Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బర్రెలక్కపై ఈ బురద దాడి దేనికి..? ఎందుకీ ఉలిక్కిపాట్లు, వ్యక్తిత్వంపై గాట్లు..?

November 26, 2023 by M S R

అనుకుంటున్నదే… ఊహిస్తున్నదే… బర్రెలక్క ఎప్పుడైతే బాగా పాపులర్ అయిపోయిందో… రాష్ట్ర సగటు నిరుద్యోగ నిరసనకు ఓ ఐకాన్ ఎప్పుడు అయిపోయిందో… అప్పుడే ఆమె వ్యక్తిత్వాన్ని దిగజార్చే కుట్రలు స్టార్టవుతాయని అనుకున్నదే… వాళ్లతోవీళ్లతో కాదు, ఏకంగా ఆమె తండ్రినే వెదికి పట్టుకుని నానా తిట్లూ తిట్టించాారు ఆమెను… కొన్ని మాట్లాడుకోవాలి…

ఆమె, ఆమె తల్లి ఆమె తండ్రితో కలిసి ఉండరు… తన మాటల తీరు చూస్తుంటేనే తనెలాంటి వాడో అర్థమవుతూనే ఉంది… వాళ్లు విడిగా బతుకుతుంటే వాళ్ల మానాన వాళ్లను వదిలేయకుండా ఏదో రాజకీయ పార్టీకి ఉపయోగపడటానికి బిడ్డను బూతులు తిట్టే తండ్రిని ఏమనాలి..? తన మాటలకు విలువెంత..? హఠాత్తుగా తెర మీదకు రావడం వెనుక ఏ కక్కుర్తి దాగి ఉంది..? ఎవడి ప్రయోజనం దాగి ఉంది..?

బర్రెలక్క

Ads

ఈ పెళ్లి కార్డు చూశారా..? బిడ్డ అంటే అంత ద్వేషమున్నా సరే, బిడ్డ పెళ్లి కార్డులు తన దగ్గర భద్రంగా ఉంచుకున్నాడట… పైగా ఆ కార్డు చూడండి… అతిథులు పేరు దగ్గర ‘‘మీ పేరు మా మదిలో ఉన్నది, మీకిదే మా హృదయ పూర్వక ఆహ్వానం’’ అని రాసి ఉంది… కాదు, ప్రింట్ చేసి ఉంది… ఆహ్వానితుల పేర్లు రాసే దగ్గర ఈ పైత్యం ఏ పెళ్లి కార్డు మీదైనా కనిపించిందా..? ఇంత హఠాత్తుగా ఆమె తండ్రి దగ్గరకు ఈ కార్డులు ఎలా వచ్చినయ్..?

తన వీడియోలో ఏమేం చెప్పిండనే లోతుల్లోకి పోనక్కర్లేదు… సో వాట్.. ఇంటింటి రామాయణం… ఏ ఇంట్లో గొడవల్లేవు… సో వాట్, విడిగా ఉంటోంది… సో వాట్, పెళ్లయింది… సో వాట్, విడిపోయింది… సో వాట్… ఇవన్నీ ఆమె ఎన్నికల్లో నిలబడటానికి అనర్హతలా..? ఈ అంశాల్లో ఆమె తప్పులేమిటి..? పోనీ, ఆమె తన ప్రచారంలో తన వ్యక్తిగత అంశాల్ని ఏమైనా చెబుతోందా..? సొసైటీకి నష్టమేమిటి..? ఆమె జనానికి చేసిన నేరమేమిటి..? ఏమీ లేదు కదా… మరి అలాంటప్పుడు ఆమె వ్యక్తిగత అంశాల్ని బజారుకు ఎందుకు లాగుతున్నట్టు..?

బర్రెలక్క

అసలు రాష్ట్రవ్యాప్తంగా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎందరికి లేవు ఇంటింటి గొడవలు..? అందరూ పెద్ద సత్తెపూసలైనట్టుగా ఈ దుష్ప్రచారం ఏమిటి అసలు..? తెలంగాణ ఉద్యమ మూలసూత్రాలు మూడు… నిధులు, నీళ్లు, నియామకాలు… ఆ నియామకాల తీరును ఆమె అభ్యర్థిత్వం ప్రశ్నిస్తోంది… ఆమె ప్రచారం కోసం చేస్తోంది, మస్తు పైసలు వస్తున్నయ్, సోషల్ మీడియా హైప్ మాత్రమే, అది వోట్లు తీసుకురాదు అనే నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు చాలామంది…

barrelakka

పోనీ, పడే వోట్లే పడతాయ్, ఈ ఉలిక్కిపాట్లు దేనికి మరి… ఆమెకు వోట్లు పడవు అనుకున్నప్పుడు ఈ బుదర జల్లుడు ప్రోగ్రాం దేనికి..? చాలా మంది స్వతంత్ర అభ్యర్థుల్లాగే అనామకంగా ఉండిపోతుందీ అనుకుంటే ఈ వెగటు దాడులు దేనికి..? ఆమెను వదిలేయండి అలా… ఆమెకు ఏం తెలుసు..? ఆమె తెలివి ఎంత అంటున్నారు కొందరు… ప్రజెంట్ సిట్టింగుల తెలివితేటలతో ఎలా పోల్చాలి మరి..? ఆమె డిగ్రీ జస్ట్ ఓపెన్ యూనివర్శిటీ అట… ఐతేనేం… మన మల్లారెడ్డి చదువెంత..? ఏటా వేల మందికి పట్టాలు ఇస్తున్నాడు కదా…

బర్రెలక్క

వోకే, ఆమె ప్రచారం కోసమే ఈ ప్లాన్‌లో ముందుకు పోతున్నదీ అనుకుందాం, లక్షలు వస్తున్నయ్, కార్లు వస్తున్నయ్… సో వాట్… ఆమెకు వెన్నుదన్నుగా సొసైటీ నిలబడుతోంది అంటే అభినందనీయమే కదా… డిపాజిట్ రాదు అంటాడు ఒకాయన, సో వాట్..? అది ప్రజలు ఆలోచించుకుంటారు, కొల్లాపూర్ ప్రజలు ఆలోచిస్తారు… అబ్బే, ఆమెకు వోట్లు వేస్ట్ అనుకుంటే వాళ్లే అవాయిడ్ చేస్తారు కదా… ఈ సోషల్ దాడులు దేనికి..? ఒక దళిత మహిళ ధైర్యంగా నిలబడి, జనంలోకి వెళ్లి ‘ప్రశ్నలు వేస్తోంది’… ఎంతమందికి చేతనైంది ఈ నిరసన..? ఈ చైతన్యం..?

గెలుపో ఓటమో జానేదేవ్… ఈ భౌతిక, మానసిక, సోషల్ దాడులు ఆమె మరింత రాటుదేలేలా చేస్తున్నయ్… ఆమె రాజకీయాల్లో కొనసాగాలి… కాదు, ఆమెలాగా చాలామంది రావాలి… కోట్లకుకోట్లు బలిసినవాళ్లు, అటూఇటూ అమ్ముడుపోయే సస్తా మాల్ వంటి లీడర్లు తప్ప పేద కుటుంబాలు రాజకీయ తెర మీదకు రావద్దా…!! ఈమధ్య అలాంటి బలుపు వారసులు తమ అజ్ఙానాన్ని ప్రదర్శిస్తున్నారు కదా ప్రచారాల్లో… ఏం..? వాళ్లకంటే బర్రెలక్క చాలా నయం కాదా…!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ధర్మస్థలపై ఏదో భారీ కుట్ర… ఆమె కూతురు ఓ అబద్ధం… ఓ కల్పిత కథ..!!
  • చివరకు పండుగల స్పెషల్ షోలలోనూ అవే రోత స్కిట్లా..?!
  • ఈ సీరీస్‌లో నిజం ఏదైనా ఉందీ అంటే… అది ఆ డిస్‌క్లెయిమర్ మాత్రమే…
  • కేటీయార్ వింత పొలిటికల్ ధోరణి..! రాను రాను ఓ సైద్ధాంతిక శూన్యత..!?
  • మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం… ఆహా… ఏవీ నాటి ఆర్ద్ర గీతాలు…?
  • ఎవరి పదవి ఊడబీకాలన్నా… ఏదో ఓ కేసులో అరెస్టు చేస్తే సరి ఇక..!!
  • అదే కథ, అదే పాత్ర… విజయచందర్ సూపర్ హిట్… నాగార్జున ఫ్లాప్…
  • కాళేశ్వరంపై బీఆర్ఎస్ క్యాంప్ ఆపసోపాలు… నానా విఫల సమర్థనలు…
  • కాంతారా బీజీఎం మోతల వెనుక ఈ ఆఫ్రికన్ గిరిజన వాయిద్యం..!
  • సింగరేణి మట్టి కూడా బంగారమే… అత్యంత విలువైన ‘రేర్ ఎర్త్ మినరల్స్’…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions