Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

…. రవితేజను వాణివిశ్వనాథ్ ఈడ్చి చెంపలు వాయగొట్టింది..!

May 26, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. అటు చేసి ఇటు చేసి చివరకు మా కళాభినేత్రి వాణిశ్రీని అత్తల లిస్టులో చేర్చేసారు . ఈ కలెక్టర్ గారి అల్లుడు వాణిశ్రీకి మరో అత్త సినిమా . ఓంకార్ వ్రాసిన కధకు శరత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ డైలాగులను వ్రాసారు . బాలాజీ నిర్మాత . కాస్ట్యూమ్స్ కృష్ణకు కొడుకుగా కూడా నటించాడు .

సబ్ కలెక్టరుగా ఉద్యోగం వచ్చిన వాణిశ్రీ భర్త గ్రామం , వ్యవసాయం వదలి ఆమెతో రాలేనని చెపితే భర్తను వదిలేసి ఆమె తన మానాన తను ఉద్యోగానికి వెళ్ళిపోతుంది . ఎలాగోలా ఆ కలెక్టరమ్మ కూతురిని ప్రేమలోకి దింపి పెళ్ళాడమని కూతురు కొడుకుని ప్రోత్సహించి పంపుతుంది హీరో సుమన్ అమ్మమ్మ నిర్మలమ్మ .‌

Ads

తన వెంటపడి అల్లరి పెడుతుంది తన బావే అని నాయనమ్మ ద్వారా తెలుసుకున్న హీరోయిన్ వాణీ విశ్వనాథ్ హీరోతో డ్యూయెట్లు పాడటం పెంచేస్తుంది . అందరూ ఒకటై కలెక్టరమ్మని ఒంటరిని చేసి సుమన్ వాణీ విశ్వనాథుల పెళ్ళికి కలెక్టరమ్మను ఒప్పించటంతో , మేనల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడంతో సినిమా శుభాంతం అవుతుంది .‌

కలెక్టరమ్మగా వాణిశ్రీకి ఈ పాత్ర చాలా చిన్నది . నీళ్లు తాగినంత వీజీ… ఎడం చేత్తో చేసేసింది . సుమన్ , వాణీ విశ్వనాథ్ చాలా హుషారుగా నటించటమే కాకుండా చాలా అందంగా కనిపిస్తారు . మేకప్ చేసిన ఆర్టిస్టులను తప్పక మెచ్చుకోవాలి . ఇతర ప్రధాన పాత్రల్లో పరుచూరి వెంకటేశ్వరరావు , నిర్మలమ్మ , అల్లు రామలింగయ్య , నర్రా , కాస్ట్యూమ్స్ కృష్ణ , బాలాజీ తదితరులు నటించారు .

రవితేజ

ప్రత్యేకంగా చెప్పవలసింది రవితేజ MLA కొడుకుగా , వాణీ విశ్వనాథ్ చేతిలో తన్నులు తినే కాలేజి క్లాస్ మేటుగా కాసేపు కనిపిస్తాడు . డొక్కలో తంతూ, ఈడ్చి చెంప దెబ్బ కొడుతూ ఉన్న ఆ సీన్ ఇప్పుడు చూస్తే అప్పటి చిన్నాచితకా పాత్రల రవితేజ ఎంత ఎదిగిపోయాడో కదా అనిపిస్తుంది. అప్పట్లో తను ‘ఒక్క చాన్స్ ప్లీజ్’ అంటూ అందరినీ అడుగుతున్న కెరీర్ తొలిరోజులు కదా.

రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో పాటలు బాగుంటాయి . డాన్సుల్ని కంపోజ్ చేసిన డి కె యస్ బాబు , శివశంకర్లను అభినందించాలి . దర్శకుడు శరత్ అందంగా చిత్రీకరించారు కూడా .

హంస నడకల అమ్మడు , గిల్లి గిచ్చి అచ్చి బుచ్చి , లేడీ లేడమ్మరో , పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చెనంట , కొత్త రకం కోరికల అంటూ సాగే పాటలన్నీ బాగా చిత్రీకరించబడ్డాయి . పాటల్ని వేటూరి , భువనచంద్ర వ్రాయగా బాలసుబ్రమణ్యం , చిత్ర శ్రావ్యంగా పాడారు .

ఎక్కువ భాగం తిరుపతి, చుట్టుపక్కల షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా 1992 సెప్టెంబరులో విడుదలయింది . యూట్యూబులో ఉంది . సుమన్ , వాణీ విశ్వనాథ్ అభిమానులు తప్పక చూడవచ్చు . మా తరం వాణిశ్రీ అభిమానులు కూడా ….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • …. రవితేజను వాణివిశ్వనాథ్ ఈడ్చి చెంపలు వాయగొట్టింది..!
  • తెలంగాణ టాప్..! రేవంత్ రెడ్డి కాలరెగరేసుకునే ముఖచిత్రం ఇది..!
  • పుష్పరాజ్ ఎప్పుడూ విలనే… అంతిమంగా గెలిచేది సింగమే…
  • మొద్దుబారిన ఖాకీలు..! తమిళ ఐపీఎస్‌లపై నెటిజనం భగ్గు…!
  • “ఎవరెస్ట్” సాహసానికి ప్రతీకా? లేక ఎ‘వరస్ట్’ సెల్ఫీ టూరిజం శిఖరమా..?!
  • కమర్షియల్ యాడ్..! కానీ ఆమె అందమైన ఆ చిరునవ్వు గుర్తుచేస్తూ..!
  • చరిత్రాత్మక ఢిల్లీ జింఖానా క్లబ్‌ ఇక చరిత్ర పుటల్లోకి..?
  • పెళ్లితో కెరీర్ క్లోజ్ అనేది పాతమాట… దాన్ని బ్రేక్ చేసిన డిఫరెంట్ జంట…!
  • నాడు మంజులను రానివ్వలేదు… నేడు మంజుల బిడ్డ ఎంట్రీకి రెడీ…
  • System … సినిమా ముగిసినా… డైలాగులు వెంటాడుతూనే ఉంటయ్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions