Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హరీశ్, నీకో నిజం తెలుసా..? పాలిటిక్స్‌లో జో జీతా వోయీ సికిందర్..!!

November 21, 2026 by M S R

.

సిద్దిపేటలో రేవంత్ రెడ్డి సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత హరీష్ రావు స్పందన పరమ పేలవంగా, దారి తప్పి, నాసిరకంగా అనిపించింది… ఫాఫం, ఎంత ఫ్రస్ట్రేషన్‌లో ఉంటే మాత్రం అంతలా ‘పడిపోవాలా..?’ తను ఏమంటాడంటే..?

‘నువ్వు రా, సిద్దిపేటలో నువ్వే పోటీ చేయి, చూసుకుందాం నీ పెతాపమో నా పెతాపమో… నీ మాటల్లో వజన్ లేదు..’ ఇవన్నీ డొల్ల కబుర్లు… ఈసారి కేసీయార్, కేటీయార్ ఒకవైపు, మరోవైపు కవిత తనకు గండి కొట్టడం ఖాయం… అయితే మరికొన్ని వ్యాఖ్యలూ ఓసారి చూడాలి…

Ads

‘‘రేవంత్, నీ చరిత్ర తెలియదా..? నువ్వు ఫస్ట్ ఏబీవీపీలో ఉండేవాడివి… టీఆర్ఎస్‌లో చేరాక నా వెనుకే కదా రెండేళ్లు తిరిగింది… గింతంత ఉంటివి, టీవీల కనబడాలని నిక్కి నిక్కి చూద్దువు… నేనేమో పొడుగు, నువ్వేమో పొట్టి… జెడ్పీటీసీ టికెట్ ఇప్పించాలని తిరిగినవ్, నువ్వు ద్రోహివి ఆనాడే కేసీయార్ పసిగట్టిండు, నీకు టికెట్ ఇవ్వలే… నువ్వు తిరుగని నాయకుడు లేడు, మీ జైపాల్ రెడ్డి నిన్ను ఇంట్లకే రానివ్వలే…’’

https://www.facebook.com/reel/1128554389905084

ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాల్సిందే… రాజకీయాలు స్టాటిక్ కాదు, అవి డైనమిక్… నువ్వు వెక్కిరిస్తున్న అదే రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం… జెడ్పీటీసీ టికెట్ దొరకని నాయకుడు ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు… అది సక్సెస్ స్టోరీ… పాలిటిక్సులో జో జీతా వోయీ సికిందర్… కానీ హరీష్ ఏమిటి ఈరోజు..?

కేసీయార్ నమ్మడు, అందుకే రెండో టరమ్ తరువాత కేబినెట్‌లో లేడు, నమ్మలేదు, దగ్గరికే రానివ్వలేదు… ఈరోజుకూ కేటీయార్, కేసీయార్ నమ్మరు… అది హరీష్‌కూ తెలుసు… మరోవైపు కవిత దాడి… ఫీల్డులో వ్యతిరేకత… రేవంత్ సభ, ర్యాలీ సక్సెస్… మళ్లీ చెప్పుకుందాం… రాజకీయాల్లో జో జీతా వోయీ సికందర్… నెత్తురు నెత్తురే, సొంత కొడుకే వారసుడు… నువ్వు కాదు…

హరీష్ రావు

బీజేపీకి ఓ షిండే కావాలి, కానీ నిన్ను నమ్మడానికీ వాళ్లలో ఓ సందిగ్ధం… ప్లేటు ఫిరాయిస్తే ఇప్పుడే నువ్వు జైలుకు పోయేలా కేసీయారే ప్రణాళిక రచించి మరీ అమలు చేస్తాడు… నీ లోటుపాట్లు నీ మామకు అమూలాగ్రం తెలుసు కదా…

ఒకవేళ నిజంగానే తెలంగాణ గ్రహచారం బాగాలేక కేసీయార్ మళ్లీ అధికారంలోకి వస్తే..? ఫస్ట్ పార్టీ నుంచి తరిమేసేది హరీష్ రావునే… థ్రెట్ ఈజ్ ఆల్వేస్ ఏ థ్రెట్… ఇప్పటి నుంచే సేఫ్ ప్యాసేజ్ చూసుకుంటే హరీష్ రావుకు బెటర్.., ఇజ్జత్ దక్కుతుంది… నిజంగా అమిత్ షా, మోదీ నమ్మితే… ఏమో, కేంద్రంలో ఏదో ఓ మంత్రి పదవీ దక్కొచ్చు… కేసీయార్ కుటుంబ వెట్టి చాకిరీ నుంచి రక్షణ, అక్రమాస్తులకూ రక్షణ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హరీశ్, నీకో నిజం తెలుసా..? పాలిటిక్స్‌లో జో జీతా వోయీ సికిందర్..!!
  • బిడ్డలూ.. ఎక్కడున్నారమ్మా? 40 ఏళ్ల ఒంటరి బతుకు చాలించింది మీ తల్లి!
  • మోదీ ఇమేజ్‌ పనిచేయలేదు- రాహుల్ గాంధీకి ఓ కొత్త ఊపిరి !
  • యముడినే ఎదిరించిన ఆ సావిత్రి… ఇక్కడ యముడి స్థానంలో ఓ లాయర్!
  • HIV రోగుల్లో పక్షవాతంపై కాకినాడ ప్రజావైద్యుడి మరో పరిశోధన!
  • రేవంత్ పాలనకు కేవలం 6.5 రేటింగ్ మాత్రమే ఎందుకంటే..?
  • “నో.. నో.. పి.వి. ఈజ్ ఓకే” అందామె! కానీ ఏడేళ్ల తరువాత..?
  • ఈఎన్ఈ రిపీట్ కాలేదబ్బా- అసలు ఈ తరుణ్ భాస్కర్‌కేమైంది..?
  • రాధిక ఆప్టే వెటకారం… బాలయ్యపైనా..? మేనరికాలపైనా..? కీర్తి వివరణ దేనికి.?
  • తమిళ ‘కార్తీకదీపం’ వెలిగించడానికి మోదీ లేదా షా మధురై వెళ్తారా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions