Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వోటుకునోటు కేసు… మరో మహారాష్ట్ర కేసుతో లంకె… న్యాయ సంక్లిష్టత…

April 25, 2026 by M S R

.

వోటుకునోటు కేసు తెలుగు రాజకీయాల్లో ఓ సంచలనం… ఒకరకంగా కేసీయార్ పెట్టిన ఈ కేసు, పన్నిన ఈ ట్రాపు, అనంతరం అరెస్టు, జైలు, ప్రభుత్వ వేధింపులు రేవంత్ రెడ్డిలో ఓ పొలిటికల్ కసిని ప్రేరేపించి… తనను ఏకంగా ముఖ్యమంత్రి పదవి దాకా తీసుకుపోయాయి… చంద్రబాబును తెలంగాణ రాజకీయాల నుంచి, హైదరాబాద్ నుంచి పంపించడానికీ ఆ కేసు కారణం…

సుప్రీంకోర్టు మొన్న ఈ కేసును మే 20వ తేదీకి మళ్లీ వాయిదా వేసింది… దీనికి కారణం ఓ న్యాయపరమైన క్లిష్టత… ఓ ప్రతిష్టంభన… ఆ ఇంట్రస్టింగ్ ఫ్యాక్టర్ ఏమిటంటే… అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12  (అబేట్‌మెంట్) వివాదం…

Ads

1. న్యాయపరమైన చిక్కు (The Legal Crux) … అవినీతి నిరోధక చట్టం (PC Act) ప్రకారం, ఒక ప్రభుత్వ ఉద్యోగికి లంచం ఆఫర్ చేసినప్పుడు, సదరు ఉద్యోగి ఆ లంచాన్ని తీసుకోకపోయినా (లేక తిరస్కరించినా), ఆఫర్ చేసిన వ్యక్తిని శిక్షించవచ్చా లేదా అనేది ఇక్కడ అసలు పాయింట్…

వాదన A: లంచం ఇచ్చే ప్రయత్నం (Attempt) కూడా నేరమే, కాబట్టి శిక్షించాలి.

వాదన B: లంచం తీసుకోవడం (Consumption of crime) జరగనప్పుడు, కేవలం ఆఫర్ చేసినంత మాత్రాన అది నేరం కిందకు రాదు. (అంటే లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం అనే నేరం జరగలేదు)

2. మహారాష్ట్ర కేసు ప్రభావం …. మహారాష్ట్రకు చెందిన మహేంద్ర కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో ఇదే ధర్మసందేహం సుప్రీంకోర్టు ముందు ఉంది… ఈ కేసులో వెలువడే తీర్పు ఒక “Precedent” (న్యాయ సూత్రం) గా మారుతుంది…. ఒకే అంశంపై సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పులు ఇవ్వకూడదు… అందుకే, ఆ కేసులో స్పష్టత వచ్చే వరకు తెలంగాణ ఓటుకునోటు కేసును విచారించడం సరైనది కాదని కోర్టు భావిస్తోంది…

స్టీఫెన్‌సన్ (నామినేటెడ్ ఎమ్మెల్యే) ఆ డబ్బును తీసుకోలేదు కాబట్టి, అక్కడ నేరం పూర్తి కాలేదు… ఇదీ స్ట్రాంగ్ పాయింట్… ఒకవేళ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు “లంచం స్వీకరించకపోయినా ఆఫర్ చేయడం నేరమే” అని తీర్పు ఇస్తే, తెలంగాణ కేసులో విచారణ వేగవంతం అవుతుంది… లేని పక్షంలో నిందితులకు పెద్ద ఊరట లభిస్తుంది…

రాజకీయంగా చూస్తే, ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రతి అడుగు న్యాయపరంగా పక్కాగా ఉండాలని సుప్రీంకోర్టు భావిస్తోంది… ఇది సెక్షన్ 12 పరిధిని నిర్ణయించే కీలక ఘట్టం… అయితే ఇక్కడ మరికొన్ని స్ట్రాంగ్ లీగల్ పాయింట్లున్నాయి…

1. ఒక ఎమ్మెల్యే మరొక ఎమ్మెల్యేను ఓటు వేయమని అడగడం లేదా ఆ ప్రక్రియలో పాల్గొనడం అనేది ఒక రాజకీయ/ఎన్నికల వ్యవహారం అని, ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టం (Representation of the People Act) పరిధిలోకి రావాలి తప్ప, అవినీతి నిరోధక చట్టం కిందకు రాదనేది ఒక వాదన…

2. ‘ప్రభుత్వ విధి’ (Official Duty) కాదా..? PC Act వర్తించాలంటే, ఒక ప్రభుత్వ అధికారి తన అధికారిక విధిని (Official Duty) నిర్వహించడానికి ప్రతిఫలంగా లంచం తీసుకోవాలి. కానీ ఇక్కడ శాసనమండలి (MLC) ఎన్నికల్లో ఓటు వేయడం అనేది ఒక ఎమ్మెల్యే వ్యక్తిగత రాజకీయ హక్కు, అది ప్రభుత్వం తరపున నిర్వహించే అధికారిక విధి (Official Act) కాదు… విధి నిర్వహణలో భాగం కానప్పుడు, దానికి PC Act సెక్షన్లు వర్తించవు కదా…

3. లంచం ఇచ్చేవాడు నిందితుడు కాదు (పాత చట్టం ప్రకారం)… 2018లో అవినీతి నిరోధక చట్టానికి సవరణలు రాకముందు, లంచం ఇచ్చే వారిపై (Bribe Givers) నేరుగా చర్యలు తీసుకునే నిబంధనలు అంత బలంగా లేవు… ఈ ఘటన 2015లో జరిగింది కాబట్టి… అప్పటి సెక్షన్ 12 ప్రకారం, లంచం తీసుకునే వారిని ప్రేరేపించినట్లు (Abetment) మాత్రమే చూడాలి… కానీ ఇక్కడ స్టీఫెన్‌సన్ డబ్బు తీసుకోలేదు కాబట్టి, అసలు నేరమే జరగలేదు… అలాంటప్పుడు ప్రేరేపించడం (Abetment) అనే మాటే రాదనేది మరో స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్…

4. అసలు ఎఫ్ఐఆర్ లేకుండా ట్రాప్ వేయడం కూడా చట్టవిరుద్ధం అనేది మరో పాయింట్…

5. బీఆర్ఎస్ తమను ఇంప్లీడ్ చేయమని కోర్టును అడిగింది… అనుమతించాలా లేదా కూడా కోర్టు ఇంకా పరిశీలించాల్సి ఉంది… సో, రేవంత్ రెడ్డి క్వాష్ పిటిషన్ వేశాడు… కానీ చాలా అంశాల్లో న్యాయపరమైన స్పష్టత రావల్సి ఉంది… అదీ కేసు వాయిదాకు అసలు సంగతి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సిద్దరామయ్య విధేయ రాజకీయాల్లో ఇమిడేనా..? భవిష్యత్ ఏమిటి..?
  • గతం మరిచిన అక్కినేనికి… వైద్యజ్ఞానం మాత్రం గుర్తుంటుంది…
  • ఎన్టీయార్ విగ్రహం..! బీఆర్ఎస్ పెడితే గొప్పట..! రేవంత్ పెడితే తప్పట..!!
  • ఇరకాటంలో పాకిస్థాన్..! అసలు ఏమిటీ ఈ అబ్రహాం ఒప్పందాలు..?
  • ఆ ఎడారుల్లో కొత్త చమురు నిక్షేపాలు… ఇండియాకు ఇంధన వరం…
  • మన వ్యవస్థల డొల్లతనాన్ని బరిబాతల చూపించే ఓ వాస్తవ కథనం..!
  • అన్నీ అనుకున్నట్టు జరిగితే… నిజమైన ‘మహిళా సాధికారత’… రేవంత్‌కు బలం…
  • చోటా భీమ్ ఒంటి చేత్తో ‘హైదరాబాద్‌’ను ఎలిమినేట్ చేశాడు…
  • తుపాకీ పడితే ‘రికార్డే’… భేష్, హైదరాబాదీ సంచలనం ఈషా సింగ్..!
  • అసలు వంశీ సినిమాలో మోహన్‌బాబు ఎలా ఫిట్టయ్యాడనేదే ప్రశ్న..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions