.
అతి తెలివి ప్రదర్శిస్తూ, సుప్రీంకోర్టునే బురిడీ కొట్టించడానికి ప్రయత్నించిన జోసెఫ్ విజయ్‌కు అదే సుప్రీంకోర్టు ఓ టాస్క్ ఇచ్చింది… దీపం వెలిగిస్తారా, కోర్టు ధిక్కరణ పరిణామాలకు సిద్దపడతారా తేల్చుకొమ్మని చెప్పింది… ఇప్పుడేం చేస్తాడు విజయ్..? ఆసక్తికరంగా మారింది…
మధురై, తిరుప్పరకుండ్రం కార్తీక దీపం కంట్రవర్సీ గురించి మనం వివరంగా గత కథనాల్లో చెప్పుకున్నాం కదా… ఇక చదవండి, ఏం జరిగిందో తాజాగా…
Ads
మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న వివాదాస్పద ‘దీపతూన్’ (రాతి స్తంభం) వద్ద నవంబర్ 24న కార్తీక దీపాన్ని వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది… తమ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేస్తూ, రేపు (నవంబర్ 28న) ఆ రాతి స్తంభం వద్ద దీపం వెలిగించాలని ఆదేశించింది… ఈ వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వం, అధికారుల తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది…

సుప్రీంకోర్టు ఆదేశాలు: ఉచ్చిపిళ్లయార్ మండపంలో వెలిగించిన అఖండ జ్యోతి నుంచే దీపతూన్ వద్ద కూడా కార్తీక దీపాన్ని వెలిగించాలని న్యాయస్థానం అధికారులకు స్పష్టం చేసింది… అదే సమయంలో, సమీపంలోని దర్గాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని సూచించింది…
ప్రభుత్వ వివరణ: ఆలయ ధర్మకర్తల మండలి (ట్రస్టీ బోర్డు) అధికారిక అనుమతి ఇవ్వకపోవడం వల్లే నవంబర్ 24న దీపతూన్ వద్ద దీపం వెలిగించలేకపోయామని తమిళనాడు ప్రభుత్వం నవంబర్ 25న కోర్టుకు నివేదించింది… ఆదేశాలను అమలు చేయలేకపోయినందుకు క్షమాపణలు కోరుతూ స్టేటస్ రిపోర్ట్ సమర్పించింది…
ధిక్కార నోటీసులు & మందలింపు: కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), డీజీపీ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, మదురై జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, ఆలయ ట్రస్టీలకు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది… “దీపం వెలిగేలా చూడటం జిల్లా మేజిస్ట్రేట్‌గా మీ బాధ్యత. కోర్టు ఆదేశాలను అతిక్రమించే అధికారం ఎవరికీ లేదు” అని కలెక్టర్‌ను ధర్మాసనం తీవ్రంగా మందలించింది… డిసెంబర్ 15న జరిగే తదుపరి విచారణకు సీఎస్ స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది…
ట్రస్టీ బోర్డు సస్పెన్షన్ & రిసీవర్ల నియామకం: కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించారనే కారణంతో ఆలయ ట్రస్టీల బోర్డును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది… ఆలయ నిర్వహణ, దీపం వెలిగించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ ఎస్. పార్థిబన్‌లను రిసీవర్లుగా నియమించింది…
CRPF భద్రత: కొండపై, ఆలయ పరిసరాల్లో భద్రతా బాధ్యతలను కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కు అప్పగిస్తూ ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది… వివాదంలోని ప్రధాన అంశం జోలికి తాము వెళ్లడం లేదని, కేవలం నవంబర్ 20న తాము ఇచ్చిన ఆదేశాల ఉల్లంఘనపైనే ఈ విచారణను పరిమితం చేస్తున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది…
Share this Article