.
బండి సాయి భగీరథ కేసులో… బాధితురాలి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో విస్తృతంగా చూపిస్తున్నారు… మెయిన్ స్ట్రీమ్ మీడియాను మెచ్చుకుందాం, సంయమనం పాటిస్తున్నది… ప్రత్యేకించి బీఆర్ఎస్, బీజేపీలోని యాంటీ సంజయ్ సెక్షన్ విస్తృతంగా తమ సోషల్ మీడియా వింగ్స్ ద్వారా ఓ క్యాంపెయిన్ నడిపిస్తున్నాయి…
టీఆర్ఎస్ కవిత చేసిన వ్యాఖ్యలు హుందాగా, బాధ్యతాయుతంగా అనిపించాయి… ‘‘ఆ కేసు సరే, బాధితురాలిని బజారుకు లాగుతున్నారు, ఫోటోలు, వీడియోలు ప్రసారం చేస్తున్నారు… బీఆర్ఎస్ సోషల్ వింగ్ చేస్తున్న పనికి బాధ్యులెవరు..? సంబంధిత నేరస్థులను అరెస్టు చేసి శిక్షించండి’’ అనడిగింది ఆమె… నిజం… పోక్సో కేసులో బాధితురాలిని గుర్తించే ప్రచారం, ప్రసారం చేస్తే శిక్షలు ఏమిటో తెలుసా..?
Ads
1. జైలు శిక్ష మరియు జరిమానా (POCSO సెక్షన్ 23) …. పొక్సో చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం, బాధితుల వివరాలను మీడియాలో (న్యూస్ పేపర్లు, టీవీ ఛానెళ్లు, వెబ్‌సైట్లు) లేదా సోషల్ మీడియాలో వెల్లడించడం నేరం… 6 నెలల కనీస జైలు శిక్ష… 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా గరిష్టంగా…
2. సుప్రీం కోర్టు నిబంధనలు (IPC సెక్షన్ 228A) … భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 228A ప్రకారం, అత్యాచారం లేదా లైంగిక వేధింపులకు గురైన వారి గుర్తింపును వెల్లడించడం శిక్షార్హం… బాధితురాలు మరణించినా లేదా మతిస్థిమితం లేకపోయినా, వారి బంధువుల అనుమతి లేకుండా వివరాలు ప్రచురించకూడదు. ఒకవేళ ప్రచురిస్తే 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు…
3. మీడియా సంస్థలపై చర్యలు … కేవలం వ్యక్తులే కాకుండా, ఆ వార్తను లేదా వీడియోను ప్రసారం చేసిన మీడియా సంస్థలపై కూడా కఠిన చర్యలు ఉంటాయి…. సదరు మీడియా సంస్థపై భారీ జరిమానాలు విధిస్తారు… కొన్ని సందర్భాల్లో సదరు ఛానెల్ లేదా పబ్లికేషన్ లైసెన్స్‌లు రద్దు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది…
4. సోషల్ మీడియాలో షేర్ చేస్తే? … వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్‌ఫారమ్‌లలో అనామకంగా ఇటువంటి వీడియోలు షేర్ చేసినా, పోలీసులు ‘సైబర్ క్రైమ్’ కింద ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను పట్టుకునే అవకాశం ఉంటుంది… పొక్సో చట్టం కింద ఒకసారి కేసు నమోదైతే బెయిల్ రావడం కూడా చాలా కష్టం…
ముఖ్య గమనిక…: బాధితురాలి ముఖం బ్లర్ చేసినా లేదా పేరు మార్చినా.. ఇతర వివరాల ద్వారా (తల్లిదండ్రుల పేరు, ప్రాంతం) ఆమె ఎవరో గుర్తుపట్టే అవకాశం ఉంటే, అది కూడా చట్టాన్ని ఉల్లంఘించినట్లే పరిగణించబడుతుంది…
బండి సంజయ్ దొరికాడు అనుకున్నారా, లాగారా వేరే విషయం… కానీ బీఆర్ఎస్ వ్యవహార శైలి… తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్నట్టుగా రెచ్చిపోతోంది… ఎన్నో కేసుల్లో ఉదాసీనంగా వ్యవహరించి నిందితులకు వత్తాసు పలికింది బీఆర్ఎస్… లిస్టు తీస్తే చాంతాడంత… రాష్ట్ర ప్రజలందరినీ నొప్పించిన ఓ ఉదాహరణ మాత్రం చెప్పుకుందాం…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ… నాగ రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, వారి ఇద్దరు కుమార్తెలు (సాహితీ, త్రిలోక) జనవరి 2022లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుర్తుందా…? వనం వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ కన్ను ఆమె మీద పడి వేధిస్తే… ఆ కుటుంబం తమ నివాసంలో గ్యాస్ మొత్తం స్వయంగా అగ్నికి ఆహుతి చేసుకుంది…
తన భార్యను తన వద్దకు పంపాలని రామకృష్ణను వేధించినట్లు సెల్ఫీ వీడియోలో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.. “రాఘవ కోరిక తీర్చలేక, అటు కుటుంబ గౌరవాన్ని కాపాడుకోలేక చనిపోతున్నాను” అని రామకృష్ణ ఓ వీడియోలో పేర్కొన్నాడు… తెలంగాణ ప్రజానీకం కన్నీళ్లు పెట్టుకుంది… సీన్ కట్ చేస్తే… కొడుకును వెనకేసుకొచ్చిన అదే వెంకటేశ్వరరావుకు మళ్లీ కేసీయార్ టికెట్టిచ్చాడు… సరే, జనం ఛీకొట్టి శిక్షించారు, ఓడించారు, అది వేరే కథ…
బోలెడు ఉదాహరణలు… అలాగని బాధితురాలికి న్యాయం కోసం ఓ రాజకీయ పార్టీగా గొంతెత్తవద్దా అంటే, అవసరమే… కానీ పర్టిక్యులర్ రాజకీయ ప్రయోజనాల కోసమే రచ్చ చేయడమే ఆశ్చర్యం కలిగిస్తోంది… అన్ని కేసుల్లో ఇలాంటి స్పందన ఎందుకు ఉండటం లేదు..? బండి సంజయ్ దొరికాడు కాబట్టి వేటాడటమా..?!
హానీ ట్రాప్ కాదు, మీడియాపై మనీ ట్రాప్ అని కామెంటుతున్నాడు కేటీయార్… మరి బావమరిది దొరికినప్పుడు, తన సొంత కుటుంబసభ్యుల ఫోటోలు రాకుండా మీడియా మీద ఒత్తిళ్లు, ఆంక్షలు పెట్టింది ఎవరు..? అదీ మనీ ట్రాపేనా..?
బండి పోక్సో కేసులో బాధితురాలి ఫోటోలు, వీడియోలు పబ్లిష్ చేసిన, షేర్ చేసిన, ప్రసారం చేసిన సోషల్ మీడియా ఖాతాలు సేకరిస్తున్నారు పోలీసులు… ఓసారి సీరియస్ యాక్షన్ ఉంటేనే బెటర్… కోర్టులూ సమర్థిస్తాయి..!!
Share this Article