.
Pardha Saradhi Upadrasta …. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు: ఇండియా కూటమిలో మారుతున్న రాజకీయ లెక్కలు! కాంగ్రెస్ మాటే ఫైనల్ కాదు.. ప్రాంతీయ పార్టీలకు ఎవరి వ్యూహం వారిది!
నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లుపై ఇండి కూటమిలోని కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు పునరాలోచన చేస్తున్నాయి. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం, సమాజ్వాదీ పార్టీ (SP), జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM), నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలు ఈసారి స్వతంత్ర నిర్ణయం తీసుకోబోతున్న్నాయి.
అసలు ఈ పార్టీల వైఖరిలో మార్పు వెనుక ఉన్న రాజకీయ లెక్కలేమిటి?
1️⃣ డిసెంబర్ 2026 గడువు… దక్షిణాది రాష్ట్రాల ఆందోళన!
ఒకవేళ 2026 డిసెంబర్ లోపు కనక ఈ నియోజకవర్గ విభజన బిల్లు పాస్ కాకపోతే ఆటోమేటిక్ విభజన జరుగుతుంది. ఆ విభజన రేపు 2027 లో జరిగే తాజా జనాభా గణన ప్రకారం జరుగుతుంది.
అందుకే ప్రస్తుతం చర్చలో ఉన్న నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలో లోక్సభ స్థానాలను 50 శాతం పెంచే అంశం కీలకంగా మారింది.
Ads
ఒకవేళ ఈ ప్రతిపాదన ముందుకు వెళ్లకపోతే, భవిష్యత్తులో జనాభా గణాంకాల ఆధారంగా జరిగే పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై ప్రభావం పడుతుందనే ఆందోళన కొన్ని పార్టీల్లో ఉంది.
దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో మంచి ఫలితాలు సాధించాయి. కానీ జనాభా ఆధారంగానే నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలకు ఆశించిన స్థాయిలో సీట్లు పెరగకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి.
అందుకే ప్రస్తుత ప్రతిపాదనలో అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెంచే విధానానికి కొన్ని దక్షిణాది పార్టీలు మొగ్గు చూపుతున్నాయి.
2️⃣ కాంగ్రెస్ వైఖరికి ప్రాంతీయ పార్టీలు ఎందుకు భిన్నంగా ఆలోచిస్తున్నాయి?
గతంలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలతో ముడిపడిన బిల్లులపై ప్రతిపక్షాలు కాంగ్రెస్ మాట విని ప్రభుత్వ వ్యతిరేక వైఖరి తీసుకున్నాయి. అయితే ఇప్పుడు కొన్ని ప్రాంతీయ పార్టీల్లో కొత్త ఆలోచన మొదలైంది.
కాంగ్రెస్ నిర్ణయాన్ని గుడ్డిగా అనుసరించడం కంటే, తమ రాష్ట్ర ప్రయోజనాలు, ఎన్నికల లెక్కలు, భవిష్యత్ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయం ఇండి కూటమి పార్టీలలో బలపడుతోంది
3️⃣ సమాజ్వాదీ పార్టీకి మహిళా ఓట్ల భయం!
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన చర్చలో నియోజకవర్గాల పునర్విభజన అంశం కూడా కీలకంగా మారింది. ముఖ్యంగా సమాజ్వాది పార్టీకి ఉత్తరప్రదేశ్లో 2026లో జరిగిన పునర్ విభజన చట్టాన్ని ఓడించటం ద్వారా 2029లో 33% మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలుపరిచే వెసులుబాటుని సమాజ్వాది పార్టీ అడ్డుకున్నది అని బిజెపి రాజకీయంగా చాలా ప్రచారం చేసి వాడుకుంది. అందుకే ఈసారి అఖిలేశ్ యాదవ్ పార్టీ తన నిర్ణయాన్ని స్వతంత్రంగా తీసుకునే అవకాశం ఉంది.
4️⃣ డీఎంకే – కాంగ్రెస్ మధ్య పెరుగుతున్న రాజకీయ దూరం!
ఈ వ్యవహారంలో అత్యంత ఆసక్తికరమైన అంశం తమిళనాడు రాజకీయాలు.
దశాబ్దాలుగా కాంగ్రెస్, డీఎంకే మధ్య పొత్తు కొనసాగుతోంది. కాంగ్రెస్ అనేక సందర్భాల్లో డీఎంకే మద్దతుతో రాజకీయంగా లబ్ధి పొందింది. దాదాపు 20, 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ డిఎంకె పొత్తులో ఉండి ఎక్కువ సీట్లు తీసుకుని డీఎంకే మద్దతుతో ఎంపీ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటూ హఠాత్తుగా మొన్న ఎన్నికల ఫలితాలు రాగానే విజయ్ పార్టీకి కావలసిన, తన వద్ద ఉన్న 5 సీట్లు తీసుకుని వెళ్లి కాంగ్రెస్ ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి డిఎంకెను మోసం చేసింది అని డిఎంకె పార్టీ శ్రేణుల్లో చాలా అసంతృప్తి ఉంది.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఏ ఇండికూటమి పార్టీ అంగీకరించని రోజుల్లో కూడా మొట్టమొదటిసారిగా సమయాల్లో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్లు నేరుగా ఎలాంటి షరతులు లేకుండా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఫలితాలు రాగానే ఎన్నికలకు ముందు పొత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీ మోసం చేసేసి విజయ్ వైపు తిరగడంతో స్టాలిన్ రగిలిపోతున్నాడు.
విజయ్ నేతృత్వంలోని టీవీకే తో కాంగ్రెస్ సంబంధాలపై తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.
కాంగ్రెస్, టీవీకే వైపు మొగ్గు చూపిన సందర్భములో డీఎంకేకు రాజకీయంగా నష్టం కలిగే అవకాశం ఉందనే ఆందోళన స్టాలిన్ లో ఉంది.. మరోవైపు విజయ్ పార్టీ, డీఎంకే , అన్నాడీఎంకే వ్యతిరేక వర్గాలను ఒకచోట చేర్చగలిగితే భవిష్యత్తులో డీఎంకేకు గట్టి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకే తన రాజకీయ వ్యూహాన్ని కాంగ్రెస్ నిర్ణయాలకు అనుగుణంగా కాకుండా స్వతంత్రంగా రూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
5️⃣ అమిత్ షా ఇచ్చిన 50 శాతం పెంపు ప్రతిపాదన కీలకమా?
గత బిల్లు వీగిపోయినప్పుడు జరిగిన చర్చల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 50 శాతం సీట్ల పెంపు అంశాన్ని బిల్లులో చేర్చే విషయంపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ప్రతిపక్షాలకు హామీ ఇచ్చారు. ఆ సమయంలో డీఎంకే సానుకూలంగా స్పందించింది, అయితే కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు. ఆరోజున నాకు ఒక గంట టైం ఇవ్వండి 50% అనేది బిల్లులో టైప్ చేసి తీసుకొని వస్తా అని అమిత్ షా చెప్పినప్పుడు డీఎంకే దాదాపు ఓకే అన్నది కానీ కాంగ్రెస్ వాళ్లు ఒప్పుకోలేదు అప్పటికి ఆ బిల్లుని పక్కన పెట్టేశారు.

ఇప్పుడు కేంద్రం వివిధ పార్టీలకు జనాభా ఆధారిత పునర్విభజన, సమాన శాతం సీట్ల పెంపు వల్ల కలిగే ప్రభావాలపై గణాంకాలను వివరించింది . ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రభుత్వ్ం పార్టీల ముందు పెట్టి ఆటోమేటిక్ తాజా జనాభా గణన వల్ల జరిగే నియోజకవర్గ విభజన కంటే బిల్లు పెట్టి అందరికీ సమానంగా అన్ని రాష్ట్రాలకి పెరిగితే ప్రస్తుతం ఉన్న రిప్రసెంటేషన్ అట్లాగే ఉంటుంది అనే డేటా పార్టీలకిచ్చింది. పార్టీలకు అర్థం అయ్యింది. గుడ్డిగా ఈ బిల్లును వ్యతిరేకించి ప్రయోజనం లేదు అనే ఆలోచన ప్రాంతీయ పార్టీల్లో మొదలు అయ్యింది.
అసలు రాజకీయ సందేశం ఏమిటి?
ఈ పరిణామాలను గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది.
– డీఎంకేకు తమిళనాడు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం.
– సమాజ్వాదీ పార్టీకి ఉత్తరప్రదేశ్లో మహిళా ఓటర్ల మద్దతు ముఖ్యం.
– జేఎంఎం, నేషనల్ కాన్ఫరెన్స్ , వైసీపీ వంటి పార్టీలకు తమ రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం.
– శరద్ పవార్ వర్గానికి , ఉద్ధవ్ వర్గానికి తన రాజకీయ భవిష్యత్తు, కూటమి సమీకరణాలు మఖ్యం.
– కాంగ్రెస్ మాత్రం జాతీయ స్థాయిలో నేను ప్రధానప్రతిపక్ష పార్టీ, నా ప్రయోజనాలు నాకు ముఖ్యం. ప్రభుత్వ వ్యతిరేకతే నా లక్ష్యం అంటూ ముందుకు పోతుంది.
ఇండి కూటమి అంటే అన్ని పార్టీలకు ఒకే రాజకీయ ప్రయోజనం ఉందని కాదు. కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకుందని మిగతా ప్రాంతీయ పార్టీలు కూడా అదే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ప్రతి పార్టీకి తనదైన వ్యూహం, తనదైన లెక్కలు ఉంటాయి.
ఈసారి నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కాంగ్రెస్ నిర్ణయం కంటే ప్రాంతీయ పార్టీల స్వతంత్ర నిర్ణయాలే కీలకం కాబోతున్నాయి.
అదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆసక్తికరమైన ప్రశ్న!
చివరికి ఈ బిల్లు విషయానికి కాంగ్రెస్ ఒంటరిగా మిగిలే అవకాశం ఉంది.
— ఉపద్రష్ట పార్ధసారధి
#Delimitation #WomenReservation #INDIAlliance #DMK #Congress #SamajwadiParty #JMM #SharadPawar #TamilNaduPolitics #UttarPradeshPolitics #SouthIndia #IndianPolitics
Share this Article