Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలు వంశీ సినిమాలో మోహన్‌బాబు ఎలా ఫిట్టయ్యాడనేదే ప్రశ్న..!

May 27, 2026 by M S R

.

Subramanyam Dogiparthi … యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమ యాత్ర చేద్దామా…
ప్రేమ యాత్రలకు బృందావనము నందన వనము ఏలనో
… 1992 లో వచ్చిన ఈ డిటెక్టివ్ నారద సినిమాకు ఈ రీమిక్స్ పాటే ఐకానిక్ . ఈ రీమిక్స్ పులిహోరను కలిపింది వంశీ , ఇళయరాజా . సాహిత్యం , సంగీతం , చిత్రీకరణ అన్నీ అద్భుతమే . ఈ పాటే కాదు .
మిగిలిన పాటలు కూడా వంశీ- ఇళయరాజాల కాంబినేషన్లో పాటలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి .

జుమ్మని తుమ్మెద ఎగిసే , లింగు లిటుకుల కధ ఇది బేటా , కిలకిలమని నవ్వులు రువ్వి కలకలమే లేపకు నాలో , కొత్త పిట్టరో కోకో అంటూ సాగుతాయి . అన్నీ శ్రావ్యంగా ఉంటాయి . జొన్నవిత్తుల , గురుచరణ్ , పైడిపాల , వంశీ- ఇళయరాజాలు పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , జానకమ్మ , చిత్ర చాలా శ్రావ్యంగా పాడారు . సుందరం , ప్రభుదేవాలు డాన్సుల్ని బాగా కంపోజ్ చేసారు . ముఖ్యంగా ఐకానిక్ పాటను .

Ads

వంశీ , ఇళయరాజా , యం వి రఘు ఫొటోగ్రఫీ అనగానే ప్రేక్షకుల్లో expectations ఎక్కువగా ఉంటాయి . డిటెక్టివ్ అనగానే చెట్టు కింద ప్లీడరు సినిమా గుర్తుకొస్తుంది . అయితే ఈ సినిమా ప్రేక్షకులకు నిరాశే కలిగించింది .

దారి తప్పిన ఓ ఉమ్మడి కుటుంబాన్ని డిటెక్టివ్ నారద లైన్లోకి తేవటమే కధాంశం . ఈ క్రమంలో డిటెక్టివ్ నారదగా మోహన్ బాబు , తోడుగా మోహిని , నిరోషా కలిసి పనిచేస్తారు . మోహన్ బాబుకు అసిస్టెంట్ జంతర్ మంతర్ పాత్రలో మల్లిఖార్జున రావు కామెడీ స్పేసుని మోహన్ బాబుతో షేర్ చేస్తాడు .

ఇతర ప్రధాన పాత్రల్లో జగ్గయ్య , సత్యనారాయణ , రాళ్ళపల్లి , ప్రసాద్ బాబు , కృష్ణ భగవాన్ , సంధ్య , మా గుంటూరు వాళ్ళు జయప్రకాష్ రెడ్డి , జీవా , జయలలిత , శివాజీ రాజా , వై విజయ  తదితరులు నటించారు .

కధ , స్క్రీన్ ప్లేలను వంశీ నిర్వహించగా కృష్ణ భగవాన్ డైలాగులను వ్రాసారు . కధ , స్క్రీన్ ప్లే బలహీనంగా ఉండటం వలన సంగీతం , దర్శకత్వం , తారాగణం సినిమాను గట్టెంకించలేక పోయాయి . వంశీ మార్క్ సినిమాల అభిమానులు చూసి ఉండకపోతే ట్రై చేయవచ్చు . యూట్యూబులో ఉంది .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీఆర్ దోస్త్ ఆగవ్వ… ఇల్లు కూల్చి ఆగం చేస్తే, కాంగ్రెస్ కట్టించి ఆదుకుంది…
  • పంజాబ్ ఆప్ సర్కారులో ముసలం..! ముదురుతోంది వివాదం..!
  • Obsession … థియేటర్ వదిలినా చాలాసేపు ఆ పాత్ర మనల్ని వదలదు…
  • అక్రమ బంధం..! రేవంత్ కిషన్‌రెడ్డిని కొడితే కేటీఆర్‌కు వాతలు..!
  • విజయాలెన్ని వరిస్తున్నా… తన కెమెరా పనిని మాత్రం వదల్లేదు…
  • బాలయ్యతోనే తొలి తెలుగు సినిమా… మళ్లీ ఇటువైపు రాలేదు పెద్దగా…
  • బుడ్డా హోగా తేరా బాప్‌ కా… ఈ వయస్సులోనూ అవిశ్రాంతుడు…
  • ‘బుల్డోజర్’ మరో కోణం… ప్రత్యర్థి కూతురి గౌరవానికీ తనదే భరోసా…
  • కిషన్ రెడ్డి అంటే హైకమాండ్‌కు ఫుల్ అవగాహన వచ్చేసినట్టేనా..?!
  • అణు వెన్నెముక విరిగిన పాకిస్థాన్..! ఇప్పట్లో అది కోలుకోలేదట..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions