Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శనార్తి ! నాగదుర్గ సినిమా టైటిల్ ఇది ! స్వచ్ఛమైన తెలంగాణ పలకరింపు !!

August 14, 2026 by M S R

.

మొన్న నాగదుర్గ, అఖిల్ రాజ్ కలిసి కొమురవెల్లి దేవస్థానానికి వెళ్లారు, వారి నడుమ ప్రణయం ఉంది, ఆల్ ది బెస్ట్ అని చెప్పుకుంటూనే… ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు అని కూడా ముచ్చటించాం కదా… అవును, ముహూర్త పూజ జరిగింది… ఆ ఇద్దరే జంట… సినిమా పేరు శనార్తి… అవును, శనార్తి..,

ఇదీ అచ్చమైన తెలంగాణ పదమ… మొన్న ఇడుపు కాయితం అనే నాగదుర్గ మరో సినిమా టైటిల్ బయటపడగానే కొందరు రాద్ధాంతం చేయబోయారు… అదీ అచ్చమైన తెలంగాణ పల్లె వ్యవహారికం… ఈ శనార్తి గురించీ చెప్పుకుందాం…

Ads


శనార్తి అంటే..? తెలంగాణ మాండలికంలో నమస్కారం లేదా వందనం అని అర్థం… ఇది చాలా స్వచ్ఛమైన, ఆత్మీయ పలకరింపు పదం… నిజానికి ఇది శరణార్థి అనే పదం నుంచి వచ్చింది… అంటే శరణు కోరేవాడు లేదా రక్షణ కోరేవాడు అని… కాలక్రమేణా తెలంగాణలో ఎదుటివాడిని గౌరవించడానికి, విధేయత చూపడానికి ఈ పదాన్ని విరివిగా వాడటం మొదలైంది…

ఎవరినైనా కలిసినప్పుడే కాదు… తెలంగాణ టీవీల్లో, మీటింగుల్లో కూడా శనార్తులు అని ప్రారంభించడం కూడా ఓ మంచి ఆనవాయితీ… అది అణకువను చూపే పదం… సమాజం పట్ల, జనం పట్ల..!

ఇదీ ఎలా ఉంటుందటే… అందరికీ శనార్తి అంటే అందరికీ నమస్కారం అని… పెద్దల్ని కలిస్తే ‘చిచా, శనార్తి, కాకా, శనార్తి, తాతా, శనార్తి… అంటే బాబాయ్, తాతా మీకు నమస్కారం అని చెప్పడం… సమూహాన్ని సంబోధించాలని అనుకున్నప్పుడు బహువచనంలో శనార్తులు అంటారు…

ఇప్పుడు టీవీ సీరియల్స్, వెబ్ సీరీస్, సినిమాల్లో కూడా ఈ పదాన్ని వాడుతున్నారు… అంటే, తెలంగాణ మాండలికాన్ని మరిచిపోతున్న తరానికి పునఃపరిచయం చేయడం అన్నమాట… ఈ నేపథ్యంలో ఒక సినిమాకు, అదీ తెలంగాణ నేపథ్యమున్న కథకు ఈ శనార్తి పదం చాలా ఆప్ట్…

బలగం, బాసింగం ఎట్సెట్రా పదాలూ అవే… సరే, ఎలాగూ వివరంగానే చెప్పుకుంటున్నాం కదా… మరి దేవుళ్లకు..? ఇదే పదం, ఇంకాస్త ఆధ్యాత్మికతను కనబరుస్తూ శరణాగతి అని వ్యక్తీకరిస్తుంది… అంటే ఆధ్యాత్మిక కోణంలో దేవుడా, నువ్వే నాకు దిక్కు, నువ్వే కాపాడు, నా భారం ఇక నీదే అని దేవుడికి సరెండర్ అయిపోవడం…

అయ్యప్ప నినాదాల్లో, గీతాల్లో స్వామి శరణం, అయ్యప్ప శరణం అని వింటాం కదా… ఇదే అది, అదే ఇది… గుడికి వెళ్లి ఓ శనార్తి పెట్టుకుని రాపో అని ఎవరికైనా చెబితే… వెళ్లి మొక్కి, ఓ దండం పెట్టిరా అని సూచించడం అని అర్థం… ఈ టైటిల్ ఎవరు పెట్టారో గానీ, నీకు శనార్తులు తమ్మీ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శనార్తి ! నాగదుర్గ సినిమా టైటిల్ ఇది ! స్వచ్ఛమైన తెలంగాణ పలకరింపు !!
  • Makutam ! ఓ సోది కథ – నరుకుడు, దంచుడు… పాపం, విశాల్ !!
  • Agadha ! రాజు గారూ… మరోసారి సారీ..! తమరు నిర్మాతగానే బెటర్ !!
  • Batwara 1947 – ఆ చరిత్రను గుర్తుచేసింది – కదిలించలేక పోయింది !!
  • Dirty – Hug Politics …! మరో మెట్టు జారిపడిన రాహుల్ గాంధీ !!
  • ఓం పురి ! ఎల్లలు దాటిన నటన ! ఇండియన్ సినిమా శిఖరం !!
  • కేసీయార్ వాటర్ బ్లండర్స్ ! రేవంత్ రెడ్డి రిపేర్లు !!
  • మొన్న ధర్మేంద్ర ప్రధాన్ – నిన్న నితిన్ గడ్కరీ – నేడు నిర్మలా సీతారామన్ !!
  • Viswanath & Sons – కమర్షియల్ మసాలా ట్రెండ్ల నడుమ- ఫీల్ గుడ్ మూవీ…
  • సలాం రాకీ భాయ్..! యశ్ జీవితమూ ఓ సినిమా స్పూర్తి కథే!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions