Subramanyam Dogiparthi…. ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది . దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఈ పాట ఈ సినిమాను వంద రోజులు ఆడించటమే కాదు ; జనం వెయ్యేళ్ళు ఆస్వాదించే పాటయింది . మనసున్న జనం గుండెల్ని పిండే పాటయింది . ఈ పాటలో ప్రతి పదం అద్భుతం . దేవులపల్లి వారి పద విరాట రూపం . ఆ సాహిత్యానికి ధీటుగా ముఖ భావాలను చూపించింది వాణిశ్రీ . 1960s అంతా కళాభినేత్రిగా ప్రేక్షకుల మన్ననలను పొందటానికి వాణిశ్రీ చాలా కష్టపడి సద్వినియోగం చేసుకొంది .
Share this Article