Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రేలంగి వారి ఓ సోషల్ ఫాంటసీ – ఓ పక్కా టైంపాస్ పల్లీబఠానీ!

June 25, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. మరో సోషల్ ఫేంటసీ ఇది . మనకు యముడి మీద చాలా ఫేంటసీలు ఉన్నాయి . అయితే ఈ కన్నయ్య కిట్టయ్య మాత్రం శ్రీకృష్ణుడి మీద . కిట్టయ్య కృష్ణుడికి పరమ భక్తుడు . రెండు పాత్రలనూ రాజేంద్రప్రసాదే పోషించాడు . ఇద్దరూ ఒకే పోలికలో ఉండటమే సినిమా కధకు మూలబిందువు .‌

ఎలా అంటే…: కిట్టయ్యకు ఓ కంస మామ కూడా ఉంటాడు . ఆయనకో పొగరుబోతు కూతురు . మరదలి మీద కిట్టయ్యకు ఇష్టం . ఒకరి మీద ఒకరు సవాళ్లు విసురుకుంటూ ఉంటారు . ఓరోజు కిట్టయ్య నదిలో పడ్డ మరదలు శోభనను రక్షించటంతో మరదలికి బావ మీద ప్రేమ కలుగుతుంది .

Ads

భక్తుడి కోసం కన్నయ్య భూమి మీదకు వస్తూ ఉంటాడు . అప్పుడప్పుడు కన్నయ్య కిట్టయ్య ప్లేసులు మారుతుంటారు . దానితో రుక్మిణి , సత్యభామలకు ఆందోళన కలిగి వాళ్ళూ నారదుడు బ్రహ్మానందంతో కలిసి భూమి మీదకు వస్తారు .

కిట్టయ్యే కన్నయ్య అనుకుని గొడవపడటం , ఆ అవకాశాన్ని తీసుకుని కంస మామ కోట శ్రీనివాసరావు రుక్మిణి , సత్యభామలను పాతిపెట్టించటం చేస్తాడు . ఆ నేరం కిట్టయ్య మీద వేసి ఊరి జనం చేత చంపించేందుకు ప్లాన్ చేస్తాడు .

ఆ క్లైమాక్సులో కన్నయ్య తన వేణుగానంతో గోవులను రంగంలోకి దింపి కంసుడికి , అతని మందికి , ఊరి జనానికి దేహశుద్ధి చేపించటం , అందరికీ బుధ్ధి రావటం , కిట్టయ్యకు మరదలితో పెళ్లి జరిపించటంతో సినిమా శుభాంతం అవుతుంది . గోవులతో దుష్టశిక్షణ చేయించటం సినిమాకు హైలైట్ . ఆ ఐడియా వచ్చినందుకు రేలంగి నరసింహారావు గారిని అభినందించాలి .

మరో విశేషం ఏమిటంటే, ప్రముఖ దర్శకుడు వంశీ ఈ సినిమాకు కూడా సంగీత దర్శకత్వాన్ని వహించటం . జొన్నవిత్తుల , వెన్నెలకంటి , విశ్వనాధ శాస్త్రి పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , చిత్ర , శుభ వాటిని శ్రావ్యంగా పాడారు . కొండపల్లి బొమ్మ బంగారు బొమ్మ , ఝుం ఝుం , చల్ చల్ గుర్రం , అందాల బాల తోటి , భామ అలక ఏల అంటూ సాగుతాయి పాటలు .

మా గుంటూరు వారయిన దివాకర బాబు గారు డైలాగులను బాగా వ్రాసారు . సినిమా అంతా కోనసీమ రావులపాలెంకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెదిరేశ్వరం అనే గ్రామంలో జరిగింది . గోదావరి అందాలను బాగానే కేప్చర్ చేసారు .

ప్రధాన పాత్రల్లో అన్నపూర్ణమ్మ , శోభన , ఆమని , తులసి , అనూజ , కోట శ్రీనివాసరావు , బాబూమోహన్ , రాళ్ళపల్లి , వై విజయ , బ్రహ్మానందం , సాక్షి రంగారావు  ప్రభృతులు నటించారు .

కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వాలను రేలంగి నరసింహారావు నిర్వహించారు . పూర్తి వినోదాత్మకంగా ఉండే ఈ సినిమా 1993 జూన్లో వచ్చింది . యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనట్లయితే చూడవచ్చు .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పేపర్ బాయ్ తలుపు తట్టిన చప్పుడు – నేనింకా బతికే ఉన్నాను…
  • మన్యం గర్భంలో మైనింగ్ మాఫియా – అల్లూరి చారిత్రక గుహలకే ఎసరు!
  • ‘ఉప్పొంగెలే గోదావరి- ఊగిందిలే చేలో వరి’ – వేటూరి మరో శబ్దగారడీ!
  • దయానాయక్ బయోపిక్! – వేలు పెట్టి వారం చెడగొట్టే రాంగోపాల్‌వర్మ!
  • Michael Jackson – రోజురోజుకీ నా పాలిటి ఓల్డ్ వైన్‌లా తయారయ్యాడు!
  • కొత్త FCRA రూల్స్ చూసి కొన్ని ఎన్జీఓలకు వణుకు- కేంద్రం కొరడా!
  • పెద్దరికానికి గౌరవం- అనుభవానికి గుర్తింపు- కావాలి, కానీ ఎలా?
  • పాస్‌పోర్టుకు అంత సీన్ లేకపోతే… కఠిన పోలీసు వెరిఫికేషన్లు దేనికి?
  • అదే జరిగితే… రేవంత్ రెడ్డి చెప్పినట్టు చరిత్రాత్మక ముందడుగే!
  • “తినేది మొగుడి సొమ్ము… పాడేది మిండెడి పాట” వీళ్లకు ఇది వర్తిస్తుందా?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions