Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘కమ్మ’ అంటే తెలుసా? – ‘ఇడుపు కాయితం’ అసలు అర్థమేమంటే?

June 28, 2026 by M S R

.

ఎవడో ఓ క్షుద్రుడు సోషల్ మీడియాలో ‘ఇడుపు కాయితం’ మీద రచ్చ మొదలెట్టాడు. అది అంటుకుంది. మండింది. నిజానికి అది అచ్చమైన తెలంగాణ పదం. విడాకులకు సరైన తెలంగాణ పదం. అసలు ఇడుపు కాయితం అంటే ఏమిటి..? ఎలా పుట్టుకొచ్చింది..?

ఇదుగో… తెలంగాణ విజ్ఞుడు, పరిశోధకుడు, మేధావి Jayadhir Thirumal Rao సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న వివరణ…

Ads



·
విడాకులు, ఇడుపు కాగితం
****
ఈ రెండు పదాల వివరణ ఇక్కడ ఉంది. ముందుగా, ఈ పదాల అర్థాలను చూద్దాం. విడాకులు అంటే ఏమిటి? పూర్వకాలంలో తాళపత్రాలపై రాసుకునేవారు. తాళపత్రం అంటే తాటి ఆకు. ఈ ఆకుల మీద గంటం ( styllus) తో రాసేవారు. ఆనాడు రాతకు విలువ ఎక్కువ. నోటి మాటకు రుజువు ఉండదు. అందుకే శిలాశాసనాలకు, తాళపత్రాలకు గౌరవం ఉంది.

విడాకులు

పెళ్లి సమయంలో జరిగిన ఖర్చులు, కట్న కానుకలను రాసుకునేవారు. అప్పుడు డబ్బుకు బదులు బంగారం లేదా భూమిని ఇచ్చేవారు. దానికి సంబంధించిన పత్రాలు రాతలోనే ఉంటాయి. పెళ్లి జరిగి, అది నిలబడనప్పుడు, విడిపోవడం కూడా సహజం. దత్తతలు తీసుకున్నప్పుడు, భూమి కొన్నప్పుడు, భార్యాభర్తలు విడిపోయినప్పుడు రాసుకున్న పత్రాలు తాటి ఆకులపై రాసుకునే సంప్రదాయం ఉంది.

భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తి విడిపోయినప్పుడు ఎవరి తరపున రాసిన ఆకులను వారు తీసేసుకునేవారు. అలా విడిపోవడాన్ని ‘విడాకులు’ అన్నారు. ఇక ఇడుపు కాగితం అంటే, ఇడుపు అంటే విడుపు, విడిపోవడం.

రానురాను ఆకుల మీద రాసుకోవడం తగ్గిపోయి కాగితం మీద రాసుకోవడం మొదలైంది. తెలంగాణాలో 8 వందల ఏళ్ల నుండి కాగితం వాడకం మొదలైంది. హైదరాబాదులోని స్టేట్ ఆర్కైవ్స్‌లో పాత కాలం నాటి కాగితం డాక్యుమెంట్లు, చేత్తో తయారుచేసిన కాగితం గ్రంథాలు (పర్షియన్, అరబిక్, పస్తో భాష లిపులలో) లభిస్తాయి.

ఇడుపు కాయితం
తెలంగాణలో ఆకుల మీద రాసుకోవడం తగ్గి, కాగితం మీద రాసుకోవడం అధికమైంది. పెళ్లికి సంబంధించిన విషయాలను కాగితాలపై రాసుకునేవారు. పెళ్లి పెటాకులైనప్పుడు రాసుకున్న కాగితాలను విడివిడిగా పంచుకోవడం మొదలైంది. దానినే ఇడుపు చేయడం అని వాడుక.

తాటాకులను # కమ్మలు# అంటారు. ఆ కమ్మ శబ్దం పుట, పేజీకి పర్యాయపదంగా వాడతారు. కాగితాలను విడగొట్టి భార్యాభర్తలు దూరమైతే ‘ఇడుపు కాగితం’ అయ్యింది అని అంటారు. ఈ రెండు పదాలు తెలుగు పదాలే. ఏ ప్రాంతీయ మాండలికంలో ఉన్న పదాలనైనా గేలి చేయకూడదు. భాషా వైవిధ్యతను గౌరవించాలి.

సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఏదైనా మాట్లాడొచ్చు. కానీ తప్పుడు అర్థాలు చెప్పకూడదు. భాషను ఆ భాషను వాడే భాషను తక్కువ చూడకూడదు. భాష వ్యాప్తి, పదాల సృష్టి, వాటి వాడుక అనే అంశాలను గౌరవించాలి. విడాకులు అన్నా, ఇడుపు కాగితం అన్నా రెండింటి అర్థాలు ఒకటే. తెలుగు భాష ఒకటే, అందులో ఎవరి భాష వాళ్లకు తల్లి భాషే.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వేలాది అమాయక సిక్కుల ఊచకోత – ఆ దుర్జనుడు మరణించెను !
  • కంగనా – రాందేవ్ !… యవ్వనాలు, బెడ్‌రూంల దాకా లొల్లి !!
  • అనుబంధాల పలకరింపు కోసం ఓ ముసలి మనసు తన్లాట… అంతే…
  • తప్పు పైలట్లలో లేదు – బోయింగ్ విమానాల్లోనే లోపాలు- ప్రమాదాలు !!
  • ఆర్మీ జవాన్లు జెన్-జీ కాదా? ఈ పిల్లది మరీ ముదురు పైత్యం !!
  • అమిత్ షా కూర్చునే భంగిమ ! ఇలా చాలా ఈక్వేషన్లను పట్టిస్తుంది…!!
  • తెలంగాణ కాంగ్రెస్‌లో హరా‘కిరికిరి’ బ్యాచ్ ! సోయి లేని హైకమాండ్ !!
  • చిన్న అల్లుడు… ఇతరుల దర్శకత్వంలోనూ దాసరి నటించెను !
  • 4 వేల కోట్లు కాదు – 8 లక్షలు- 50 దేశాలు- మన తొలి పాన్ వరల్డ్ జెండా !!
  • భారం- ప్రేక్షకుడు ఇంకా దూరం- కూర్చున్న కొమ్మ నరుక్కునే టాలీవుడ్ !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions