Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బావల్లేని మరదళ్లు… మరదళ్లు లేని బావలు… ఉత్తములు- గుణవంతులు…

May 25, 2026 by M S R

.

Subramanyam Dogiparthi ….అత్త లేని కోడలుత్తమరాలు ఓయమ్మా
కోడల్లేని అత్త గుణవంతురాలు .
అలాగే
బావల్లేని మరదళ్ళు గుణవంతురాళ్ళు
మరదళ్ళేని బావలు ఉత్తముళ్ళోరయ్యా .

రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వచ్చిన ఈ ఏంటి బావ మరీనూ స్టోరీ ఇదేనన్న మాట . ఈ హాస్యరస పాఠశాల మాస్టార్లలో కామన్ ఫీచర్ ఏంటంటే పాత్రల సృష్టి . గమ్మత్తుగా ఉంటాయి . మన మధ్య ఉన్నట్లే ఉంటాయి ; విభిన్నంగా ఉంటాయి .

Ads

సినిమాలో మూడు జంటలు ఉంటాయి . ఒకటి నరేష్- శృతి . రెండోది మల్లికార్జున రావు- వై విజయ . మూడోది బాబూమోహన్- శ్రీలక్ష్మి . నరేష్ రాముడు మంచి బాలుడు టైప్ . బాస్ మల్లికార్జున రావు సింగిల్ ఎక్స్ ఐడియాలను జొప్పిస్తాడు . నరేష్ బుర్ర తొలవటం ప్రారంభం అవుతుంది .

ఇంతలో మరదలు సింధుజ కాలేజీ చదువుల కోసం అక్క శృతి అంటే నరేష్ ఇంటికి వస్తుంది . మరదల్ని గోకటం మొదలు పెడతాడు . మరదలికి అనుమానం వచ్చి పెద్ద బావ గిరిబాబుని రంగంలోకి దించుతుంది . నరేష్ వేసే ఏషాలన్నీ గిరిబాబు నరేష్ భార్య శృతి మీద వేస్తుంటాడు .

నరేషుకి భార్య మీద అనుమానం రావటం మొదలవుతుంది . భార్యకు కాపలా కాయటం మొదలు పెడతాడు . ఈ సంగతి భార్య శృతికి తెలిసి ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది . వై విజయ కాపాడి తన ఇంట్లో పెట్టుకుంటుంది . అందరూ కలిసి క్లైమాక్స్ నాటకం ఆడి నరేష్ బుర్రని క్లీన్ చేయటంతో సినిమా హుషారాంతం అవుతుంది .

ఈ సినిమాకు మూల కధ హరీష్ త్రివేది ఓ మరదలి ఆవేదన అని క్రెడిట్స్ ఇచ్చారు . ఆ కధను సినిమాకు అనుగుణంగా స్క్రీన్ ప్లేని రేలంగి నరసింహారావు , దివాకర్ బాబు మాడభూషిలు బిర్రుగా తయారు చేసుకున్నారు . డైలాగులను దివాకర్ బాబు గారే బాగా వ్రాసారు .

ఇద్దరినీ పాత్రల సృష్టికి అభినందించ వలసి ఉంటుంది . సంస్థానాధీశుడి ఆహార్యంలో సుత్తి వేలు పాత్ర బాగుంటుంది . వై విజయ వెటర్నరీ డాక్టర్ . ఆమె అసిస్టెంట్ బాబూమోహన్ . పేషంట్ పాముని తీసుకుని వచ్చే వాడిగా బ్రహ్మానందం . బ్రహ్మానందం- వై విజయ- మల్లిఖార్జున రావు- పాము ఎపిసోడ్ కాస్త సింగిల్ ఎక్సుగా ఉంటుంది .

శృతి కన్నడ నటి . అక్కడ రాజకీయ నాయకురాలు కూడా . గిరిబాబు ట్రబుల్ షూటర్ పాత్ర , తింగరి బావను రిపేర్ చేసే హుషారు పాత్రలో సింధుజ బాగా నటించారు . ఇతర పాత్రల్లో కృష్ణ చైతన్య  తదితరులు నటించారు . కావలి జవహర్ భారతిలో కామర్స్ లెక్చరర్ అన్నదాత ప్రాసమణికి కూడా ఓ పాత్రను సృష్టించారు . తెలుగు వారికి ప్రాసమణి గురించి పరిచయం చేయనక్కరలేదు . తెలియని వారు గూగుల్ చేసి తప్పక తెలుసుకోండి .

ఇంక పాటలు . విద్యాసాగర్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగుంటాయి . డ్యూయెట్లలో నరసింహారావు గారిని రాఘవేంద్రరావు ఆవహించాడా అనే డౌట్ కూడా వస్తుంది . చలి చీమ కుట్టింది , సారంగో సారంగో , ఓ సజనా జరా ఆ జానా , ఆకు చాటు పిందెవయినా పాటలు బాగుంటాయి .

ఆకు చాటు పిందెవయినా పాటలో టైప్ మెషీన్లను దించేస్తారు . సంతోషం ఏమిటంటే హీరోయిన్ మీద పళ్ళూ పుష్పాలు వేసినట్లు టైప్ మెషీన్లను వేయలేదు . హీరోయిన్ ఢాం అని ఉండేది . మదిలో మెదిలే ఒక పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . బాబూమోహన్ , వై విజయ మీద ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ పాట రీమిక్స్ సరదాగా ఉంటుంది .

సినిమాలో గ్రామ్ ఫోన్ పాటల మీద సింగిల్ ఎక్స్ జోకులు రసికులకు బాగా నచ్చుతాయి . లైట్ వెలగటానికి టైం పడుతుంది . స్మార్ట్ బుర్రలకు వెంటనే అర్థం అయి నవ్వుకోలేక చస్తారు . అలా నవ్వుకోవాలన్నా రస హృదయం ఉండాలనుకోండి .

పాటల్ని వెన్నెలకంటి , సాహితి , వడ్డేపల్లి కృష్ణ , సంగం వెంకటేశ్వరరావులు వ్రాసారు . ఈ వెంకటేశ్వరరావు గారు నిర్మాతల్లో ఒకరు కూడా . బాలసుబ్రమణ్యం , చిత్రలు శ్రావ్యంగా పాడారు . అన్నీ బాగా వచ్చాయి .
మాంచి వినోదాత్మక రొమాంటిక్ మూవీ . చూడతగ్గ సినిమా . యూట్యూబులో ఉంది . చూసి ఉండనట్లయితే తప్పక చూడండి .

కొసమెరుపు : టైటిల్ ఊరుకో బావా మరీనూ అని పెట్టనందుకు రచయితలకు thanks .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బావల్లేని మరదళ్లు… మరదళ్లు లేని బావలు… ఉత్తములు- గుణవంతులు…
  • నా వాచాలత్వం జీడి పప్పు… మీ వక్తృత్వం జిల్లేడు పప్పు…
  • IPL-2026 …. ప్లేఆఫ్‌లోకి రాజస్థాన్…! పంజాబ్ కల మళ్లీ భగ్నం..!
  • డ్రగ్స్ మత్తు దిగింది సరే… ఆ ‘థార్ పోరగాళ్ల’ డబ్బు బలుపు దిగేదెలా..?
  • అవును, సీఎం విజయ్ హీరోయిన్ సూసైడ్ చేసుకుంది… సో వాట్..?!
  • Ugly story … ఓ సైకో మొగుడి డార్క్, ప్రాక్టికల్ షేడ్స్ కథ…
  • బెంగాల్‌లో బీజేపీ చేస్తే తప్పు..! అదే పని కేరళలో కాంగ్రెస్ చేస్తే..?
  • తెలంగాణ బీజేపీ మరో మణిమకుటం… ఇదీ తన ‘క్నాలెడ్జి’…
  • సెల్వమణితో రోజా ప్రేమకథ ఇక్కడ పుట్టి… పదేళ్లకు వర్కవుట్…
  • RDSS … కేసీయార్ మరిచిన విజ్ఞత-! రేవంత్ చూపించిన పరిణతి..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions