Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అదే నాగబాబు… అదే హైపర్ ఆది… అవే పాత టీమ్స్… మళ్లీ జనసేన షో…?

May 20, 2026 by M S R

.

నిన్నో మొన్నో ఓ ప్రోమో… అది ఈటీవీ జబర్దస్త్ బాపతు ప్రోమో… అన్ని ప్రయోగాలూ అయిపోయాయి… ఇక అదే పాత నాగబాబును… జబర్దస్తీ టీమ్‌ మీద కస్సుమని కోపగించి వెళ్లిపోయి, నానా ఇతర చానెళ్ల ప్రయోగాలు చేసి, ఫ్లాపయిన నాగబాబును మల్లెమాల టీమ్‌ మళ్లీ ఈటీవీ జబర్దస్త్‌కు తీసుకొచ్చింది… అనేకమంది జడ్జిలు వచ్చీపోతూ ఉన్నవేళ, ఇక ఆ టీమ్ చివరకు నాగబాబునే మళ్లీ కాళ్లావేళ్లా పడి తెచ్చుకుంది… తోడుగా ఇంద్రజ…

తమ్ముడు, ఉపముఖ్యమంత్రి స్వయంగా సినిమాలు చేసుకుంటున్నాడు, అన్నయ్య ఎమ్మెల్సీ అయితే ఈ చిన్న జబర్దస్త్ చేస్తే తప్పేముందిలే… అంతటి రోజా మంత్రి అయ్యేవరకు జబర్దస్త్ చేస్తూనే ఉందిగా… వాళ్లకు వాళ్ల జనం, వాళ్ల చప్పట్లు, వాళ్ల మీద పెత్తనం ముఖ్యం… అందులో ఉన్న మజా వాళ్లకు మంత్రి పదవిలో కూడా రాదు… రియాలిటీ…

Ads

సరే, నాగబాబు వచ్చాడు… తను అల్లాటప్పాగా ఓ జడ్జిగా చేసేసి వెళ్లిపోడు… దాన్ని కూడా ఓ జనసేన బాపతు షోగా మారుస్తాడు… గతంలో చూశాం కదా… మెగా కుటుంబానికి ఎవరు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా, వాళ్ల మీద కౌంటర్లు వేయించేవాడు హైపర్ ఆదితో …. ఆది ఎలాగూ జనసేన కార్యకర్త కదా… మహేష్ కత్తి దగ్గర నుంచి బోలెడు మంది మీద పంచులు వేసేవాడు…

అసలు ఓ సెక్షన్‌కు అనుకూలంగా తీసుకుపోతున్నారనే సోయి మల్లెమాలకు లేదు, ఈటీవీకి మొదటి నుంచీ లేదు… అసలే ఆ బూతు షో… పైగా ఇదో రంగు… ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా..? నాగబాబు రాగానే తన పాత టీమ్‌ను మళ్లీ జబర్దస్త్ షోలోకి రీఇండక్ట్ చేసే పనిలోపడ్డాడు… మరి హైపర్ ఆది రాకపోతే ఎలా..?

మొనాటనస్ పంచులు, విసుగెత్తిస్తున్న వ్యాఖ్యలతో బదనాం అవుతున్నాడు హైపర్ ఆది… అయితేనేం, నాగబాబు కోరుకున్నాక ఆగుతుందా..? ఏమయ్యా ఎప్పుడు వస్తున్నావు అనడిగాడు తాజా షో ప్రోమోలో… అన్నీ సరిచూసుకుని వచ్చేస్తాను సార్ అన్నాడు ఆది… అనకపోతే ఎలా మరి..?

అభి, సుధీర్ వంటి చాలామంది వెళ్లిపోయారు, కొత్తవాళ్లు వస్తున్నారు… పెద్ద మజా ఉండటం లేదు, పాత బూతు కల్చర్ సరేసరి… ఈస్థితిలో ద్వంద్వార్థాల పంచుల ఆదిని మళ్లీ తీసుకొస్తున్నాడు… చూస్తూ ఉండండి… జనసేనకు మద్దతుగా, ప్రత్యర్థుల వ్యాఖ్యలకు కౌంటర్లు మళ్లీ గ్యారంటీ… పాపం మల్లెమాల, పాపం ఈటీవీ..!!

సర్, నాగబాబు సార్ గారూ… ఆటో రాంప్రసాద్ ఎటూ వెళ్లలేదు, వెళ్లలేడు పాపం… కానీ మీ కార్యకర్తలు గెటప్ సీను, సుడిగాలి సుధీర్ కూడా వచ్చేస్తారా..? పాపం, సుధీర్ రెండు సినిమాలు ఒప్పుకున్నట్టున్నాడు… తనను వదిలెయ్ పాపం..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగ్ గీతం – బోలెడు బ్లండర్స్, అది ఎక్కడెక్కడ దెబ్బతిన్నదంటే..?
  • కాళ్లల్లో కట్టెలు – ఆత్మరక్షణలో కిషన్‌రెడ్డి – తేలిపోయిన పేలవ వివరణ
  • BRS + Janasena + BJP … తెలంగాణ ద్వేషి పవన్ గోకుతూనే ఉన్నాడు…
  • అంతటి సిల్క్ సయ్యా అనడిగితే… నై అనే బావమరిది ఎవడుంటాడు..?
  • అనుకున్నదే – రక్తికట్టని ‘సింగ్ గీతం’ – మరీ దయనీయం వసూళ్లు
  • A Global Traveller — మోడీ టూర్ల సెంచరీ — 78 దేశాల పర్యటనలు
  • రాజకీయ కలకలం – ఠాక్రేకు మరో భంగపాటు? – జార్ఖండ్‌లో మరో ఘట్టం
  • BJD — పట్నాయక్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం — వారసుల్లేరు, నాయకుల్లేరు
  • Pepsi Blunder — ఓ మార్కెటింగ్ తొందరపాటు — దేశమంతా అల్లర్లు
  • ఆరుట్ల స్కూల్ — ప్రతి సర్కారు బడి ఇలా మారిపోతే ఎంత బాగుండు..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions