Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

5 స్టార్స్ !! రామాయణకు ఈ ప్రముఖ విశ్లేషకుడి అసాధారణ రేటింగ్ !!

November 1, 2026 by M S R

.

OneWordReview… Ramayana: అద్భుతం (SPECTACULAR). రేటింగ్: ⭐️⭐️⭐️⭐️⭐️
జైశ్రీరామ్… ఇండియన్ తెరపై ఇంతటి వైభవోపేతమైన దృశ్యాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు… స్థాయి, విజువల్స్, భావోద్వేగాలు, మరియు ఆత్మ – రామాయణలో అన్నీ ఉన్నాయి… నిజంగా ఒక అద్భుతమైన సినిమా అనుభూతి. #RamayanaReview

కోట్లాది మంది హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న, కాలపరీక్షను తట్టుకుని నిలిచిన పవిత్ర ఇతిహాసానికి రామాయణ న్యాయం చేయగలిగిందా?… సమాధానం… ఒక పే-ద్ద అవును…

Ads

దర్శకుడు నితేష్‌తివారీ మన భారతీయ సంస్కృతి వైవిధ్యాన్ని, మంచిపై చెడు సాధించే శాశ్వత విజయాన్ని చాటిచెప్పే ఒక సినిమా కావ్యాన్ని అందించాడు… పకడ్బందీ స్క్రీన్‌ప్లే, ఆకట్టుకునే కథనం మిమ్మల్ని చివరి వరకు సీట్లకు కట్టేస్తాయి.

అదిరిపోయే విజువల్స్, అద్భుతమైన స్థాయి మాత్రమే కాకుండా, సినిమాలోని ఆత్మ మిమ్మల్ని కట్టిపడేస్తుంది… ఆ భావోద్వేగ, ఆధ్యాత్మిక అనుసంధానమే రామాయణను ప్రత్యేకంగా నిలబెడుతుంది.

దృశ్య వైభవాన్ని భక్తి, డ్రామా, కదిలించే క్షణాలతో మేళవిస్తూ నిలిచే కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలు (స్పాయిలర్స్ లేవు) —
– బ్రహ్మ, రావణాసురుడి మధ్య ప్రారంభ సన్నివేశం, ఆ తర్వాత రావణుడు లంకపై తన హక్కును చాటడం.
– రామునికి, రాక్షసులకు మధ్య జరిగే అడవి పోరాటం.
– సీతా స్వయంవరం.
– దశరథ మహారాజు, కైకేయి, శ్రీరాముడి మధ్య వచ్చే అత్యంత భావోద్వేగ భరితమైన ఇంటర్వెల్ ముందు భాగం.
– రావణాసురుడికి , అతని బావమరిది విద్యుజ్జీవుడి మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్. – శూర్పణఖ ఎపిసోడ్. – పుష్పక విమానంపై రావణుడు – జటాయువుల పోరాటం.

ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటలు, కథనంలో లీనమైపోయి సినిమా మూడ్‌ను, భావోద్వేగాలను మరింత పెంచుతాయి.

హాన్స్ జిమ్మర్ మరియు ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది… ఇది డ్రామాను ఎలివేట్ చేస్తూ, భావోద్వేగాలను తీవ్రతరం చేస్తూ, కథాంశానికి ఒక గొప్ప విశాలమైన రూపాన్ని ఇస్తుంది.

అకాడమీ అవార్డు గ్రహీత, విజువల్ ఎఫెక్ట్స్ పవర్ హౌస్ డీఎన్‌ఈజీ (DNEG) తమ అసాధారణ పనితనంతో మార్కులు కొట్టేశారు… వారు ప్రమాణాలను పెంచుతూ, ఇండియన్ తెరపై ఇప్పటివరకు చూడని అత్యంత అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించారు.

స్థాయి, ఇంటెన్సిటీ, స్పెక్టాకిల్‌ను మిళితం చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రత్యేక ప్రశంసలు అందుకుంటాయి… ప్రొడక్షన్ డిజైన్ కూడా అంతే అద్భుతంగా ఉండి, గ్లోబల్ సినిమా స్థాయికి దీటుగా నిలిచే ఒక ప్రపంచాన్ని సృష్టించింది.

రణ్‌బీర్ కపూర్ అద్భుతమైన నటనను కనబరిచారు, పాత్రను హుందాతనం, గౌరవం, నిశ్శబ్ద బలంతో చిత్రించారు… అతని ప్రశాంతమైన ప్రవర్తన, భావగర్భిత కళ్లు, అలవోకగా కనిపించే స్క్రీన్ ప్రెజెన్స్ పాత్రకు దైవిక తేజాన్ని తెచ్చిపెట్టాయి.

సాయిపల్లవి తన పాత్రకు గౌరవాన్ని, బలాన్ని తీసుకొచ్చారు, ఆమె సహజమైన నటన భావోద్వేగ సన్నివేశాలకు సున్నితత్వాన్ని, వెచ్చదనాన్ని ఇస్తుంది.

యష్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు… ఆయన ఉనికి, భయపెట్టే ఇంటెన్సిటీ విలన్ పాత్ర కోరుకునే అసాధారణ స్థాయిని తెచ్చిపెట్టాయి.

రవి దూబే చాలా బాగా నటించారు… ఆయన పాత్రకు అంకితభావం, సిన్సియారిటీని తీసుకువచ్చారు… ఆయన నిజాయితీతో కూడిన నటన పాత్రను ఎంగేజింగ్‌గా మారుస్తుంది.

రకుల్‌ప్రీత్ ఫస్ట్ రేట్‌లో ఉన్నారు, కచ్చితంగా ప్రభావం చూపేలా నటించారు.

ramayan

మొదటి భాగంలో సన్నీదేయోల్ ఉనికి గురించి చాలా చర్చ జరిగింది… నేనేం ఇక్కడ రివీల్ చేయట్లేదు – సినిమా చూసి తెలుసుకోండి!

అరుణ్‌ గోవిల్ సరైన ఎంపిక… ఇన్నాళ్ల తర్వాత ఆయనను బిగ్ స్క్రీన్‌పై చూడటం చాలా ఆనందంగా ఉంది.

శోభన అద్భుతం… లారాదత్త సూపర్‌బ్… వివేక్ ఒబెరాయ్ తన ఉనికిని చాటుకున్నారు… షీబా చద్దా ప్రభావవంతంగా ఉన్నారు… అజింక్య డియో సాలిడ్.

చివరి మాట? రామాయణ కేవలం ఒక సినిమా కాదు… ఇట్స్ యాన్ ఎక్స్‌పీరియన్స్, భారతదేశం గర్వపడే చిత్రం… ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను కట్టిపడేసే అద్భుతమైన సినిమా విజయం… వీలైనంత పెద్ద స్క్రీన్‌పై చూడండి!

అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా స్కేల్, విజువల్ గ్రాండియర్, టెక్నికల్ ఎక్సెలెన్స్‌తో కూడిన సినిమాను వెనుకండి నడిపించిన నమిత్ మల్హోత్రా ప్రత్యేక అభినందనలకు అర్హులు.
రామాయణ రెండో భాగం కోసం ఇప్పుడే ఎదురుచూడటం మొదలుపెట్టాను, ఇది దీపావళి 2028లో విడుదల కానుంది…

  • (ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ రామాయణ మీద వెలువరించిన విశ్లేషణ- సమీక్ష ఇది… నిజానికి ఇందులో నిశిత సమీక్ష లేదు, జస్ట్ ఆహా ఓహో మెచ్చుకోళ్లు తప్ప… ఆసక్తిగా కనిపించి, నవ్వు కూడా వచ్చిన అంశం… ఆయన అయిదుస్టార్లకు గాను అయిదుస్టార్ల రేటింగ్ ఇవ్వడం…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 5 స్టార్స్ !! రామాయణకు ఈ ప్రముఖ విశ్లేషకుడి అసాధారణ రేటింగ్ !!
  • A Journalist’s Journey Through Two Eras of Reporting
  • ఒక డోరతీ… కొంచెం సమీక్ష.. బోలెడు సైన్సూ…
  • మన పేదరికం నిజంగా తగ్గిందా..? జబ్బలు చరుచుకుందామా..?
  • ఒక సరస్వతీ పుత్రుడు – ఒక సరస్వతీ పుత్రిక – ఓ అదర్శ కుటుంబం !!
  • పగులుతున్న పాపాల పుట్టలు – బీఆర్ఎస్ క్యాంప్ హఠాత్తుగా సైలెంట్
  • ఎఐ కొలువుల్నే కాదు, ప్రాణాలనూ తీయగలదు… బహుపరాక్…
  • ఫ్లూ వేక్సిన్ అనగానే… చిన్ననాటి మశూచి టీకాలు, పుండ్లు గుర్తొచ్చాయి…
  • మరీ ‘ఆదర్శ’ కుటుంబం కాదు గానీ… ఏదో సంసారపక్షంగా నడిపించేశారు!
  • అటు నోటి దూలతో నెగెటివిటీ – ఇటు మహర్దశ కూడా నడుస్తోంది

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions