.
ఒక సమన్వయ కమిటీ వేశాం, ఇకపై ప్రభుత్వం ఏం చేయాలనుకున్నా ఈ కమిటీ అనుమతి తప్పనిసరి… 45 రోజులకోసారి భేటీ… ఇదీ మొన్న ఢిల్లీలో కమిటీ తొలి మీటింగు తరువాత మీడియాకు వెల్లడి… పీసీసీ అధ్యక్షుడే చెప్పాడు…
2. అబ్బే, పెద్ద గ్యాప్ ఏమీ లేదు, పార్టీకి- ప్రభుత్వానికి నడుమ అన్నదమ్ముల పంచాయితీ, అంతే… ఇదీ మంత్రి పొంగులేటి వ్యాఖ్య నిన్న… అంటే ఏదో ఓ స్థాయిలో పంచాయితీ ఉందనే లెక్క…
Ads
3. నేను ఎప్పుడూ రాహల్‌తో టచ్‌లోనే ఉన్నాను, నాకంటూ ఓ పొలిటికల్ డిజైన్ ఉంది, నవంబరులో వెల్లడిస్తా… ఇదీ జగ్గారెడ్డి వ్యాఖ్య… ఓహో, ఏదో పెద్ద ప్లానులో ఉన్నాడన్నమాట…
4. మంత్రి పదవి ఇవ్వకుంటే నేరుగా సీఎం అవుతా, నేను ఫైటర్‌ను… కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యాఖ్య… ప్రభుత్వంతో సంబంధం లేకుండానే వ్యవహారాలు, సమీక్షలు…
5. మంత్రి సురేఖకూ ఇతర మంత్రులకూ నడుమ లొల్లి… దళిత ఎమ్మెల్యేలకు- కోమటిరెడ్డి బ్రదర్స్‌కూ నడుమ పంచాయితీ…
6. మా నియోజకవర్గంలో అంతా నేనే అని చెప్పుకునే ధోరణికి చెల్లు,, 40 వేల మందితో మీనాక్షి సేన… ఇక అంతా ఆమె చెప్పుచేతల్లోనే, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యం… ఆంధ్రప్రభలో ఓ వంట కథనం… ఈమె ఎప్పుడు ఓ అనుమానాస్పద కేరక్టరే, అప్పట్లో సొంతంగా పాదయాత్ర ఎందుకు చేసిందనేది అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాల పరిశీలకులకు కూడా అంతుపట్టనంత మిస్టరీ… ఆమెకు సొంత ప్రజాదరణ దేనికి..? తెలంగాణలో పోటీచేస్తుందా..? హైకమాండ్‌లో ఎవరు ఆమెను ఎవరిమీద అస్త్రంగా ప్రయోగిస్తున్నారు..?
7. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ, రాజ్యసభ సభ్యత్వం గోవిందా… ఆమెపై తెలంగాణలోనే ఓ కేసు, ఆ కేసు వివరాలు బయటపెట్టింది తెలంగాణ కాంగ్రెస్ నేతలేనని బీజేపీ వెటకారపు నవ్వు…
8. కొన్ని శాఖల్లో ముఖ్యమంత్రి వేలు పెట్టడానికి వీల్లేకుండా హైకమాండ్ షరతులు… అసాధారణం… మరిక ముఖ్యమంత్రిత్వం దేనికి..?
9. పెట్టుబడుల పేరిట రేవంత్ రెడ్డి ఓ సుదీర్ఘ విదేశీ ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు… విసిగిపోతున్నట్టున్నాడు…
10. నామినేటెడ్ పోస్టుల భర్తీ, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, ఖాళీల భర్తీ అన్నీ ఇక పెండింగ్…
………. ఇలా చాలా ఉన్నయ్… ఇవి శాంపిల్స్ మాత్రమే… కాంగ్రెస్ పార్టీని ఎవరూ హతమార్చనక్కర్లేదు… బీఆర్ఎస్, బీజేపీ రహస్య సంసారం కూడా అక్కర్లేదు… కేసీయార్‌కు ఇది తెలుసు, అందుకే ఫామ్ హౌజ్ వీడి రావట్లేదు, ఈ కాంగ్రెసోళ్లే మళ్లీ తనకు అధికారం అప్పగిస్తారని ధీమా… కాంగ్రెస్ ఎప్పుడూ హరాకిరీ బ్యాచ్… పైన చెప్పిన ఉదాహరణలన్నీ ఆ కోవలోనివే…
గోకి, గోకి, తనే గాయాలపాలు కావడం కాంగ్రెస్ హైకమాండ్‌కు అలవాటే… కానీ నష్టం ఏమిటంటే..? కేరళలో సొంత ప్రభుత్వం కాదు, అది పలు పార్టీల కిచిడీ… దాన్ని వదిలేస్తే… కొత్తగా డీకే శివకుమార్‌కు పగ్గాలు ఇచ్చిన కర్నాటకలో పార్టీ సిట్యుయేషన్ ఏమీ బాగా లేదు… ఉన్నది పదిలంగా ఒక్క తెలంగాణ మాత్రమే, దాన్నీ చేజేతులా దెబ్బతీసుకునే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు రాహుల్ గాంధీ…
నిష్ఠురంగా ఉన్న నిజం ఇదే… పైన చెప్పిన ఉదాహరణలే గాకుండా, చాలా పరిణామాల్ని జాగ్రత్తగా డాట్స్ కలుపుతూ, క్రోడీకరించుకుంటే… చేజేతులా కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణలో పార్టీని, ప్రభుత్వాన్ని ముళ్ల కొరడాతో కొట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది…
ఒక్కసారి గమనించండి… పెద్దలు జానారెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డిల హయాంలో పార్టీని కేసీయార్ ఎంత తొక్కాడో గుర్తుందా..? అసలు ఇది ఇక మళ్లీ లేస్తుందా అనే సంక్షోభం… రేవంత్ నాయకత్వమో, కేసీయార్ స్వీయ భ్రష్టత్వమో జనం కారును ఓటమి లోయలోకి తోసేసి, కాంగ్రెస్‌ను పీఠం ఎక్కించారు… అదీ అంతగా బలమైన మెజారిటీ ఏమీ కాదు…
ఈ స్థితిలో రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కాదు కదా… కాళ్లల్లో కట్టెలు పెట్టేస్తున్నారు… ఎంచక్కా అనుకూలంగా ఉన్న స్థితిని బీఆర్ఎస్- బీజేపీ అక్రమ సంబంధం వైపు కాంగ్రెసే నెట్టేస్తోంది… పోనీ, ఆ మీనాక్షి నటరాజన్‌కే సీఎం పోస్ట్ ఇవ్వకపోయారా..? కథ అటో ఇటో తేలిపోతుంది… మా పెద్ద దొర బయటికి వస్తాడు వికటంగా నవ్వుతూ..!!
Share this Article