Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇది ఆ ఎన్టీయార్ పరువు ప్రతిష్ట కాదు – సుమన్ – సురేష్ బాపతు !!

August 17, 2026 by M S R

.

Subramanyam Dogiparthi ….  యన్టీఆర్ , అంజలీదేవి నటించిన ఆ పరువు ప్రతిష్ఠ సినిమా కధ కాదు ఇది . మణిరత్నం డబ్బింగ్ సినిమా ఘర్షణ గుర్తుకొస్తుంది 1993 లో వచ్చిన ఈ పరువు ప్రతిష్ఠ సినిమా చూస్తుంటే .‌ రామానాయుడు సినిమా కాబట్టి చిక్కటి కధ , బిర్రయిన స్క్రీన్ ప్లే , వాటికి అనుగుణంగా దర్శకత్వం , వెరశి హిట్ సినిమా .

అనగనగా ఓ ప్రెస్టేజి జస్టిస్ పార్వతి . ఆమెకు పరువు ప్రతిష్ఠలంటే ప్రాణం . లక్ష్మి చాలా బాగా నటించింది ఈ పాత్రను . ఆమెకు ఇద్దరు కూతుళ్లు , ఓ కొడుకు . కొడుకు హీరో సుమన్ . కాలేజీలో చదువుకుంటూ క్లాస్ మేట్ , ముద్దు గుమ్మ మాలాశ్రీ చేత గాఢంగా ప్రేమించబడతాడు .

Ads

ప్రెస్టేజి పార్వతి పెద్ద కూతురు భర్త పోలీసు ఇనస్పెక్టర్ . చిన్న కూతురు వైష్ణవి అరవింద్ కారు డ్రైవర్ని ప్రేమించి అన్న సుమన్ సహాయంతో గుళ్ళో పెళ్లి చేసుకుని ఇంట్లోంచి గెంటివేయబడుతుంది . అసలు సిసలైన మలుపు ఏంటంటే ప్రెస్టేజి పార్వతి భర్తకు బొంబాయిలో మరో భార్య , ఓ కూతురు , ఓ కొడుకు ఉంటారు .

ఆ కొడుకు సురేష్ . భార్య శ్రీవిద్య . సురేష్ అరెస్ట్ అవటంతో సుమన్ కు అన్నీ చెప్పి బొంబాయి పంపిస్తాడు తండ్రి . సురేష్ కు బెయిల్ ఇచ్చి ఆ కుటుంబాన్ని హైదరాబాదుకు షిఫ్ట్ చేస్తాడు . సుమన్ సురేష్ లకు ఘర్షణ . క్లైమాక్సులో ప్రెస్టేజి పార్వతి చిన్న కూతురు బిడ్డను ప్రసవిస్తూ చనిపోతుంది .

ప్రెస్టేజి పార్వతికి జ్ఞానోదయం కావటం , ఇద్దరు భార్యలు , ఇద్దరు కొడుకులు కలవటం , ఇద్దరు కలిసి కామన్ విలన్లు అందరినీ ఉతకటం , పోలీసులు అన్ని సినిమాల్లో లాగానే చివరాఖరుకు వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అనటంతో సినిమా శుభాంతం అవుతుంది .

Excellent romantic , emotional , drama-oriented movie . సుమన్ , మాలాశ్రీ జోడీ చాలా బాగుంటుంది . ఇతర ప్రధాన పాత్రల్లో యం వి యస్ హరనాధరావు , బాబూ మోహన్ , సాయికుమార్ , ఆలీ , రాజ్ కుమార్ , గుడివాడ రౌడీ మోహన్ రాజ్ , శ్రీనాధ్ , వైష్ణవి , సుధారాణి , మాడా , నర్రా , బ్రహ్మానందం  తదితరులు నటించారు . ఎప్పటిలాగే రామానాయుడు అతిధి పాత్రలో తళుక్కుమంటారు . వాళ్ళ సినిమా కదా !

కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం గంహనాధన్ ది . డైలాగ్స్ హరనాధరావు . రాజ్ కోటి చక్కటి సంగీతాన్ని అందించారు . ముఖ్యంగా బేక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది . డైలాగులను చక్కగా వినిపించేలా BGM ఉంటుంది . ఇప్పటి దర్శకులు , సంగీత దర్శకులు తప్పక చూడాలి , వినాలి , నేర్చుకోవాలి .

సి నారాయణరెడ్డి , వేటూరి , భువనచంద్ర , సిరివెన్నెల పాటల్ని వ్రాయగా బాల సుబ్రమణ్యం , చిత్ర వాటిని శ్రావ్యంగా పాడారు . పగలే వెన్నెలాయె జగమే మనదాయె సెగలే వెల్లువాయె అల్లరే పల్లవాయె చాలా శ్రావ్యంగా ఉంటుంది . బాగా హిట్టయింది కూడా .

బాగా హిట్టయిన రిపీట్ సాంగ్ పరువు ప్రతిష్ఠ కోసం జరుగుతున్న చెలగాటం అంటూ సాగే పాట బాగుంటుంది . ఒక చినుకు బొట్టు అంటూ సాగే వాన పాట రొమాంటిగ్గా ఉంటుంది . పారాహుషార్ వినుకోవయ్యా అనే డ్యూయెట్ సుమన్ , మాలాశ్రీ మీద బాగుంటుంది . కాలేజీలో కుర్ర గేంగ్ పాడే పాట కొక్కొరకో కొట్టు కొట్టు హుషారుగా సాగుతుంది .

సినిమా యూట్యూబులో ఉంది . Good entertainer . ఇంతకుముందు చూడనట్లయితే తప్పక చూడండి . చూసి ఉన్నా సుమన్ , మాలాశ్రీ అభిమానులు మరలా చూడొచ్చు ….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • DC … విజయ్ దేవరకొండ చేసి ఉంటే… ఓ రేంజుకు వెళ్లిపోయేదేమో…
  • ఇది ఆ ఎన్టీయార్ పరువు ప్రతిష్ట కాదు – సుమన్ – సురేష్ బాపతు !!
  • చెప్పులు పోయాయ్ – కంగారెందుకు, చాట్‌జీపీటీ ఉందిగా, అడిగెయ్…
  • హీరో యశ్… ఈ కోణంలో నచ్చావ్… గ్రేస్, మెచ్యూరిటీ… 2 మెట్లు ఎక్కావ్…
  • సద్దాం ప్రత్యక్షం – హైపర్ ఆది మాయం – వాటీజ్ దిస్ నాగబాబూ…
  • బీజేపీ నేత థర్డ్ రేట్ – క్షుద్ర వ్యాఖ్యలు … ఇజ్జత్ పోయిందిగా…!!
  • దేవదాసు చావడు… కాలం మారేకొద్దీ కొత్తగా పుడుతున్నాడు !
  • పార్టీలో అప‘స్వరాలు ! ఔట్ స్పోకెన్ రేవంత్ అసాధారణ నిశ్శబ్దం !
  • కృష్ణ, విజయనిర్మల … డెయిలీ పేపర్ల కార్గో ఫ్లయిట్‌లో చెన్నైకి !!
  • రాజగోపాలరెడ్డి ప్రయాణం ఎటువైపు ? హైకమాండ్ సైలెన్స్ ఎందుకు ?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions