Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హాస్పిటల్ కూల్చి 500 మందిని బలిగొన్న ఆ దారుణం ఎవరి పని..?!

October 19, 2023 by M S R

గాజా లోని అల్ అహ్లి హాస్పిటల్ మీద IDF దాడి చేసిందా?

వివరాలలోకి వెళితే కాదు అనే సమాధానం వస్తుంది!

ఇస్లామిక్ టెర్రర్ ఔట్ ఫిట్స్ ఎప్పుడూ చేసే పనినే ఇప్పుడూ చేస్తున్నాయి!

Ads

******************

1.గాజాలో హమాస్ స్థావరాలు సాధారణ ప్రజలు నివసించే ఇళ్ల కింద బేస్మెంట్స్… అవి నిర్మించి అందులో ఉండి రక్షణ తీసుకుంటారు.

2.దాడి చేయాలనుకున్నప్పుడు బేస్మెంట్ నుండి బయటికి వచ్చి దాడి చేసి వెంటనే బేస్మెంట్ లోకి వెళ్లిపోతారు.

3.స్కూళ్ళు, హాస్పిటల్స్ కింద కూడా బేస్మెంట్స్ ఉంటాయి. అవి పెద్దవిగా ఉంటాయి కాబట్టి రాకెట్ తయారీ అంతా అక్కడే చేస్తారు.

4.ఇళ్ళు, స్కూల్స్, హాస్పిటల్స్ మీద ఇజ్రాయెల్ దాడి చేయదు కాబట్టి హమాస్ కి అవి సురక్షిత స్థావరాలు!

5.హమాస్ తయారు చేసేవి మిసైల్స్ కాదు. రాకెట్లు మాత్రమే. మనం దీపావళికి కాల్చే రాకెట్స్ లాంటివి ఇవి సైజులో పెద్దవి అంతే!

6.దీపావళి రాకెట్లు ఎలా అయితే కొన్ని నేరుగా ఆకాశంలోకి వెళ్లి పేలిపోతాయో హమాస్ రాకెట్లు కూడా అంతే! కాకపోతే 45 డిగ్రీల కోణంలో ఉండే స్టాండ్ మీద నుండి ఫైర్ చేయడం వలన అవి ఏటవాలుగా ప్రయాణిస్తుంటాయి.

7.హమాస్ చేసే రాకెట్లు వాటి కేసింగ్ కోసం ఏవి దొరికితే వాటిని ఉపయోగించడం వలన అవి అన్నీ ఒకే విధంగా ప్రయాణించవు. లోపల ఉండే ఇంధనం మండడం వలన కేసింగ్ కరిగిపోయి కొద్ది దూరం వెళ్ళగానే కూలిపోతాయి.

8.హమాస్ 100 రాకెట్లు ఫైర్ చేస్తే వాటిలో 30 గాజా లోనే ఇళ్ళమీద కూలిపోతూ ఉంటాయి.

9.IDF గాజాలోకి ప్రవేశించి ప్రతి ఇంటీని చెక్ చేస్తున్నాయి.అందుకే హమాస్ తీవ్రవాదులు ఇళ్ళు, స్కూళ్ళు,హాస్పిటల్స్ ని ఖాళీ చేసి గాజా భాగంలో ఉన్న మధ్యధరా సముద్ర తీరానికి వెళ్లిపోయారు.

10.బీచ్ దగ్గర ఉన్న ఇళ్ల దగ్గర నుండి బయటికి వచ్చి బీచ్ నుండి రాకెట్లని ఫైర్ చేసి వెళ్లిపోతున్నారు.

11.బీచ్ నుండి ఫైర్ చేయడంతో వాటిలో కొన్ని ఇజ్రాయెల్ భూభాగం చేరకుండానే గాజా లోని హాస్పిటల్ మీద పడ్డాయి!

************************

కొన్ని టెక్నీకల్ పాయింట్స్ ని ప్రస్తావిస్తాను. ఎయిర్ స్త్రైక్ కోసం జెట్ ఫైటర్స్ నుండి JDAM (Joint Direct Attack Munition) లేజర్ గైడెడ్ బాంబులని ప్రయోగిస్తారు. ఇవి విమానం నుండి నేరుగా నిర్దేశించిన ప్రాంతం మీద పడతాయి. JDAM లు పడిన చోట పెద్ద గొయ్యి ఏర్పడుతుంది. బిల్డింగ్ మీద పడితే అది కూలిపోతుంది. అలాగే పక్కనున్న భవనాలు కూడా దెబ్బతింటాయి.

మీరు ఇప్పటికే వీడియోలలో చూసి ఉంటారు ఇజ్రాయెల్ F-16 లు ప్రయోగించిన ఎయిర్ to సర్ఫేస్ గైడెడ్ మిసైల్స్ అపార్టుమెంట్స్ ని కూల్చిన దృశ్యాలని. గైడెడ్ మిస్సైల్స్ ని పక్కనున్న భవనాలు దెబ్బతినకుండా టార్గెట్ మాత్రమే కూలగొట్టడానికి వాడుతుంది ఇజ్రాయెల్. ఇవి నేరుగా అపార్ట్మెంట్ పునాదులని దెబ్బ తీయడం ద్వారా టార్గెట్ అపార్ట్మెంట్ ని కూలగొడుతుంది ఇజ్రాయెల్. గాజాలోని ప్రతి అడుగు ఇజ్రాయెల్ ఎప్పుడో geo మ్యాపింగ్ చేసిపెట్టుకుంది, కాబట్టి అల్ అహ్లి హాస్పిటల్ కూడా తన geo మ్యాపింగ్ లో ఉంది. ఒకవేళ అల్ అహ్లి హాస్పిటల్ ని కూల్చాలి అంటే గైడెడ్ మిస్సైల్ ని వాడుతుంది కానీ  గైడెడ్ JDAM బాంబుని వాడదు.

*****************

ఇరాన్ ఆరోపణ ఏమిటంటే MK84 1000 kg bomb ని ప్రయోగించింది ఇజ్రాయెల్ అని. కానీ MK84 1000 kg bomb (BLU 117 అని కూడా పిలుస్తారు) కనుక ఇజ్రాయెల్ ప్రయోగించి ఉంటే అది పడ్డ ప్రాంతంలో 50 మీటర్ల చుట్టుకొలతతో పెద్ద గొయ్యి ఏర్పడి ఉండేది మరియు 100 మీటర్ల ప్రాంతంలో ఉన్న భవనాలు పూర్తిగానో లేదా పాక్షికంగానో నివసించడానికి వీలు లేని విధంగా ధ్వంసం అయి ఉండేవి.

hamas

****************

1.ఫోటో (రెడ్ సర్కిల్స్ తో మార్క్ చేసింది) చూడండి. ఫోటో తీసింది BBC జర్నలిస్ట్. హాస్పీటల్ కిటికి అద్దాలు పగిలిపోయి ఉన్నాయి.

2.రోడ్ మీద చాలా చిన్న డామేజీ జరిగింది అది సహజంగా రోడ్ చెడిపోయినప్పుడు ఏర్పడే చిన్న గొయ్యి లాగా ఉంది తప్పితే బాంబు పడ్డ ఆనవాళ్లు లేవు.

3.ఒక కారు తిరగబడి కాలిపోయింది. అంటే హమాస్ రాకెట్ లోని ఇంధనం ఆ కారుమీద నేరుగా పడడం వలన అది తిరగబడి కాలిపోయింది కానీ హమాస్ రాకెట్ భూమిని తాకిన చోట ఏర్పడ్డదే ఆ రోడ్ డామేజీ!

4.మిగతా కార్లు కాలిపోవడానికి కారణం రాకెట్ లోని ఇంధనం వాటి మీద పడడం వలన.

5.పక్కనే ఉన్న బంగళా పెంకుల పై కప్పు చూడండి. అవి మూడు పెంకులు మాత్రం పక్కకి జరిగాయి.

5. డ్రోన్ ద్వారా తీసిన ఏరియల్ ఫోటో చూడండి ఎక్కడా ఒక్క కట్టడం కూడ డామేజీ అవలేదు. హాస్పిటల్ మీద ఉన్న సోలార్ ప్యానెల్స్ కూడా అలాగే ఉన్నాయి చెడిపోకుండా!

6.,మరో ఫొటోలో హాస్పిటల్ ముందు పార్కింగ్ దగ్గర కింద నల్లగా ఏదో మండితే ఏర్పడ్డట్టు మరకలు ఉన్నాయి. హమాస్ రాకెట్ల కోసం ఇరాన్ రిఫైనరీల నుండి పంపిన ఇంధనం మండిపోవడం వలన ఏర్పడిన గుర్తు అది. కానీ టైల్స్ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి.

******************

మానవ కవచాలని అడ్డుపెట్టుకొని సానుభూతి పొందడం అనేది ఇస్లామిక్ టెర్రర్ ఔట్ ఫీట్స్ దశాబ్దాలుగా చేస్తున్నదే! కానీ ఈసారి ఇరాన్ రక్షక పాత్రలో ఏదో చేద్దామని భంగపడ్డది! ఇక మన దేశ మీడియా అయితే అబద్ధాన్ని ప్రచారం చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది కదా… తెగులు మీడియా ఈ విషయంలో phd చేసింది!……. Article By … పార్ధసారధి పోట్లూరి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions