Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చెత్తా హీరోయిజం! ఆ డెలివరీ బాయ్ చెప్పు తీసి ఉంటే..?!

June 30, 2026 by M S R

.

Ashok Kumar Vemulapalli …. డెలివరీ బాయ్‌పై ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్ దాడి
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఫుడ్ తప్పుగా తెచ్చాడనే నెపంతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం హీరో అఖిల్ రాజ్ ఒక డెలివరీ బాయ్‌పై దాడికి తెగబడ్డాడు. హీరో అఖిల్ రాజ్ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయగా, డెలివరీ బాయ్ పొరపాటున వేరే ఆర్డర్ ఇచ్చాడు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన హీరో, సదరు డెలివరీ బాయ్‌పై ఇలా దాడి చేశాడు

ప్రతి వెధవకి .. డెలివరీ బాయ్స్ అంటే అదేంటో లోకువ .. చులకన .. పొరబాటు జరిగింది అతను ఒప్పుకున్నాడు .. అయినా సరే కొట్టడం ఏంటి ?

Ads

ప్రతోడు .. తాను బలవంతుడినని .. డబ్బున్నోడినని .. నిరూపించుకోవడానికి ఇలా డెలివరీ బాయ్స్ మీద , డ్రైవర్లు, ఇంట్లో పనిమనుషులు , సెక్యూరిటీ గార్డుల మీద ప్రతాపం చూపిస్తుంటారు .. వారి మీద అరుస్తుంటారు .. కొడుతుంటారు

వాళ్ళు నీతిగా నిజాయతీగా కష్టపడి బతుకుతున్నారు .. అలాంటి వారిపైనా మనం దాడులు చేసేది .. డెలివరీ బాయ్ .. మనం ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఎక్కడో రెస్టారెంట్ నుంచి అంత ట్రాఫిక్ లో బైక్ పై తీసుకొచ్చి ఇస్తాడు .. దానికి మనం ఆర్డర్ లో డెలివరీ ఛార్జ్ కింద కొంత వసూలు చేస్తారు.

మనం డబ్బులు పే చేసాం .. వాళ్ళు డెలివరీ ఇచ్చారు .. ఇక్కడ మ్యూచువల్.. అంతే కదా .. అదే డెలివరీ బాయ్ తిరిగి నీమీద దాడి చేస్తే తలెక్కడ పెట్టుకుంటావు ?

కొద్దిరోజుల క్రితం బంజారా హిల్డ్ లో ఒక అపార్ట్మెంట్లో డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినపుడు డోర్ తీయగానే కుక్క అతని మీదకు దూసుకొస్తే భయంతో నాలుగో అంతస్తు నుంచి దూకేయడంతో డెలివరీ బాయ్ చనిపోయాడు ..

మనిషిని మనిషిలా గౌరవించండి .. ఆదరించండి .. డెలివరీ బాయ్ అయినా డ్రైవర్ అయినా ఇంట్లో పని మనుషులు అయినా వాళ్ళు మనలా మనుషులే అన్న సంగతి గుర్తు పెట్టుకోండి .. ఇలా నీచంగా ప్రవర్తించి దిగజారకండి ..

అతను ఈ వీడియో తీశాడు కాబట్టి సరిపోయింది .. అదే వీడియో లేకపోతే ఇదే హీరో తన పలుకుబడి , డబ్బున్న అహంకారంతో డెలివరీ బాయ్ పై కేసు పెట్టి ఇరికించేవాడేమో .. సాటి మనిషిని గౌరవించినపుడే మనం నిజమైన హీరోలం అవుతాం .. ఇలా దాడులు చేస్తే చెత్త హీరోయిజం-  రియల్ విలన్స్ అవుతాం ..  అశోక్ వేములపల్లి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆర్థిక సంస్కరణలకు అసలు సూత్రధారి… వెంకిట రమణన్ !!
  • జీనత్ అమన్‌కూ ‘తెహెల్కా’ తేజ్‌పాల్‌కూ ఏమిటి సంబంధం?!
  • బొద్దింకలు సజీవంగా, చురుకుగా ఉండాలట – రాజకీయాల్లోకి రావద్దట..!!
  • … అంటే నగరజనం కాలుష్యంలోనే బతకాలా మిస్టర్ కేటీఆర్ ?!
  • GOBARdhan ! పెట్రోల్‌లో ఇథనాల్‌లాగే- గ్యాస్‌లో బయో CNG మిక్స్ !!
  • తొలి సినిమాతోనే మంచి పేరు ! ప్చ్, రిక్షా తోలుకుంటున్నాడు !!
  • Self Editing … అదే యూట్యూబర్లు అయితే దుమ్మురేపేవారు…
  • Peak Detailing – దురంధర్ అంత తేలికగా అద్భుతాన్ని సృష్టించలేదు !!
  • సూర్య ! ఇప్పుడిక తనకు పోటీ లేదు – మరో రేంజుకు ‘మార్కెట్ వాల్యూ’..!!
  • ఎఐ సొంతంగా దొంగ దారులూ వెతుకుతోంది.. మరో ముప్పు !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions