెప్పింది ‘ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే’ అని…

ప్రస్తుత సిట్యుయేషన్…: సింగరేణి బొగ్గు సరిపోదు, మరేం చేయాలి..? మహానది కోల్‌పీల్డ్స్‌ నుంచి తెప్పించాలి… అసలు సింగరేణి బ్లాకుల నుంచి యాదాద్రికే 200 కిలోమీటర్ల దూరం ఉండి బొగ్గు రవాణా ఛార్జీల భారం తడిసిమోపెడవుతోంది… ఇప్పుడిక ఒడిశా నుంచి తెప్పించాలంటే ఇక ఆ కరెంటు ధర ఏ రేంజుకు పెరుగుతుందో అర్థం చేసుకోవల్సిందే… మరోవైపు సింగరేణి స్థితి కూడా సరిగ్గా లేదు, దాన్ని ఆల్రెడీ భ్రష్టుపట్టించారు కదా… కేసీయార్ పాలనలోని నెగెటివ్ చరిత్రలో సింగరేణిది మరో పెద్ద అధ్యాయం… 

SCCL

చివరగా… ప్రస్తుతం దేశంలో 800 అధునాతన 800 కేవీ హెచ్‌వీడీసీ (HVDC) లేదా హై-కెపాసిటీ ట్రాన్స్‌మిషన్ లైన్లు అందుబాటులోకి వస్తున్నాయి… ఈ స్థితిలో గనులున్నచోట ప్లాంట్లు కట్టుకుంటే ఎంత ఆదా అయి ఉండేది… ఈమాత్రం సోయి లేని పాలకుడి వల్ల మేడిగడ్డను మించిన నష్టం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అంతా కాలమహిమ- చంద్రబాబా మహత్తు- ఆ లీలలెన్న తరమా !?
  • ‘యాదాద్రి’పై రేవంత్ రెడ్డి కొరడా ! కేసీయార్ నిర్వాకాలే అసలు తలనొప్పి !!
  • రజినీ ఒక్కడు చాలదా..? మరీ ఇన్ని కామియోలు ఎందుకురా బుజ్జా..!!
  • కట్టి, కూల్చి, మళ్లీ కట్టి… కేసీయార్ మార్క్ ‘ఇంజినీరింగ్ అద్భుతం’…
  • మళ్లీ తెరపైకి బనకచర్ల ! చంద్రబాబు తమిళనాడు నుంచి నరుక్కొస్తున్నాడా..!?
  • జాతీయ పరీక్షల్లో AI సాయం ! నందన్ నీలేకని ప్రతిపాదన భేష్ !!
  • గజల్ శ్రీనివాస్ అంటేనే… గజలియత్‌కు ఓ అవమానం, ఓ కళంకం !!
  • ఓ సామాజిక కథతో మళ్లీ కలిసిన సీతారాముల జంట!
  • ఈ జెండాలు స్పష్టంగానే కుట్ర హెచ్చరికల్ని జారీ చేస్తున్నయ్!!
  • పొలిటికల్ రిపోర్టింగ్ ఎన్నో జీవితసత్యాల్ని ‘అక్షరాలా’ కళ్లకుగట్టింది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions