Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అన్నీ అనుకున్నట్టు జరిగితే… నిజమైన ‘మహిళా సాధికారత’… రేవంత్‌కు బలం…

May 28, 2026 by M S R

.

రాజకీయంగా తనకు ఓ బలమైన మహిళా బేస్ నిర్మించుకుంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … జాగ్రత్తగా, పకడ్బందీగా అమలు చేస్తున్న ఈ ప్రణాళికతో తనకు ఒనగూరే పొలిటికల్ ఫాయిదా మాటెలా ఉన్నా… సగటు తెలంగాణ మహిళ ఆర్థిక, సామాజిక విలువను పెంచి, నిజమైన సాధికారతకు దారులు వేస్తోంది… మొన్న 8 వేల ఇందిర స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి ఒకేసారి వర్చువల్‌గా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశాడు… ఇది గ్రామాల్లో మహిళల విలువను మరింత పెంచే అడుగు… 800 కోట్ల ఖర్చుతో నిర్మించబోయే అవి గ్రామీణ మహిళల చైతన్య అడ్డాలు కాబోతున్నాయి…

ఈ కార్యక్రమం సందర్భంగా రేవంత్ రెడ్డి ఏమంటాడంటే..? ‘‘ఇదే ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తెచ్చే శక్తి మహిళలకు ఉంది’’… అది తన ఆలోచనల్ని, ఆచరణలోని సంకల్పాన్ని స్పష్టంగా బయటపెడుతూనే ఉంది…

Ads

బతుకమ్మ చీరెలు, బాలింతల కిట్లు మాత్రమే మహిళ సంక్షేమం అనే భ్రమల్లో ఉంచింది కేసీయార్ పాలన… కానీ పూర్తి భిన్నంగా, మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడే దిశలో రేవంత్ రెడ్డి ప్రణాళిక సాగుతోంది… అబ్బే, ఉచిత పథకాలు, ఖజానా ఖాళీ ఆలోచనలతో రాజకీయంగా ఏ ఫాయిదా రాదు, జగన్ బటన్ పాలసీలతో లక్షల కోట్లు పంచిపెట్టాడు, కానీ 11 తో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది కదానే అభిప్రాయాలు కొన్ని వినవస్తున్నాయి… కానీ..?

రేవంత్ రెడ్డి ప్రణాళిక నగదు పంచిపెట్టడం కాదు… ఫ్రీ బస్సు, 200 యూనిట్ల ఫ్రీ గృహజ్యోతి, 500 రూపాయల సిలిండర్ మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇళ్లు వంటివి కుటుంబం మొత్తానికీ చేయూత… కానీ మహిళలు ఆర్థికంగా నిలబడే పథకాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు రేవంత్ రెడ్డి… అవి వాళ్లను బలంగా నిలబెట్టేవి… ఫ్రీ పథకాలు కావు…

మహిళల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, వాటికి సీఎంఆర్ బాధ్యతలు… స్వయంసహాయ సంఘాల ధాన్యం కొనుగోళ్లే కాదు, మిల్లింగ్ దాకా వాళ్లను ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని చేయబోతున్నాయి… ఎలాగూ 65 లక్షల మంది సభ్యులున్న స్వయంసహాయ సంఘాల నెట్‌వర్క్, దానికి ప్రభుత్వ లింకేజీ, బ్యాంకు రుణాల మద్దతు ఉండనే ఉంది… ఆల్రెడీ 1.25 లక్షల కోట్ల లింకేజీ ప్రణాళికలున్నాయి… ‘కోటి మంది మహిళలు కోటీశ్వరులు’ లక్ష్యం వైపు ప్రణాళిక అది… రైస్ మిల్లులకు భూమి, అవసరమైన రుణాలకు ప్రభుత్వం సాయం చేస్తుంది… అంతేకాదు, గోదాములు, లాజిస్టిక్ ఏర్పాట్లకూ వంద ఎకరాల దాకా భూమిని ఇవ్వనుంది…

వీటికితోడు మహిళా శక్తి సూపర్ బజారులు ఏర్పాటు చేస్తారు, వాటిల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటాదారుగా ఉంటుంది… ఇవేకాదు, వందల బస్సులను కొనిచ్చి, వాటికి మహిళల్ని యజమానులను చేసి, ఆర్టీసికి అద్దెకు ఇవ్వబోతున్నారు… మరో సంచలనం 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఎస్‌హెచ్‌జీ ఆధ్వర్యంలో నెలకొల్పుతారు… పెట్రోల్ బంకులు కూడా చూస్తున్నవే..!

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఖచ్చితంగా మహిళా విప్లవమే… ఇది నిర్మాణాత్మకం, మహిళ వాస్తవ సాధికారత అవుతుంది… కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఒనగూరే రాజకీయ ప్రయోజనం మాటెలా ఉన్నా… పెరిగే మహిళా చైతన్యం వాళ్లే స్వచ్చందంగా ఎన్నికల్లో నిలబడే దిశకు తీసుకుపోతుంది… రియల్ వుమెన్ ఎంపవర్‌మెంట్ మాటల్లో కాదు… ఇదుగో ఈ చేతల నుంచే ప్రారంభమవుతుంది.,.!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తను దెయ్యమా..? వామ్మో, నన్నే ఎందుకు పలకరిస్తున్నాడు..?!
  • ప్రతిపక్షం అంటే ఇదీ… ఇటాలియన్ ట్రూ స్పిరిట్ అంటే ఇదీ…
  • ఇంతకీ అతను ఖతం అయిపోయినట్టేనా..? మరి ఇవేం రాజకీయాలు..?!
  • Still గుర్తుండిపోయే ఫోటోగ్రాఫర్… ఆయన పేరే ‘స్టిల్ భూషణ్…
  • Alia Bhatt … ‘Alpha’ మోడల్… ఏ చట్రంలోనూ బందీ కాదు…
  • ఈవీవీ మార్క్ అప‘హాస్యం ట్రాక్… లేటు వయస్సుల రొమాన్స్…
  • పంప్డ్ స్టోరేజీ..! తెలంగాణ పవర్ సెక్టార్‌లో ఓ నిశ్శబ్ద విప్లవం..!
  • పేదల వాహనం..! పల్లె బాటలపై ఈరోజుకూ తోపు టూవీలర్ ఈ మోపెడ్..!
  • సీరియస్ స్టోరీ..! ఈ నేరానికి పేరేమిటి..? అసలు ఇది నేరమేనా..?
  • అయ్యా, నవీన్ బాబూ… ఒక్క ప్రశ్న… ఈ సినిమా ఎందుకు తీసినట్టు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions