Bharadwaja Rangavajhala……… ఇల్లాలి ముచ్చట్లు ….( పునః ) – పురాణం సీత గారు 2. O
అనుకుండూండగానే ఎలక్సన్ ఇయర్లోకి వచ్చేశాం … ఎవరు గెలుస్తారు …
ఎలా గెలుస్తారు …
Ads
బ్లడీ డిస్కషన్స్ …
కిచెన్లోనూ అవే … డైనింగ్ టేబుల్ దగ్గరా అవే … ఫేస్బుక్లోనూ … టీవీల్లోనూ … ఆల్ సోషల్ అండ్ సైన్స్ మీడియా అంతటా …
వాటీజ్ సైన్స్ మీడియా అంటారా …
టీవీలూ పేపర్లూ ఎక్సెట్రా ఎక్సెట్రా అండీ …
నథింగ్ స్పెసిఫిక్ … దాన్ని సోషల్ అంటున్నారు కాబట్టీ … దీన్ని సైన్స్ అంటున్నాను … అంతే …ఓకే కమ్ టూద పాయింట్ …
ఎక్కడైనా ఇప్పుడు నడుస్తున్నదంతా ఎలక్షనీరింగ్ డిస్కర్షన్స్యే …
ఎలక్షనంటే చాలు మా ఫార్మేటివ్ డేస్లో మా ఫాదర్ తెగ ఖంగారు పడిపోయేవారు…
బికాజ్ ఆయన ఓ హైస్కూలు హెడ్మాస్టర్ ..
మా అమ్మ మా బట్టల పెట్టుకునే ట్రంకు పెట్టెలు కూడా ఖాళీ చేసివ్వాల్సి వచ్చేది …
మా నాన్న వాటిని పట్టుకెళ్లి మళ్లీ ఎలక్షన్స్ అయ్యాక తెస్తే తెచ్చేవారు లేకపోతే లేదు…
అంత గవర్నమెంటు బోడి ట్రంకు పెట్టెలు కొనుక్కోలేదా అంటే మా నాన్నగారు నవ్వేసేవారు…
ఇప్పుడూ మా అక్క తెగ బాదరైపోతుంటూంటుంది …
ఎలక్షన్ అనగానే … దానికి చెమటలు పట్టేస్తాయి…
బికాజ్ అదీ టీచరే …
ఇక మా మూడో బావగారైతే … చెప్పనే అక్కర్లేదు… టెన్సన్ టెన్షన్ అయిపోతూంటారు…
ఎలక్షన్ అనగానే.. మీటింగులూ … .బందోబస్తులు ఓహ్ ఆయన ఎలక్షనయ్యే వరకు దొరకరు…
ఇక మా ఆయనైతే …
కొత్త ప్రభుత్వం స్వార్న్ఇన్ అయ్యే వరకూ అంతా తానే చూసుకోవలన్నంత హడావిడి చేసేస్తూంటారు… బికాజ్ ఆయన వర్కింగ్ ఇన్ మీడియా కదా …
ఇక టీవీ చూడు …
పేపర్ చూడూ …
రోడ్డు మీదకు వెళ్లూ ఎఫ్బీ తెరూ … అన్నీ ఎలక్షన్ వార్తలే .. వాడు హామీలు నెరవేర్చలేదంటే వాడు హామీల్నెరవేర్చలేదని …
బ్లడీ కదా …
ఎవరైనా ఎలా నెరవేరుస్తారు ..
కష్టం కదా…
దేహావ్ దెయిర్ ఓన్ ప్రాబ్లమ్స్ …
మా పనమ్మాయి తన కూతురికి ఓ పట్టు లంగా కొనిపెడతానని మా ఇంట్లో పనికి చేరినప్పట్నించీ చెప్తోంది…
అందుకోసం బోల్డు సార్లు అడ్వాన్స్ కూడా తీసుకుంది …
బట్ ఆ ప్రాబ్లమ్ అలానే ఉంది…
ఏమిటే అంటే ఏదో ఖర్చమ్మగోరూ అంటుంది…
దాని కూతురేమో కనిపించినప్పుడల్లా మా అమ్మ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటుంది…
పాపం …
పోస్ట్ ఎలక్షన్ సినేరియా కాదు గానీ …
ప్రీ ఎలక్షన్ సినేరియా అంతా భలే హాట్ హాట్ గా ఉంటుంది కదా …
… ఆఫ్టర్ కౌంటింగ్ అంతా సైలెన్స్ అనుకోండి …
అయితే ఈ ఎలక్షన్ ప్రాసెస్ లోనే …
వాడు ఓట్లు కొంటున్నాడనీ ..
వీడు డబ్బులు పంచుతున్నాడనీ …
అక్కడ ఓట్లింత పలుకుతున్నాయనీ ….
ఇక్కడ ఇంత చెప్తున్నారనీ ..
అదో పెద్ద గొడవ …
మరో వైపు ఇందాక నేన్జెప్పా కదా …
మా పనిమనిషి సారీ దానికీ ఓటుంది …
కనుక పేరు అనివార్యంగా ఉంది …
దాని పేరు మహాలక్ష్మి …
అఫ్కోర్స్ అది రోజూ లక్ష్మి కోసం దేవులాడుతూనే ఉంటుందనుకోండి …
దేవులాట … అద్భుతమైన తెలుగు పదం… ఇలాంటి పదాలు పడ్డప్పుడు అనిపిస్తుంది … మా ఆయనకన్నా నేనే మీడియాకు యాప్ట్ అని … పోన్లెండి … ఏం చేస్తాం…
ఇంతకీ నేన్జెప్పొచ్చేదేంటంటే …
మా పనిమనిషి మహాలక్ష్మి దంపతులు ప్రతి ఎన్నికలప్పుడూ ఓట్లమ్మి … పిల్లలందరికీ గుడ్డలు కొనేద్దామనుకుంటారు…
వచ్చే ఎన్నికల వరకు అడక్కుండా కొనేయాలనేది వాళ్ల ఆలోచన …
కానీ చాలా సార్లు కుదరదు..
అందుకని మనం ఎంత హిపోక్రటిక్ గా … ఓట్లు అమ్ముకోకూడదూ అనుకున్నప్పటికీ … జరుగుతున్నదదే కాబట్టీ …
అక్కడే ఒక బెటర్ వే ఎంచుకోవాలనేది నా ఐడియా …
అదేంటంటే …
ఓటుకు గిట్టుబాటు ధర కావాలి ….
యస్ … అన్నిటికీ గిట్టుబాటు ధర ఉన్నప్పుడు ఓటుకు ఎందుకు ఉండకూడదు…
ఎలక్షన్స్ ని హండ్రడ్ పర్సంట్ ట్రాన్సపరెంట్ గా జరిపే ఓ మెథడ్ నా మెదడు లో చాలా కాలంగా ఉంది … అది మీతో షేర్ చేసుకోవాలనేది నా ఒరిజినల్ ఐడియా …
జాగ్రత్తగా వినండి … లిజన్ కాన్షస్లీ
ఇప్పుడూ …
ఇప్పుడున్న సిస్టమ్ లో అయితే ఓట్లమ్మి కనీసం ఉల్లిపాయలు కూడా కొనుక్కోలేం …
అట్టాటిది మా మహాలక్ష్మి అప్పులు తీర్చుకోవాలనీ … బట్టలు కొనుక్కోవాలనీ ఏమిటేమిటో కలలు కంటుంది..
ఎలా కుదురుతుంది…
ఎలక్షనంటే పార్టీలకే కాదు …
ఓటర్లకూ లాభం ఉండాలనేదే మన కాన్సెప్టు …
ఉండడమేమిటి … ఉండి తీరాలంతే …
బికాజ్ విఆర్ ఓటర్స్ …
అలాన్నమాట …
నా ఉద్దేశ్యంలో …
ప్రతి అసెంబ్లీ , పార్లమెంటు నియోజకవర్గాన్ని నాలుగు లేక ఐదు డివిజన్లుగా విడగొట్టాలి.
విడగొట్టి …
ఎక్కడికక్కడ ఓటు ధర నిర్ణయ కమిటీలు పెట్టాలి.
ఆ కమిటీలు స్థానిక ప్రజల అవసరాలు పరిస్థితులు పార్టీల ప్రయారిటీలు క్షుణ్ణంగా పరిశీలించి ఓటుకు సముచితమైన నాట్ ఉచితమైన … ధర నిర్ణయిస్తాయి …
రేటు నిర్ణయించిన తర్వాత అన్ని పార్టీల వాళ్లనీ పిల్చి … ఆ రేటు మీద వేలంపాట పెడతారు.
ఎవరు ఎక్కువ రేటుకు కొనుక్కుంటే అతనే ఆ డివిజన్లో గెలిచినట్టు ..
ఇట్టా నాలుగు డివిజన్లలోనూ జరిగే వేలం పాటల్లో ఎవరైతే కనీసం మూడు డివిజన్లలో నెగ్గుతారో వాళ్లే … ఎమ్మెల్యేలో ఎంపీలో అవుతారు …
ఇక వేరే ఎలక్షనే అవసరం లేదు…
ఎలక్షను కమీషనే రద్దు చేయచ్చు …
అంతే కాదు ఎలక్షను కోసం బళ్లకు సెలవులివ్వక్కర్లేదు.
టీచర్లకి డ్యూటీలేయక్కర్లేదు …
పోలింగు అప్పుడూ …
కౌంటింగప్పుడూ పోలీసోళ్లకి అదనపు డూటీలక్కరలేదు …
లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కాదు..
పార్టీలు పంపిన డబ్బులు సరిగా పంచుతున్నారా లేదా అని ఖంగారు పడాల్సిన పని లేదు …
అంతా పారదర్శకమే … ఫుల్ ట్రాన్స్పరెన్సీ…
ఓటు ఎంత పలుకుతోందో ఓటరుకు తెల్సిపోతుంది … పాడుకున్న పార్టీల వాళ్లు నేరుగా కమిటీ అక్కౌంటులో డబ్బులు జమ చేస్తారు …
కమిటీ తన పరిధిలో ఉన్న ఓటర్ల అక్కౌంట్లలోకి వాటిని తక్షణం బదిలీ చేసేస్తుంది …
దట్సాల్
అద్భుతంగా ఉంది కదా…
ఇదే ఐడియా మా మహాలక్ష్మితో చెప్తే …
ఆ రోజులొస్తాయా అమ్మగారూ అని కళ్లు తుడుచుకుంది…
మనందరం కల్సి ప్రభుత్వం మీద పోట్లాడైనా ఆ రోజుల్సి తీసుకురావాల్సి ఉంటుంది…
ఓకే … అవతల పొయ్యి మీద ఏదో మాడుతున్నట్టుంది …
ఓకే … ఓకే .. నెక్ట్స్ టైమ్ మరో ఇంట్రస్టింగ్ టాపిక్ తో మళ్లీ కలుస్తా …
ఉంటానే… మళ్లీ కూర మాడితే మా ఆయన తిడతారు…
(పురాణం గారి ఇన్సిపిరేషన్ తో )
Share this Article