Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ బరాజులు పనికిరానట్టేనా? కాళేశ్వరం తాజా స్థితిపై సాంకేతిక విశ్లేషణ !!

July 21, 2026 by M S R

.

లక్ష కోట్ల అవినీతి ప్రాజెక్టు కాళేశ్వరంపై ఓ సీరియస్ ఇష్యూ, కేసీయార్ నిర్వాకం పుణ్యమాని అదిప్పుడు ఎంత చిక్కు ప్రశ్నగా మిగిలిందీ అంటే, బహుశా ప్రపంచంలోనే ఇంతటి చెత్తా ప్లానింగ్ మరే సాగునీటి ప్రాజెక్టులోనూ లేదేమో… కాస్త ఇంజనీరింగ్ పరిభాషలో వివరాల్లోకి వెళ్దాం… కెేవలం రాజకీయ బురద తప్ప మరేమీ పట్టని విజ్ఞులు ఈ కథనానికి దూరం ఉండాలి ప్లీజ్…

నిన్నటి ఉత్తమకుమార్ రెడ్డి ఆఫీసు నుంచి ఓ ప్రెస్ నోట్… అందులో కాళేశ్వరం బరాజుల దురవస్థ మీద అధ్యయనం దాదాపు పూర్తయింది, ఇక రిపేర్లు చేపట్టడమే, కేంద్ర జలసంస్థల సూచనల మేరకే వ్యవహరిస్తాం అనేది సారాంశం… అందులో డయాఫ్రమ్ వాల్ మీద ప్రాథమిక అంచనా ఉంది, తదుపరి నిర్ణయం పరిశీలిస్తాం అనే ఓ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది…

Ads

సాధారణంగా డయాఫ్రమ్ వాల్ అనగానే పోలవరం ప్రాజెక్టు, జగన్ పాలనలో కొట్టుకుపోవడం, ఇప్పుడు చంద్రబాబు పునర్నర్మిస్తుండటం గుర్తొస్తాయి… ఇంకాస్త సాంకేతిక వివరాల్లోకి వెళ్దాం… పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌ను ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (Earth-cum-Rock Fill – ECRF Dam) పద్ధతిలో నిర్మిస్తున్నారు….

ఈ డ్యామ్‌లో మట్టి (Earth), రాళ్లు (Rock), బరక మట్టి వంటి సహజ సిద్ధమైన పదార్థాలను పొరలు పొరలుగా కూర్చి పటిష్టంగా నిర్మిస్తారు. మధ్యలో నీరు ఇంకిపోకుండా (Seepage నివారించడానికి) సేఫ్టీ కోసం భారీ డయాఫ్రమ్ వాల్ (Diaphragm Wall) భూమిలో ఏర్పాటు చేశారు. ఈ ప్రధాన ECRF డ్యామ్ సుమారు 2,454 మీటర్ల పొడవుతో నది ప్రవాహానికి అడ్డంగా రూపుదిద్దుకుంటోంది… 

polavaram

పోలవరం వద్ద నేల స్వభావం, వరద ఉధృతి రీత్యా అక్కడ డ్యామ్ సేఫ్టీ కోసం (ప్రధనంగా నీటి నిల్వకు ఉద్దేశించింది కాబట్టి) కొన్ని మీటర్ల లోతు నుంచీ సీపేజీ లేకుండా, ఓ పటిష్టమైన వాల్ నిర్మించడమే డయాఫ్రమ్ వాల్… మరి కాళేశ్వరం బరాజులు..?

వీటిని ప్రధానంగా తాత్కాలిక నీటిని నిల్వ చేయడానికి (Water diversion లేదా pondage కోసం), నీటిని మళ్లించడం, లేదా ఎత్తిపోయడం కోసం నిర్మిస్తారు తప్ప, భారీ రిజర్వాయర్లలాగా వందల టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి కాదు…. నీటిమట్టం ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ గేట్లు ఎత్తుతుంటారు…

ఇవి నది మట్టానికి సమాంతరంగా ఉండి, మొత్తం పొడవునా భారీ గేట్లతో నిండి ఉంటాయి. నదికి వచ్చే వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువకు వదిలేయడం ప్రధాన విధి. అదే ECRF డ్యామ్‌లైతే మట్టి, రాళ్లతో గట్టి కట్టలా నిర్మిస్తారు; దానిపై గేట్లు అమర్చడం కుదరదు… గేట్ల ద్వారా నీటిని నియంత్రించాలంటే కాంక్రీట్ స్పిల్‌వేలు మాత్రమే సాధ్యమవుతాయి…

భారీ ఎత్తున నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లకు మాత్రమే ECRF డ్యామ్‌లు అవసరం అవుతాయి… వాటి సేఫ్టీ కోసం డయాఫ్రమ్ వాల్ వంటి సాంకేతిక రక్షణ అవసరం… ఎందుకంటే ఇవి వేల టన్నుల నీటి బరువును, ఒత్తిడిని తట్టుకోగలవు. కానీ బరాజులకు ఆ స్థాయి నీటి ఒత్తిడి ఉండదు కాబట్టి, వాటిని పూర్తిగా కాంక్రీట్, పైల్ ఫౌండేషన్ (Concrete Piers and Apron)తోనే నిర్మిస్తారు…

పోలవరం విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది: నీటిని భారీ ఎత్తున నిల్వ చేసే రిజర్వాయర్ ప్రధాన భాగాన్ని ECRFగానూ, వరద నీటిని నియంత్రించి కిందకు వదిలే గేట్ల వ్యవస్థను కాంక్రీట్ స్పిల్‌వేగానూ వేర్వేరుగా నిర్మిస్తున్నారు.

అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డలు రిజర్వాయర్లు కావు – అదంతా కాంక్రీట్ పిల్లర్లు, గేట్లతో నిర్మించిన బ్యారేజీలే (Barrages). గోదావరి నది ప్రవాహాన్ని అడ్డుకోకుండా, అవసరమైనప్పుడు నీటిని మళ్లించడానికి వీటిని నిర్మించారు. అలాంటి బరాజులకు కూడా ‘డయాఫ్రమ్ వాల్’ (Diaphragm Wall) ఎందుకు అవసరం, అసలు సీకెంట్ పైల్స్‌కు, దీనికి తేడా ఏమిటనే అంశాలపై స్పష్టత అవసరం…

1. బరాజుల కింద పునాది, “కట్-ఆఫ్ వాల్” (Cut-off Wall) అవసరం: ఇవి నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లు కాకపోయినా, గేట్లు కిందకు దించినప్పుడు వాటి వెనక భారీ ఎత్తున నీరు నిలుస్తుంది. నది ప్రవాహం కింద ఇసుక పొరలు (Sandy strata) ఉంటాయి. ఈ నీరు బరాజ్ కింది నుంచి ప్రవహించే ప్రయత్నం చేస్తుంది (Seepage లేదా Piping Effect అంటారు). ఇలా నీరు కింద నుంచి ప్రవహిస్తున్నప్పుడు, అది బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుకను కోసుకుంటూ (Erosion) పోతుంది.

సో సేఫీ కోసం, ఈ నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడానికి బరాజుకు ఎగువన, దిగువన (Upstream and Downstream) అడ్డుగోడలు లేదా కట్-ఆఫ్ వాల్స్ అవసరం. ఇవే నీటిని కింద నుంచి చొచ్చుకుపోకుండా ఆపుతాయి.

medigadda

2. సీకెంట్ పైల్స్ (Secant Piles) ఎందుకు వాడారు? ఎక్కడ విఫలమయ్యాయి?

  • సాధారణంగా ఇలాంటి ఇసుక నేలల్లో కట్-ఆఫ్ వాల్స్ కోసం కాంక్రీట్ డయాఫ్రమ్ వాల్‌ను ఒకే వరుసలో నిరంతరంగా (Continuous wall) నిర్మించాలి.

  • కానీ అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డల నిర్మాణ సమయంలో వేగంగా పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో, కొన్ని ప్రదేశాలలో రాతి పొరలు, ఇసుక మిశ్రమం కారణంగా డయాఫ్రమ్ వాల్‌కు బదులుగా సీకెంట్ పైల్స్ (Secant Piles) పద్ధతిని వాడారు.

  • సీకెంట్ పైల్స్ అంటే…: ఒకదానితో ఒకటి అతికేలా వరుసగా గుండ్రటి కాంక్రీట్ పైల్స్‌ను భూమిలోకి దింపుతారు.

  • వచ్చిన సమస్య…: ఈ పైల్స్ వేసేటప్పుడు కొన్ని చోట్ల గ్యాప్‌లు రావడం లేదా రెండు పైల్స్ మధ్య సరిగ్గా బాండింగ్ కుదరకపోవడం జరిగింది. దీనివల్ల కాలక్రమేణా నీరు ఆ సన్నని ఖాళీల గుండా ప్రవహించి, కింద ఉన్న ఇసుకను మెల్లమెల్లగా కొట్టుకుపోయింది. దీనివల్లే మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీలలో బుంగలు పడటం జరిగాయని NDSA (నేషనల్ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ) కమిటీ తేల్చింది.

kaleswaram

3. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ఎలా సూటవుతుంది? బ్యారేజీకి ఇబ్బంది లేదా?

బ్యారేజీ బరువు మొత్తం కాంక్రీట్ పియర్స్ (Piers/Pillars) , వాటి కింద ఉండే రాఫ్ట్ ఫౌండేషన్ (Raft Foundation) మీద ఉంటుంది.

  • ఇప్పుడు నిపుణులు సిఫార్సు చేస్తున్న డయాఫ్రమ్ వాల్ అనేది బరాజు బరువును మోయడానికి కాదు. బరాజుకు ఎగువన, దిగువన రక్షణ కవచం (Seepage Cut-off Barrier) లాగా పనిచేస్తుంది.

  • భూమిలో సుమారు 40 మీటర్ల లోతు వరకు ఎటువంటి రంధ్రాలు లేదా ఖాళీలు లేకుండా ఒకే మందపాటి కాంక్రీట్ గోడను (Continuous Concrete Wall) నిర్మిస్తారు.

  • ఇది ఉంటే, బ్యారేజీ కింద నుంచి నీరు ప్రవహించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. ఇసుక కదలదు కాబట్టి బ్యారేజీ పునాదులు సురక్షితంగా ఉంటాయి.

అందువల్ల, బరాజు నిర్మాణం పిల్లర్ల మీద ఉన్నప్పటికీ, ఆ పిల్లర్ల పునాదుల కింద ఇసుక జారిపోకుండా అడ్డుకోవడానికి ఈ డయాఫ్రమ్ వాల్ సాంకేతికంగా అత్యంత ఖచ్చితమైన మరియు శాశ్వత రక్షణ మార్గమని నిపుణులు తేల్చారు.

medigadda

4. సమస్య మరింత సంక్లిష్టం…. ఇదే అసలు పాయింట్… మేడిగడ్డ లేదా ఇతర బరాజుల్లో ఇప్పటికే నిర్మించిన పిల్లర్లు (Piers), వాటి మీద ఉన్న భారీ కాంక్రీట్ రోడ్డు, గేట్లు ఉన్నచోట నేరుగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ కట్టడం అసాధ్యం…

దీనికి ఇంజనీరింగ్ రంగంలో ఉన్న ప్రత్యామ్నాయాలు, సమస్యలు కూడా చూద్దాం…

  • భారీ యంత్రాలు పట్టవు…: డయాఫ్రమ్ వాల్ వేయడానికి ‘ట్రెంచ్‌ కట్టర్’ (Trench Cutter) లేదా ‘హైడ్రోమిల్’ వంటి భారీ క్రేన్లు, పెద్ద మట్టి తవ్వే యంత్రాలు కావాలి. ఇవి బ్యారేజీ పిల్లర్ల మధ్యలో, పైభాగంలో ఉన్న గేట్లు, బ్రిడ్జ్ కింద పనిచేయడం చాలా కష్టం. ఒకవేళ చేయాలన్నా ఉన్న స్ట్రక్చర్‌కు తీవ్రమైన ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.

  • స్ట్రక్చర్‌ను తొలగించాల్సిందేనా?…: ఒకవేళ లోపల దెబ్బతిన్న ఫౌండేషన్‌ను పూర్తిగా బాగు చేయాలన్నా, లేదా కొత్తగా లోతైన కట్-అఫ్ వాల్ ఏర్పాటు చేయాలన్నా… దెబ్బతిన్న ఆ బ్లాక్ (ఉదాహరణకు మేడిగడ్డలో కుంగిన 7వ బ్లాక్ వంటివి) వద్ద ఉన్న పిల్లర్లు, స్లాబ్‌లు, గేట్లను పూర్తిగా తొలగించడం (Demolition) అనివార్యం అవుతుంది. వాటిని తొలగిస్తేనే భారీ యంత్రాలు లోపలికి వచ్చి సరిగ్గా డయాఫ్రమ్ వాల్ లేదా గ్రౌటింగ్ పనులు చేయగలవు.

  • ఎన్‌డీఎస్‌ఏ (NDSA) సిఫార్సులు…: అందుకే మేడిగడ్డ విషయంలో కేవలం ఏదో పైపైన మరమ్మతులు చేస్తే సరిపోదని, కుంగిన పిల్లర్లతో పాటు దానికి సంబంధించిన మొత్తం భాగాన్ని పూర్తిగా కూల్చివేసి మొదటి నుంచి పునాదుల దగ్గర నుంచి పటిష్టంగా పునర్నిర్మించాలని (Reconstruction) నిపుణుల కమిటీ బలంగా వాదించడానికి అసలు కారణం ఇదే…

బరాజు పైన ఉన్న నిర్మాణాలు అడ్డుగా ఉన్నప్పుడు లోపల భూమి లోపలికి డయాఫ్రమ్ వాల్ వేయడం కుదరదు కాబట్టి, ఆయా భాగాలను తొలగించడం లేదా ప్రత్యామ్నాయంగా హై-ప్రెషర్ గ్రౌటింగ్ (High-pressure Grouting) వంటి పద్ధతులను పరిశీలిస్తుంటారు. కాకపోతే పూర్తి స్థాయి భద్రత కోసం కూల్చి కట్టడమే శాశ్వత పరిష్కారంగా చూస్తున్నారు.

kaleswaram

5. ఆర్థికంగా భారీ నష్టం జరగడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి…

  • నిర్మించిన దానికి మళ్లీ ఖర్చు (Reconstruction / Remedial Cost)…: ఇప్పటికే వేల కోట్లు వెచ్చించి కట్టిన బరాజులు దెబ్బతిన్న తర్వాత, వాటిని బాగు చేయడానికి లేదా కూల్చి కొత్తగా నిర్మించడానికి మళ్లీ మొదటి నుంచి వందల, వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే ఒకే నిర్మాణానికి రెండుసార్లు ప్రజాధనం వెచ్చించినట్లవుతుంది.

  • భారీ వడ్డీ భారం (Debt & Interest Burden)…: ఈ ప్రాజెక్టుల కోసం కార్పొరేషన్ల పేరుతో (Off-budget borrowings) తెచ్చిన వేల కోట్ల అప్పులకు సంబంధించి అసలు సంగతి పక్కన పెడితే, కేవలం కట్టే వడ్డీయే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక భారంగా మారింది. ప్రాజెక్ట్ నుంచి ఆశించిన స్థాయిలో ఆదాయం లేదా ప్రత్యక్ష ప్రయోజనం రాకపోవడంతో ఈ భారం మరింత ఎక్కువైంది.

  • నిరుపయోగంగా మారిన నిధులు…: సరిగ్గా ప్రణాళిక లేకపోవడం, పునాదుల్లో లోపాలు తలెత్తడంతో ప్రారంభించిన కొన్ని ఏళ్లకే ఇవి నిరుపయోగంగా మారడం లేదా మూలన పడటం జరిగింద. దీనివల్ల పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలం దక్కకపోగా, నిర్వహణ వ్యహం (Maintenance & Repair costs) విపరీతంగా పెరిగిపోయింది.

kaleswaram

6. కేసీయార్ పెట్టిన శాపం- కాళేశ్వరం …. నిష్ఠురంగా ఉన్నా ఇదే నిజం… ఇప్పుడు బరాజులను వినియోగంలోకి తేవాలంటే డయాఫ్రమ్ వాల్స్ కట్టాలంటే, మళ్లీ బరాజులు కట్టినంత వ్యయం, కాదు, రెట్టింపు… దీనికి బదులు తుమ్మిడిహెట్టి ఎగువన  వార్ధా, వైన్‌గంగా కలిసేచోెట సంయుక్త బరాజును కట్టి, అక్కడి నుంచి సుందిళ్లకు, ఆపై ఎల్లంపల్లికి ఎత్తిపోయడం చవక, ప్రయోజనకరం… మరి సుందిళ్ల సేఫ్టీ కోసమైనా డయాఫ్రమ్ వాల్ కావాలి అంటారా..? మళ్లీ చిక్కు ప్రశ్న… మొత్తానికి కేసీయార్ అధ్వాన డిజైనింగ్ ఫలితమే ఈ దరిద్రం..!! ఒక పాలకుడు ఎలా ఉండకూడదో చెప్పటానికి కేసీయార్- కాళేశ్వరం చరిత్రలో పర్‌ఫెక్ట్ ఉదాహరణ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Balochistan – భారత్ Vs చైనా Vs అమెరికా! జియోపాలిటిక్స్ !!
  • Balochistan – ఓ కొత్త దేశం పురుడు పోసుకుంది – కానీ..?
  • వావ్… బాబు గారు ఆల్రెడీ ఎల్‌నినో సంక్షోభాన్ని దాటేశారట..!
  • మధ్యవర్తిత్వం చేసిన- ఆ జర్నలిస్టులు, లాయర్లపైనా కేసు ?!
  • బాపు అంటే..? ఇదుగో ఈ కథ చదివితే అర్థమవుతుంది ఆ పదం విలువ..!!
  • మొత్తం 1000 – రెండు లివర్లు ఎక్స్‌ట్రా… ఈ మీల్స్ ఆంటీ ఇక సినిమా ఆంటీ !!
  • పిచాయ్ భార్య కోపం- మ్యాప్స్ పుట్టుకకు బీజం..! ఈ కథ నిజమా? అబద్ధమా?
  • పాడిందే పాటరా ! మోదీ పేరెత్తలేక… రేవంత్ మీద పెడ శోకాలు !!
  • రావణాయణం – ఒక ‘విలన్’ వెనుక పది తలల మేధో వైభవం !
  • KCR ఆ మాట అనకపోయినా రాసి ఉంటే మాత్రం ఆంధ్రజ్యోతి తప్పే !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions